ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు మూడు శాతం డియర్‌నెస్ అలవెన్స్ (DA), డియర్‌నెస్ రిలీఫ్ (DR)ను పెంచుతున్నట్లు గురువారం ప్రకటించింది. ప్రాథమిక వేతనం/పెన్షన్‌లో ప్రస్తుతం ఉన్న 28 శాతం కంటే 3 శాతం పెరుగుదల ఉంది. ఈ చర్య వల్ల దాదాపు 47.14 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, 68.62 లక్షల మంది పెన్షనర్లకు ప్రయోజనం చేకూరుతుంది. డీఏ, డీఆర్ పెంపు వల్ల ఖజానాపై ఏడాదికి రూ.9,488.70 కోట్ల భారం పడనుంది.
డీఏ, డీఆర్ పెంపును కేంద్రమంత్రివర్గం ఆమోదించింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఇది స్వాగతించే విషయం.. హర్షించే అంశం. 2021 జూలై నెలలో కేంద్ర ప్రభుత్వం.. దాదాపు ఏడాది పాటు పెండింగ్‌లో ఉన్న అనంతరం డీఏ, డీఆర్ పెంపుకు ఆమోదం తెలిపింది. గత ఏడాది కరోనా మహమ్మారి భారత ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపింది. ఆదాయ సేకరణ ఇబ్బంది కారణంగా 2020లో కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులు, పెన్షనర్లకు డియర్ నెస్ అలవెన్స్, డియర్ నెస్ రిలీఫ్ ప్రయోజనాలను తాత్కాలికంగా నిలిపివేసింది.

గత జూలై నెలలో డీఏ, డీఆర్ పెంపు పునరుద్ధరణ లక్షలాదమంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రయోజనం చేకూర్చింది. ఈ నిర్ణయం జూలై 1, 2021 నుండి అమలులోకి వచ్చింది. ఆ తర్వాత డీఏ, డీఆర్ 17 శాతం నుండి 28 శాతానికి పెరిగింది. డీఏ, డీఆర్ పెంపుతో రూ.34,400 కోట్లు ఖర్చవుతుందని ప్రభుత్వం తెలిపింది.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?



Click it and Unblock the Notifications