పడిపోతున్న క్రూడాయిల్ ధరలు.. పెట్రోల్, డీజిల్ రేట్లు తగ్గే ఛాన్స్ ?
నేడు బ్రెంట్ ఫ్యూచర్స్ అండ్ యుఎస్ వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ క్రూడ్ ఫ్యూచర్స్ ఏప్రిల్ 2021 తర్వాత మరోసారి కనిష్ట స్థాయికి చేరుకున్నాయి. గత వారం డోనాల్డ్ ట్రంప్ పరస్పర సంకలు వెల్లడించినప్పటి నుండి చమురు ధరలు ఈక్విటీల కంటే భారీగా పడిపోయాయి, OPEC+ ఉత్పత్తిని పెంచే ప్రణాళికల వల్ల ఈ తగ్గుదల మరింత పెరిగింది అని రకుటెన్ సెక్యూరిటీస్‌లో కమోడిటీ విశ్లేషకుడు సటోరు యోషిడా అన్నారు.

అంతేకాక గోల్డ్‌మన్ సాచ్స్, సిటీ అండ్ మోర్గాన్ స్టాన్లీ సోమవారం చమురు ధరల తగ్గుదలకు సంబంధించిన అంచనాలను సవరించాయి. మాంద్యం భయాల కారణంగా న్యాచురల్ గ్యాస్ ధరలు కూడా తగ్గాయి, బెంచ్‌మార్క్ డచ్ ఫ్రంట్-మంత్ కాంట్రాక్ట్ మెగావాట్ గంటకు 1.45 యూరోలు తగ్గి 35 యూరోలు లేదా మిలియన్ బ్రిటిష్ థర్మల్ యూనిట్లకు $11.26 కు చేరుకుందని LSEG డేటా చూపించింది. వారంలో రెండుసార్లు చమురు ధరల అంచనాలను తగ్గించిన బ్రోకరేజ్ సంస్థ గోల్డ్‌మన్ సాచ్స్ ఇవాళ ఏప్రిల్ 8 మంగళవారం రోజున వాణిజ్య యుద్ధం చెలరేగడం, సప్లయ్ పెరగడంతో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్‌కు $40 కంటే కిందకి పడిపోయే అవకాశం ఉందని తెలిపింది.
ప్రపంచ ముడి చమురు ధరలు గత వారం $75 స్థాయికి చేరుకోగా, బ్యారెల్‌కు దాదాపు $60కి పడిపోయాయి. డొనాల్డ్ ట్రంప్ వాణిజ్య యుద్ధం ఒత్తిడి, అమెరికాలో పెరుగుతున్న మాంద్యం భయాలు, ప్రపంచ డిమాండ్ లేకపోవడం ఇవన్నీ చమురు ధరలు పడిపోవడానికి సహకరించాయి. ఇక నిన్న అంటే సోమవారం నాలుగు సంవత్సరాల కనిష్ట స్థాయికి చేరుకున్న తర్వాత బ్రెంట్ క్రూడ్ బ్యారెల్‌కు $65.05 వద్ద ఉంది. వారంలో రెండుసార్లు చమురు ధరల అంచనాలను తగ్గించిన బ్రోకరేజ్ సంస్థ గోల్డ్‌మన్ సాచ్స్, ఏప్రిల్ 8, మంగళవారం, వాణిజ్య యుద్ధం చెలరేగడం మరియు సరఫరాలు పెరగడంతో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్‌కు $40 కంటే తక్కువగా పడిపోయే అవకాశం ఉందని తెలిపింది.
దింతో పెట్రోల్, డీజిల్ ధరలకు సంబంధించి అంచనాలు పెరిగాయి. ఇప్పటికే అత్యధిక స్థాయిలో పెట్రోల్, డీజిల్ లీటరు ధర, క్రూడ్ ఆయిల్ ధరలు మరింతగా పడిపోతే ఇంధన ధరకు తగ్గువచ్చని సుచనలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం పెట్రోల్ లీటరు ధర రూ.107 ఉండగా డీజిల్ ధర రూ.98గా ఉంది. అయితే క్రూడాయిల్ ధర బ్యారెల్కు మరింత పడిపోయి $40 కిందకి చేరితే ఇంధన ధరలు కూడా భారీగా తగ్గవచ్చు. మరోవైపు ప్రభుత్వం తాజాగా పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని పెంచింది. దింతో పెట్రోల్ పై ఎక్సైజ్ సుంకాన్ని రూ.2 పెంచగా, డీజిల్ పై ఎక్సైజ్ సుంకాన్ని రూ.2 పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది.


Click it and Unblock the Notifications