బీహార్ ఆర్థికంగా గత దశాబ్దంలో గణనీయమైన పురోగతి సాధించినా, ఆ అభివృద్ధి ప్రజల జీవితాల్లో స్పష్టమైన మార్పు తీసుకురాగలిగిందా అనేది ఇంకా పెద్ద ప్రశ్నగానే మిగిలింది. 2011-12లో రూ.2.5 ట్రిలియన్‌గా ఉన్న రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ 2023-24 నాటికి రూ. 8.5 ట్రిలియన్లకు పెరిగి 3.5 రెట్లు విస్తరించింది. అలాగే 2004-05 నుండి 2023-24 మధ్య తలసరి ఆదాయం ఎనిమిది రెట్లు పెరిగింది.
ఈ గణాంకాలు చూసిన వెంటనే బీహార్ అభివృద్ధి చరిత్ర సరికొత్త మలుపు తీసుకున్నదని అందరికీ అనిపించవచ్చు. అయితే వాస్తవానికి పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంది. దేశంలో పేదరికం అత్యధికంగా ఉన్న రాష్ట్రాల్లో బీహార్ ఇప్పటికీ ముందు వరుసలోనే నిలుస్తోంది. కొన్ని అంశాల్లో దాని పనితీరు మరింత ఆందోళన కలిగించే స్థితిలో ఉంది. అంతేకాకుండా దేశం మొత్తం హెచ్‌డీఐ స్కోరును కూడా తగ్గిస్తోంది.
బీహార్‌లోని ఈ వ్యత్యాసానికి ప్రధాన కారణం ఏంటంటే.. ప్రభుత్వం యువతకు ఉద్యోగాలు ఇవ్వలేకపోవడం. ఇవాళ దేశంలోని పలు రాష్ట్రాల్లో పనిచేసే నిర్మాణ కార్మికులు, ఫ్యాక్టరీ కార్మికులు, సేవల రంగ ఉద్యోగుల్లో పెద్ద భాగం బీహార్ నుంచే వస్తున్నారు. వలస శ్రామికులను పెద్ద ఎత్తున పంపించే ఈ ధోరణి బీహార్ ఎదుర్కొంటున్న పారిశ్రామిక వెనుకబాటుతనాన్ని స్పష్టంగా చూపిస్తోంది. భారతదేశంలో చాల రాష్ట్రాలు పరిశ్రమల అభివృద్ధిని పురోగతికి ప్రధానశక్తిగా ఎంపిక చేసుకున్నా..బీహార్ మాత్రం ఆ దిశలో సరైన పురోగతి నమోదు చేయలేదు.

