Cabinet Decisions: దేశంలో వ్యవసాయం, గ్రామీణ రంగాల అభివృద్ధికి, సహకార రంగంలో పారదర్శకత తీసుకురావడానికి ప్రభుత్వం పెద్ద అడుగు వేసింది. దీని కింద దేశవ్యాప్తంగా పనిచేస్తున్న 63,000 ప్రైమరీ అగ్రికల్చర్ క్రెడిట్ సొసైటీల (PACS) కంప్యూటరీకరణ జరుగుతుంది. ఇందులోభాగంగా.. ఒక్కో కమిటీకి దాదాపు రూ. 4 లక్షలు వెచ్చించనున్నారు.

ఖర్చును ఎవరు భరిస్తారు..
ఈ మెుత్తం ఖర్చులో 75 శాతం కేంద్రం భరిస్తుండగా.. మిగిలిన మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, నాబార్డు భరించాల్సి ఉంటుంది. దీని వల్ల దాదాపు 13 కోట్ల మంది రైతులకు లబ్ధి చేకూరనుందని తెలుస్తోంది. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం కారణంగా చిన్న సన్నకారు రైతులకు ఎక్కువగా ప్రయోజనం కలగనుంది. పీఏసీఎస్‌ల కంప్యూటరీకరణకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. మొత్తం రూ.2,516 కోట్లతో 63,000 ప్రైమరీ అగ్రికల్చర్ క్రెడిట్ సొసైటీలు ఇకపై కంప్యూటరీకరణ జరగనుంది.
ఆమోదించిన కేబినెట్ కమిటీ..
పీఏసీఎస్‌ల కంప్యూటరీకరణకు ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదం తెలిపింది. PACSల సామర్థ్యాన్ని పెంచడం, వాటి ఆపరేషన్‌లో పారదర్శకత, జవాబుదారీతనం తీసుకురావటమే దీని వెనుక లక్ష్యంగా ఉంది. ఇది PACSల వ్యాపారాన్ని విస్తరించడానికి, వివిధ కార్యకలాపాలు/సేవలను ప్రారంభించడానికి అనుమతిస్తుంది. ఈ ప్రాజెక్ట్ కోసం మెుత్తం రూ.2,516 కోట్ల బడ్జెట్ ప్రపోజ్ చేయగా..కేంద్రం అందులో తన వాటాగా రూ.1,528 కోట్లను అందించనుందని స్పష్టం చేసింది. పీఏసీఎస్‌ల కంప్యూటరీకరణ వల్ల కోట్లాది మంది రైతులకు మేలు జరుగుతుందని ప్రధాని ట్వీట్‌లో పేర్కొన్నారు.

PACS అంటే ఏమిటి..
దేశంలోని అన్ని సంస్థలు ఇచ్చే KCC రుణాల్లో PACS 41 శాతం (3.01 కోట్ల మంది రైతులు) కలిగి ఉంది. ఈ KCC రుణాల్లో 95 శాతం (2.95 కోట్ల రైతులు) PACS ద్వారా చిన్న, సన్నకారు రైతులకు అందుతున్నాయి. ఇతర రెండు శ్రేణులు అంటే రాష్ట్ర సహకార బ్యాంకులు (STCBలు), జిల్లా కేంద్ర సహకార బ్యాంకులు (DCCBలు) ఇప్పటికే నాబార్డ్ ద్వారా స్వయంచాలకంగా మారాయి. కామన్ బ్యాంకింగ్ సాఫ్ట్‌వేర్ (CBS) కిందకు తీసుకురావటం జరిగింది. కొన్ని రాష్ట్రాల్లో.. PACS పాక్షికంగా కంప్యూటరీకరణ కూడా ఇప్పటికే జరిగింది.

నోడల్ సర్వీస్ డెలివరీ పాయింట్‌గా..
PACS కంప్యూటరీకరణ వివిధ సేవలు, ఎరువులు, విత్తనాలు మొదలైన ఇన్‌పుట్‌లను అందించడానికి నోడల్ సర్వీస్ డెలివరీ పాయింట్‌గా మారుతుంది. అలాగే.. ఆర్థిక లక్ష్యాలను నెరవేర్చడం, రైతులకు సేవల సరఫరాను బలోపేతం చేయడం దీని వెనుక ఉన్న లక్ష్యం. గ్రామీణ ప్రాంతాల్లో డిజిటలైజేషన్‌ను మెరుగుపరచడంతో పాటు బ్యాంకింగ్ కార్యకలాపాలు అలాగే బ్యాంకింగ్యేతర కార్యకలాపాలకు కేంద్రంగా PACSల పరిధిని మెరుగుపరచడంలో ఈ ప్రాజెక్ట్ సహాయపడుతుందని కేంద్రం చెబుతోంది. ప్రాజెక్ట్‌లో సైబర్ భద్రత, డేటా సేకరణ అలాగే క్లౌడ్ ఆధారిత షేర్డ్ సాఫ్ట్‌వేర్ అభివృద్ధి, PACS కోసం హార్డ్‌వేర్ సపోర్ట్, నిర్వహణ సపోర్ట్, శిక్షణతో సహా ఇప్పటికే ఉన్న రికార్డుల డిజిటలైజేషన్ ఉన్నాయి.
More From GoodReturns

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications