Train News: రైలు ప్రయాణం ఎంతో సౌకర్యవంతంగా ఉంటుందని పలువురు భావిస్తారు. అందుకే దూరం వెళ్లాల్సి వచ్చినప్పుడు ట్రైన్ జర్నీకి ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. కానీ పెరుగుతున్న జనాభాకు సరిపడా రైళ్లు అందుబాటులో లేకపోవడంతో టికెట్లు దొరక్క ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. నెలల తరబడి ముందుగా నే టికెట్లు బుక్ చేసుకోవాల్సి వస్తుంది. అర్జెంట్ ప్రయాణాల సమయంలోనూ తత్కాల్ టికెట్ల అందుబాటులో ఉండటం లేదు. అయితే ట్రైన్ బయలుదేరేందుకు 5 నిమిషాలు ముందు కూడా టికెట్ బుక్ చేసుకోవచ్చని చాలామందికి తెలియదు.
చివరి నిమిషంలో ప్రయాణాలకు ఉపయోగకరంగా ఉండేందుకు రైల్వే శాఖ 5 నిమిషాల మూందు కూడా టికెట్లు బుక్ చేసుకునే అవకాశం కల్పిస్తుంది. ఏదైనా కారణాలవల్ల టికెట్ కన్ఫర్మ్ అయిన వ్యక్తులు వాటిని రద్దు చేసుకునే పక్షంలో ట్రైన్ లో ఖాళీ ఏర్పడుతుంది. వాటిని కావలసిన వారు బుక్ చేసుకునే సదుపాయాన్ని ఇండియన్ రైల్వేస్ తీసుకొచ్చింది. సాధారణంగా రైల్వే శాఖ ట్రైన్ బయలుదేరే ముందు 2 ఛార్టులను ప్రిపేర్ చేస్తుంది. ఒకటి 4 గంటల ముందు కాగా మరొకటి బయలుదేరే 5 నిమిషాల ముందు. గతంలో ఇది అరగంట కాగా ఇప్పుడు దాన్ని 5 నిమిషాలకు కుదించింది.

ఇలా ట్రైన్ టికెట్ బుక్ చేసుకోవడానికి మొదటగా ప్రిపేర్ కాబడిన చాట్ ఓపెన్ చేయాల్సి ఉంటుంది. దీనికోసం IRCTC యాప్ లోని చాట్ వేకెన్సీ ఆప్షన్ ఉపయోగించవచ్చు లేదా వెబ్‌సైట్ ద్వారా కూడా సమాచారం తెలుసుకోవచ్చు. ట్రైన్ నెంబర్ ఎంటర్ చేస్తే క్లాసులు వారీగా అందుబాటులో ఉన్న టికెట్లను చూపిస్తుంది. ఒకవేళ ఏవీ ఖాళీ లేకపోతే అక్కడ జీరో చూపిస్తుంది. ఈ విధంగా రైలు బయలుదేరే నిమిషాల ముందు కూడా టికెట్ బుక్ చేసుకునే అవకాశం ఉంది లేదా అప్పుడు ప్రత్యామ్నాయ ఏర్పాటు చేసుకోవచ్చు
ఇక్కడ ఇంకో విషయం ఏమిటంటే అందుబాటులో ఉన్న సీట్ల నుంచి మనకు కావాల్సిన దాన్ని ఎంచుకునే అవకాశం లభిస్తుంది. అయితే రైలు ఇతర స్టేషన్ లో ఎక్కేవారికి ఇది ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే అక్కడే ఫైనల్ చార్ట్ ప్రిపేర్ అయిపోతుంది. రైలు బయలుదేరిన అనంతరం బుకింగ్ అవకాశం ఉండదు. కాబట్టి అప్పటికప్పుడు రైలు ప్రయాణం చేయాలనుకునేవారు ఈ ఆప్షన్ ని వినియోగించుకుని బెనిఫిట్ పొందవచ్చు.


Click it and Unblock the Notifications