ఇటీవల జరిగిన Bihar అసెంబ్లీ ఎన్నికల్లో NDA అద్భుతమైన మెజారిటీ సాధించిన నేపథ్యంలో..ఇప్పుడు రాష్ట్రం ఎదురుచూస్తున్న పెద్ద అవకాశమేమిటంటే పారిశ్రామికీకరణను ధైర్యంగా, వ్యూహపూర్వకంగా ముందుకు తీసుకెళ్లడం. అయితే ఇది అంత సులభమైన పని కాదు. ఇప్పటికీ రాష్ట్రంలో వ్యవసాయం మీద ఆధారపడే జనాభా 76 శాతం ఉండటం పారిశ్రామిక విస్తరణకు ప్రధాన సవాల్ గా మారింది. తయారీ రంగం బీహార్ స్థూల రాష్ట్ర దేశీయోత్పత్తికి కేవలం 7.6% మాత్రమే దోహదం చేస్తోంది. అంటే పరిశ్రమల ప్రాతిపదిక బలహీనంగా ఉందన్న మాట.
మౌలిక సదుపాయాల కొరత, ఎకోసిస్టమ్ లోపాలు, పెట్టుబడిదారులకు అనుకూల వాతావరణం లేకపోవడం..ఇవన్నీ కలిసి బీహార్ పారిశ్రామిక ప్రగతిని అడ్డుకున్నాయి. ఒకప్పటి ఉదాహరణగా, తమిళనాడులోని ఒక ప్రముఖ చక్కెర పరిశ్రమ బీహార్‌లో మిల్ ఏర్పాటు చేయడానికి లైసెన్స్ పొందినా, సరైన రవాణా మార్గాలు లేకపోవడంతో ఆ ప్రాజెక్ట్ మొదలయ్యేలోపే ఆగిపోయింది. ఈ సమస్యలను పరిష్కరించే బదులుగా, రాజకీయ నాయకులు ఉచితాల రాజకీయాన్ని ప్రోత్సహించడం ఎక్కువ చేశారు. ఈ ఎన్నికల్లో కూడా తేజస్వి యాదవ్ ఒక్కో కుటుంబానికి ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇస్తానని హామీ ఇచ్చినా, ప్రజలు ఆ ఆకర్షణీయ వాగ్దానాన్ని పెద్దగా పట్టించుకోలేదు.
ఇప్పుడు NDAకి ఉన్న పెద్ద బాధ్యతగా చెప్పవచ్చు. బీహార్‌కు ఒక నిజమైన అభివృద్ధి మోడల్‌ను అందించడం. దీని మొదటి అడుగు పెద్ద ఎత్తున పారిశ్రామికీకరణే. రాష్ట్రవ్యాప్తంగా రోడ్లు, పవర్, లాజిస్టిక్స్, ఇండస్ట్రియల్ పార్కులు వంటి మౌలిక సదుపాయాలను వేగంగా విస్తరించడం అత్యవసరం. బీహార్‌కు అనుకూలమైన రంగాలను చూసుకున్నట్లయితే.. ఫుడ్ ప్రాసెసింగ్, టెక్స్‌టైల్, లైట్ మాన్యుఫ్యాక్చరింగ్, అగ్రి-ఆధారిత పరిశ్రమలు వంటి వాటిని గుర్తించి ప్రత్యేక ప్రోత్సాహాలు ఇవ్వాలి.
ఈ సందర్భంలో ఒడిశా ఒక మంచి మోడల్. కార్మిక వనరులు ఎక్కువగా ఉన్నప్పటికీ, బిజెపి ప్రభుత్వం అక్కడ పెద్ద ఎత్తున పారిశ్రామిక సంస్కరణలు చేపట్టి రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించింది. శిక్షణా కార్యక్రమాల ద్వారా అక్కడి ప్రజలను నైపుణ్యాలతో తయారు చేసింది. నేడు ఒడిశా ఖనిజాలే కాదు.. ఖనిజేతర పరిశ్రమలను కూడా ఆకర్షిస్తోంది. టెక్స్టైల్ రంగంలో తమ కార్మికులు దక్షిణ భారత రాష్ట్రాల్లో మంచి పేరు తెచ్చుకున్నారని చూసి, అదే రంగంలో పెట్టుబడులను రాష్ట్రంలోకి తెచ్చే ప్రయత్నాలు కూడా ప్రారంభం అయ్యాయి.
బీహార్ కూడా ఇలాంటి దిశగా ముందడుగు వేస్తేనే, అక్కడి ప్రజలు తమ స్వస్థలంలోనే మంచి ఉద్యోగాలను పొందే రోజు రానుంది. NDA ప్రభుత్వం ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని రాష్ట్ర ఆర్థిక దిశను మార్చడానికి బలమైన, దూరదృష్టితో కూడిన నిర్ణయాలు తీసుకోవాలి. అప్పుడే బీహార్ నిజమైన అభివృద్ధి దిశగా అడుగులు వేయగలదని నిపుణులు సూచిస్తున్నారు.
More From GoodReturns

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదల ఎంతో తెలుసా.. మార్చి 20, శుక్రవారం ధరలు ఇవే..

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Bengaluru: ట్రాఫిక్ కష్టాలకు గుడ్ బై.. ఈ యువతి ఐడియా నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది!

క్రెడిట్ కార్డు క్లోజ్ చేసిన 10 ఏళ్ళ తర్వాత రూ. 33 లక్షలు కట్టాలని బ్యాంక్ నోటీసులు.. కస్టమర్ ఏం చేశాడంటే..

బంగారం ధరలు ఈ స్థాయి వద్దకు దిగబోతున్నాయి.. కొనుగోలుపై కీలక నిర్ణయం తీసుకోమంటున్న ఆర్థిక నిపుణులు

Bengaluru: సిలికాన్ వ్యాలీకి ఏమైంది? టెక్ కంపెనీలు బెంగళూరుని వదిలి ఎందుకు వెళ్లిపోతున్నాయి?



Click it and Unblock the Notifications