Silicon Valley Bank: ప్రస్తుతం అమెరికాల్ సిలికాన్ వ్యాలీ బ్యాంక్ పెను సంచలనంగా మారింది. బ్యాంక్ షేర్లు దాదాపు 85 శాతం కుప్పకూలటంతో రెగ్యులేటర్లు రంగంలోకి దిగారు.

రెగ్యులేటర్ చర్యలు..
కాలిఫోర్నియా బ్యాంకింగ్ రెగ్యులేటర్లు శుక్రవారం స్టార్టప్-ఫోకస్డ్ సిలికాన్ వ్యాలీ బ్యాంక్‌ను మూసివేసినట్లు ఒక ప్రకటనలో తెలిపింది. బ్యాంక్ డిపాజిట్లను నియంత్రించడానికి ఫెడరల్ డిపాజిట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్‌ను నియమించినట్లు తెలిపింది. బ్యాంక్ వెబ్‌సైట్‌లోని ఖాతా నిల్వలు, డబ్బు బదిలీలను చూపించాల్సిన క్లయింట్ డ్యాష్‌బోర్డ్ శుక్రవారం మధ్యాహ్నం డౌన్ అయిందని బ్యాంక్ UK ఆధారిత క్లయింట్ రాయిటర్స్ వార్తా సంస్థకు వెల్లడించారు.

సోమవారం వరకు బంద్..
సిలికాన్ వ్యాలీ బ్యాంక్ ప్రధాన కార్యాలయంతో పాటు అన్ని శాఖలు మార్చి 13న తిరిగి తెరవబడతాయని తెలుస్తోంది. డిపాజిటర్లను రక్షించడానికి, FDIC డిపాజిట్ ఇన్సూరెన్స్ నేషనల్ బ్యాంక్ ఆఫ్ శాంటా క్లారా(DINB)ని సృష్టించింది. మార్చి 13, 2023లోపు వారి బీమా చేసిన డిపాజిట్‌లకు పూర్తి యాక్సెస్ ఉంటుంది. 250,000 డాలర్ల కంటే ఎక్కువ సొమ్ము కలిగి ఉన్న ఖాతాలను వినియోగదారులు FDIC టోల్-ఫ్రీని 1-866-799-0959లో సంప్రదించాలి.

ఎందుకు బ్యాంక్ కుప్పకూలింది..?
నిధుల కోసం కష్టపడుతున్న స్టార్టప్‌ల నుంచి డిపాజిట్లు తగ్గిపోవడంతో బ్యాంక్ తన బ్యాలెన్స్ షీట్‌ను పెంచుకోవడానికి 2.25 బిలియన్ డాలర్ల విలువైన షేర్లను విక్రయించాలని నిర్ణయించింది. ఈ ప్రకటనతో బ్యాంక్ మార్కెట్ విలువ రూ.6.50 లక్షల కోట్లు(80 బిలియన్ డాలర్లు) మేర ఆవిరైంది. బ్యాంక్ షేర్ విలువ దాదాపు 60.41 శాతం క్షీణించింది. ఈ సమస్య కేవలం అమెరికాకు మాత్రమే పరిమితమైనప్పటికీ.. ఆ ప్రభావం ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లపై కనిపిస్తోంది. జూన్ 2020 తర్వాత అమెరికా బ్యాంక్ ఇండెక్స్ ఇంత భారీ స్థాయిలో పతనం కావటం ఇదే తొలిసారి.


Click it and Unblock the Notifications