Stock Exchange: BSE, NSEలకు తోడు ముచ్చటగా ముడో స్టాక్ ఎక్స్ఛేంజ్.. ఈక్విటీ, కరెన్సీ, కమొడిటీల్లో ట్రేడింగ్
Stock Exchange: దేశ, విదేశాలకు చెందిన పెట్టుబడుదారులు ట్రేడింగ్, ఇన్వెస్ట్ చేయడానికి భారత్ లో రెండు ప్రముఖ స్టాక్ ఎక్స్ఛేంజ్ లు ఉన్నాయి. వాటిలో ఒకటి అత్యంత పూరతన బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ కాగా మరొకటి నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్. అయితే గతంలో మూసివేయబడిన మరో ఎక్స్ఛేంజ్ తిరిగి ఆపరేషన్స్ జరిపేందుకు సిద్ధమవుతున్నట్లు నివేదికలు వెలువడుతున్నాయి.
మార్కెట్ నియంత్రణ సంస్థ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (SEBI) నుంచి సానుకూల సంకేతాలతో మరో ఎక్స్ఛేంజ్ వాడుకలోకి రాబోతోంది. మార్చి-ఏప్రిల్ 2024 నాటికి దేశంలో మూడవ ఎక్స్ఛేంజ్‌గా కలకత్తా స్టాక్ ఎక్స్ఛేంజ్ (CSE) పునరాగమనం చేయాలని భావిస్తున్నట్లు ఒక సీనియర్ అధికారి తెలిపారు.

రెగ్యులేటరీ మరియు కంప్లయన్స్ సమస్యల కారణంగా ఏప్రిల్ 2013లో CSEని సెబీ ట్రేడింగ్ చేయకుండా నిషేధించింది. అయితే ఇప్పుడిది తిరిగి పునరాగమనం చేయబోతోంది. 'మేము త్వరలో దేశంలోని మూడవ ఈక్విటీ ఎక్స్ఛేంజ్ గా తిరిగి వస్తాము. దీనిపై మాకు సానుకూల అభిప్రాయం ఉంది. మేము కొన్ని చర్యలకు కట్టుబడి ఉండాల్సి ఉంది. జనవరి నాటికి అవి కాస్తా పూర్తవుతాయి' అని CSE చీఫ్ జనరల్ మేనేజర్ ధీరజ్ చక్రవర్తి వెల్లడించారు.
ప్రస్తుతం CSE తన కస్టమర్లకు NSE ప్లాట్‌ఫారమ్‌లో ట్రేడింగ్ చేయడానికి సౌకర్యాలను కల్పించి మనుగడ సాగిస్తోంది. 'సెబీ ఆమోదంతో, కలకత్తా హైకోర్టు నిర్ణయానికి లోబడి ట్రేడింగ్ మరియు సెటిల్‌మెంట్ పునఃప్రారంభించాలని CSE భావిస్తోంది. అత్యాధునిక సాంకేతికతతో స్వంత ప్లాట్‌ఫారమ్‌లో పోర్ట్‌ఫోలియోను విస్తరించాలని చూస్తోంది. కరెన్సీ మరియు కమోడిటీ ట్రేడింగ్‌ను కూడా అందించాలని ప్రయత్నిస్తోంది' అని CSE ఛైర్మన్ దీపాంకర్ బోస్ వాటాదారులకు తెలియజేశారు.


Click it and Unblock the Notifications