For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్, డీఏ 28% పెంపుకు ఓకే

|

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్. ఎంతోకాలంగా పెండింగ్‌లో ఉన్న కరువు భత్యం (డియర్‌నెస్ అలవెన్స్-DA) చెల్లింపుపై కేంద్రం సానుకూలంగా స్పందించింది. ఏడో వేతన సంఘం సిఫార్సును పరిగణలోకి తీసుకున్న కేంద్రం ఉద్యోగులకు DAను 17 శాతం నుండి 28 శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. పెంచిన DAను 2021 నుండి అమలు చేయనున్నారు.

ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన నేడు (జూలై 14 బుధవారం) కేబినెట్ భేటీ జరిగింది. ఈ సందర్భంగా కేబినెట్ ఆమోదం తెలిపింది. డీఏ పెంపు నిర్ణయాన్ని గత ఏడాది వాయిదా వేశారు. ఇప్పటి వరకు మూడు ఇన్‌స్టాల్‌మెంట్ల డీఏ పెండింగ్‌లో ఉంది. 2020 జనవరి 1వ తేదీ నుండి జూన్ 30 2020 వరకు నాలుగు శాతం, 2020 జూలై 1 నుండి 2020 డిసెంబర్ 31 వరకు 3 శాతం, 2021 జనవరి 1 నుండి 2021 జూన్ 30 వరకు 4 శాతం పెండింగ్‌లో ఉంది. ఈ మూడు డీఏలు పెండింగ్‌లో ఉన్న నేపథ్యంలో కేంద్ర కేబినెట్ ఆమోదం ఉద్యోగులకు భారీ ఊరట కలిగించే అంశం.

Cabinet approves DA hike for central government employees to 28 percent

ఇదిలా ఉండగా, 2021 జులై 1వ తేదీ నుండి కొత్త డీఏను అమలు చేసే బాధ్యత కేంద్రంపై పడింది. దీంతో ప్రభుత్వం డీఏ పెంచేందుకు అంగీకరించింది. మరోవైపు పెన్షనర్లకు సంబంధించి DR పెంపుపై ఎలాంటి ప్రకటన రాలేదు. 7వ వేతన సవరణ సంఘం ప్రకారం లెవల్ వన్ ఉద్యోగుల వేతనం రూ.18000 ఉంటే వీరి టేక్ హోమ్ శాలరీలో రూ.1980 వరకు పెరగవచ్చు

English summary

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్, డీఏ 28% పెంపుకు ఓకే | Cabinet approves DA hike for central government employees to 28 percent

In a major relief for lakhs of central government employees, the Union Cabinet headed by Prime Minister Narendra Modi today (July 14) approved the hike in Dearness Allowance (DA) given to these employees from 17% to 28%.
Story first published: Wednesday, July 14, 2021, 15:38 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X