బడ్జెట్‌కు కేంద్ర కేబినెట్ ఆమోదం, అందరి కళ్ళు నిర్మలమ్మ వైపు
కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ 2022-23 ఆర్థిక సంవత్సరానికి గాను బడ్జెట్‌ను నేడు (ఫిబ్రవరి 1) ప్రవేశపెడుతున్నారు. ఉదయం గం.11కు బడ్జెట్‌ను పార్లమెంటు ముందు పెడతారు. ఈ నేపథ్యంలో ట్యాబ్‌తో నిర్మలమ్మ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను కలిశారు. ఉదయం తన నివాసం నుండి నార్త్ బ్లాక్‌లోని ఆర్థిక శాఖ కార్యాలయానికి చేరుకున్నారు.
అక్కడ తన బృందంతో సమావేశమయ్యారు. అనంతరం బడ్జెట్ ట్యాబ్‌తో రాష్ట్రపతి భవన్ చేరుకున్నారు. ప్రోటోకాల్ ప్రకారం రాష్ట్రపతిని కలిసి బడ్జెట్ గురించి వివరించారు. ఆ తర్వాత పార్లమెంటుకు చేరుకున్నారు. బడ్జెట్ ప్రతులు పార్లమెంటుకు చేరుకున్నాయి. బడ్జెట్ ప్రతులు డిజిటల్ విధానంలో ఉన్నాయి.

2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బడ్జెట్‌కు నరేంద్ర మోడీ అధ్యక్షనత కేంద్రమంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఆ తర్వాత లోకసభలో నిర్మలా సీతారామన్ బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. ఈ బడ్జెట్ పైన వేతనజీవులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఆదాయపు పన్ను స్లాబ్ రేటులో మార్పులు కోరుకుంటున్నారు. హోమ్ లోన్ వడ్డీ రేటు పన్ను మినహాయింపు పెంపు, పీఎఫ్ పన్ను మినహాయింపు పెంపు తదితర వాటిని కోరుకుంటున్నాయి శాలరైడ్ వర్గాలు.
ఉద్యోగులకు ఐటీ మినహాయింపులు, జీడీపీ వృద్ధి రేటు, ఉద్యోగాల కల్పన, ద్రవ్యోల్ఫణాన్ని అదుపులో ఉంచడం, పెట్రో ఉత్పత్తుల ధరలను తగ్గించడం, ప్రభుత్వరంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణ, క్రిప్టో కరెన్సీపై స్పష్టత వంటి ఎన్నో అంశాలపై ఈ బడ్జెట్‌లో స్పష్టత వస్తుందని భావిస్తున్నారు. కరోనా క్లిష్ట పరిస్థితుల్లో నిర్మలమ్మ ఏం చెబుతారోనని అందరు ఇప్పుడు నిర్మలమ్మ వైపు చూస్తున్నారు.


Click it and Unblock the Notifications