చెక్ రాయడానికి బ్లాక్ పెన్ వాడొచ్చా ? ఆర్బీఐ రూల్ ఏంటి ? సోషల్ మీడియాలో చెక్కర్లు..
ఈ రోజుల్లో ప్రతిఒక్కరి చేతుల్లో స్మార్ట్ ఫోన్ ఒక భాగంగా మారింది. ఏ సమాచారం ఆయిన ఇలా క్షణాల్లో చేరవయవచ్చు. అలాగే మనకు వచ్చే సమాచారం కూడా ఎంతవరకు వాస్తవం అనేది కూడా ఆలోచించాలి. ప్రస్తుతం సోషల్ మీడియా పోస్టుల ప్రభావం ప్రజల్లో చాలా ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి సైట్లలో ఏదైనా వార్త కనిపించినా.. దాని నిజస్వరూపం తెలియక జనాలు పూర్తిగా నిజమనే నమ్ముతున్నారు. కానీ వీటిలో కనిపించే వార్తలు కొన్ని నిజం కాగా కొన్ని తప్పుడు సమాచారం వార్తలు. అయితే తాజాగా బ్లాక్ ఇంక్ పెన్నుతో చెక్కులు రాయడం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిషేధించింది అంటూ ఓ వార్త నెటిజన్లను కలవరపరిచింది. దింతో ఈ వార్త పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది అలాగే ఇలాంటి సమాచారం వెనుక ఉన్న నిజాన్ని చాలా మంది ప్రశ్నించడానికి దారితీసింది.
కానీ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIP) Xఅకౌంట్లో ఈ వార్తను ఫేక్ అని కొట్టి పారేసింది. బ్లాక్ పెన్నుతో చెక్కులు రాయడం నిషేధిస్తూ ఆర్బీఐ ఉత్తర్వులు జారీ చేసినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ సమాచారం పూర్తిగా తప్పు. చెక్కులపై రాయడానికి నిర్దిష్ట రంగును ఉపయోగించాలా వద్దా అనే దానిపై ఎటువంటి మార్గదర్శకాలను జారీ చేయలేదని ఆర్‌బిఐ తెలిపింది. ఖచ్చితమైన సమాచారం కోసం అధికారిక సోర్సెస్ పై మాత్రమే ఆధారపడాలని BIP ప్రజలను కోరింది. సామాజిక మాధ్యమాల్లో వ్యాపించే తప్పుడు వార్తలపై ప్రజలకు కూడా అవగాహన కల్పించాలని సూచించారు.

చెక్కులు రాయడంపై ఆర్‌బీఐ ఏం చెబుతోంది?:
ఆర్‌బీఐ నిబంధనల ప్రకారం కస్టమర్‌లు పర్మనెంట్ ఇంక్‌ని ఉపయోగించి చెక్కులపై స్పష్టంగా, చెరగని విధంగా రాయాలి. రిసీవర్ పేరు లేదా అమౌంట్ మొత్తం వంటి ముఖ్యమైన వివరాలను ఎటువంటి మార్పులు లేదా తప్పులు చేయలేని విధంగా వ్రాయాలి. ఏవైనా మార్పులు అవసరమైతే కొత్త చెక్కు జారీ చేయాలి. ఇలా చేయడం వల్ల మోసాలని నిరోధించడంలో సహాయపడుతుంది. సోషల్ మీడియాలో ఏదైనా ఫేక్ ఇన్‌ఫర్మేషన్ స్ప్రెడ్ అయితే..అఫీషియల్ వెబ్‌సైట్లలోని వివరాలను చెక్ చేయండి. ఏదైనా నిజమైన ప్రకటనలు లేదా సమాచారం వచ్చినప్పుడు అవి వెంటనే వార్తల్లోకి వస్తాయి. దీని ద్వారా మనం ఏదైనా సమాచారం పై నిజం ఏంటో తెలుసుకోవచ్చు.


Click it and Unblock the Notifications