Vishwakarma Scheme: 5 శాతం వడ్డీకే రుణం.. విశ్వకర్మ స్కీమ్ వివరాలు వెల్లడి..
Vishwakarma Scheme: ఆగస్టు 15న భారతావని జరుపుకున్న 77వ స్వాతంత్ర్య దినోత్సవంలో ప్రధాని మోదీ ఎక్రకోట సాక్షిగా స్కీమ్ ప్రకటించారు. ఈ క్రమంలో హస్తకళాకారుల కోసం 'విశ్వకర్మ పథకాన్ని' ప్రకటించారు. మాటిచ్చిన రెండో రోజే దీనికి సంబంధించిన వివరాలను కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు.
ఈ స్కీమ్‌కు మోదీ కేబినెట్ బుధవారం ఆమోదం తెలిపింది. దీనిని నైపుణ్యం కలిగిన కార్మికుల కోసం ప్రవేశపెట్టింది. దీని పూర్తి పేరు పీఎం శ్వకర్మ కౌశల్ సమ్మాన్ యోజన. దీనికోసం కేంద్ర ప్రభుత్వం రూ.13,000 నుంచి రూ.15,000 కోట్లను వెచ్చించాలని నిర్ణయించింది. స్కీమ్ కింద అర్హులకు గరిష్ఠంగా 5% వడ్డీ రేటుకు రూ.లక్ష రుణం ఇవ్వనున్నట్లు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలియజేశారు. సెప్టెంబరు 17న విశ్వకర్మ పూజ సందర్భంగా దీనిని కేంద్రం ప్రారంభించనుంది. పైగా ఇది ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం కూడా.

'విశ్వకర్మ యోజన' లక్ష్యం నైపుణ్య శిక్షణ, సాంకేతికత, ఆర్థిక సహాయం అందించడం ద్వారా దేశవ్యాప్తంగా కళాకారులు, హస్తకళాకారుల సామర్థ్యాన్ని పెంచడంగా ఉంది. స్కీమ్ కింద నైపుణ్యం కలిగిన కళాకారులను MSMEలతో అనుసంధానం చేస్తారు. తద్వారా వారు మెరుగైన మార్కెట్ యాక్సెస్‌ను పొందవచ్చు. పథకం ద్వారా వడ్రంగులు, స్వర్ణకారులు, శిల్పులు, కుమ్మరుల సేవలు, ఉత్పత్తుల నాణ్యతను పెంచి దేశంతో పాటు ప్రపంచ మార్కెట్‌తో అనుసంధానం చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.
పీఎం విశ్వకర్మ స్కీమ్ కింద కళాకారులు PM విశ్వకర్మ సర్టిఫికేట్లు, గుర్తింపు కార్డులు పొందుతారని కేంద్రం ప్రకటించింది. వీరికి మెుదటి దశలో లక్ష రూపాయలు, రెండో దశలో రూ.2 లక్షల వరకు 5 శాతం సబ్సిడీ వడ్డీ రేటుకు రుణాన్ని పొందుతారని కేంద్రం స్పష్టం చేసింది. కింద మొదటి దశలో చేర్చబడిన వారిలో వడ్రంగులు, పడవలు తయారు చేసేవారు, కమ్మరి, తాళాలు చేసేవారు, స్వర్ణకారులు, కుమ్మరులు, శిల్పులు, తాపీ పని చేసేవారు ఉన్నారు.


Click it and Unblock the Notifications