న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థికమంత్రి నిర్మల సీతారామన్ ఇంకాస్సేపట్లో లోక్‌సభలో బడ్జెట్ ప్రతిపాదనలను ప్రవేశపెట్టనున్నారు. ఈ ఉదయం 11 గంటలకు బడ్జెట్ ప్రసంగం ప్రారంభం కానుంది. సుమారు రెండు గంటల పాటు కొనసాగే అవకాశాలు ఉన్నాయి. రైల్వే బడ్జెట్‌ను కూడా నిర్మల సీతారామనే ప్రవేశపెడతారు. ఇదివరకు సార్వత్రిక బడ్జెట్, రైల్వే బడ్జెట్ వేర్వేరుగా కొనసాగాయి. భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ఏర్పాటైన తరువాత ఈ రెండింటినీ విలీనం చేసింది.
బడ్జెట్ ప్రతిపాదనలను దృష్టిలో పెట్టుకుని కేంద్ర మంత్రివర్గం ఈ ఉదయం సమావేశం కానుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దీనికి అధ్యక్షత వహిస్తారు. బడ్జెట్ ప్రతిపాదనలను ఆమోదంచడం కోసమే కేబినెట్‌ను సమావేశపరిచారు. బడ్జెట్ ప్రతిపాదనలకు సంబంధించిన హైలైట్స్‌ను ఆర్థికమంత్రిత్వ శాఖ కార్యాలయం ఇప్పటికే ప్రధానమంత్రి కార్యాలయం, ఇతర మంత్రులకు సర్కులేట్ చేసింది. బడ్జెట్ హైలైట్స్‌కు సంబంధించిన వివరాలను మంత్రివర్గ సమావేశంలో నిర్మల సీతారామన్ ప్రస్తావిస్తారు. క్లుప్తంగా వాటి గురించి వివరిస్తారు.
మంత్రివర్గ ఆమోదం పొందిన వెంటనే ఆమె పార్లమెంట్ భవనానికి బయలుదేరి వెళ్తారు. సరిగ్గా 11 గంటలకు లోక్‌సభలో తన బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభిస్తారు. అంతకుముందు- ఆమె ఈ ఉదయం 8:45 నిమిషాలకు గంటలకు నార్త్ బ్లాక్‌లోని ఆర్థిక మంత్రిత్వ శాఖ కార్యాలయానికి చేరుకుంటారు. 9 గంటలకు బహీఖాతాను తీసుకుని మంత్రివర్గ సమావేశానికి బయలుదేరి వెళ్తారు. ఆమె వెంట ఆర్థిక శాఖ సహాయమంత్రులు, ఇతర అధికారులు ఉంటారు.

ఈ దఫా కూడా నిర్మల సీతారామన్ పేపర్‌లెస్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న విషయం తెలిసిందే. పేపర్‌లెస్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం వరుసగా ఇది రెండోసారి. గత ఏడాది కూడా డిజిటల్ రూపంలోనే బడ్జెట్ ప్రతిపాదనలను ఆమె సభలో ప్రవేశపెట్టారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు. డిజిటల్ ఫార్మట్‌లోనే బడ్జెట్ కాపీలను చదివి వినిపిస్తారు.
దీనికోసం ప్రత్యేకంగా ఓ యాప్‌ను కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. యూనియన్ బడ్జెట్ మొబైల్ యాప్ పేరుతో రూపొందించిన ఈ యాప్‌లో బడ్జెట్ ప్రతిపాదనలన్నింటినీ ఉంచనున్నారు. ఉపాధి కల్పన, వ్యవసాయం, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలపై ప్రధానంగా దృష్టి సారించినట్లు తెలుస్తోంది. మధ్య తరగతికి పన్నుల్లో కోత ఉండొచ్చని సమాచారం. హెల్త్‌కేర్ సెగ్మెంట్‌కూ ప్రాధాన్యత ఇచ్చారని ప్రచారం ఉంది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు 8 నుంచి 8.5 శాతం వరకు అంచనా వేసిన విషయం తెలిసిందే.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications