Coco Price Hike: సాధారణంగా చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు చాక్లెట్స్, ఐస్ క్రీమ్స్, కేక్స్ అంటే ఇష్టపడే వాళ్లు ఎక్కువ సంఖ్యలో ఉంటుంటారు. అయితే తాజాగా వీరందరికీ షాక్ ఇచ్చే వార్త ఒకటి సిద్ధంగా ఉంది.
చాక్లెట్లు, ఐస్ క్రీంలు, కేక్‌ల కోసం మీరు అధిక ధరలు చెల్లించాల్సి రావచ్చు. ఆకాశాన్నంటుతున్న కోకో ధరల ప్రభావం ఇప్పుడు చాక్లెట్ ఉత్పత్తులపై కనిపించబోతోంది. కేవలం చాక్లెట్ తయారీదారులే కాదు, డైరీ దిగ్గజం అమూల్, ఐస్ క్రీమ్ బ్రాండ్ బాస్కిన్ రాబిన్స్ సహా మిగిలిన కంపెనీలు సైతం అధిక కోకో ధరల ప్రభావాన్ని అనుభవించడం ప్రారంభించాయి. అమూల్ బ్రాండ్‌ను కలిగి ఉన్న గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ MD జయేన్ మెహతా కంపెనీ తన చాక్లెట్ల ధరలను 10 నుంచి 20 శాతం పెంచే ఆలోచనలో ఉన్నట్లు చెప్పారు.

దేశంలో కిలో కోకో గింజల ధర రూ.150-రూ.250 నుంచి రూ.800కి పెరిగింది. డార్క్ చాక్లెట్ సెగ్మెంట్‌లో మాకు అతిపెద్ద మార్కెట్ వాటా ఉంది. ఇది కోకో బటర్‌ను కీలక పదార్ధంగా ఉపయోగిస్తుంది. ఈ పెంపు దాదాపు రెండు నెలల్లో అమలులోకి వస్తుంది. అమూల్ ప్రస్తుతానికి ఐస్ క్రీమ్‌లు, పానీయాల ధరలను కొనసాగించింది. అధిక చాక్లెట్ ధరలు దాని మార్కెట్ వాటాను తగ్గించగలవని భావించడం లేదు. ఐస్ క్రీం వంటి కాలానుగుణ ఉత్పత్తి ధరలను పెంచడం చాలా సులభం కాదని జయేన్ మెహతా చెప్పారు.
కోకో ధరల పెంపు వల్ల అమెరికన్ ఐస్ క్రీం బ్రాండ్ బాస్కిన్ రాబిన్స్ కూడా ప్రభావితమైంది. దేశంలో బాస్కిన్ రాబిన్స్ మాస్టర్ ఫ్రాంచైజీ హక్కులను కలిగి ఉన్న గ్రావిస్ ఫుడ్స్ CEO మోహిత్ ఖట్టర్ మాట్లాడుతూ అనేక కోకో ఆధారిత ఉత్పత్తుల ధరలు మునుపటితో పోలిస్తే 70-80% పెరిగాయని చెప్పారు. పెరిగిన కోకో ధరలను తమ కస్టమర్లకు బదిలీ కాకుండా చూసుకునేందుకు తాము ప్రయత్నిస్తున్నట్లు ఆయన తెలిపారు. సీజన్ ముగిసిన తర్వాత తాము పరిస్థితిని మళ్లీ అంచనా వేసి తదుపరి చర్యపై నిర్ణయం తీసుకుంటామని చెప్పాడు. ఈ వేసవిలో ఇంకా మంచి అమ్మకాలు జరుగుతాయని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు.
హవ్మోర్ ఐస్ క్రీం ఇప్పటికే సంవత్సరం ప్రారంభంలో ధరలను స్వల్పంగా పెంచింది. దాని ప్రస్తుత ధరల స్థాయిని కొనసాగించడానికి ప్రయత్నిస్తుందని కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ కోమల్ ఆనంద్ చెప్పారు. కోకో ధరల పెరుగుదల ప్రభావాన్ని తగ్గించేందుకు ఇతర మార్గాలను అన్వేషిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. అమూల్, బాస్కిన్ రాబిన్స్, హవ్మోర్ ఐస్ క్రీమ్ కోకో ధరల పెరుగుదలతో విభిన్న మార్గాల్లో వ్యవహరిస్తున్నాయి. అమూల్ ధరలను పెంచాలని యోచిస్తుండగా, బాస్కిన్ రాబిన్స్, హవ్మోర్ ఐస్ క్రీమ్ వ్యూహాత్మక చర్యలను ఉపయోగించడం ద్వారా కోకో ఖర్చులు పెరిగినప్పటికీ ధరలను స్థిరంగా ఉంచాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి.


Click it and Unblock the Notifications