For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఏడాదిలో బైట్‌డ్యాన్స్ లాభాలు రెండింతలు, 2019లో $3 బిలియన్లు

|

వీడియో షేరింగ్ ప్లాట్‌ఫాం టిక్‌టాక్ మాతృసంస్థ, చైనా టెక్ దిగ్గజం బైట్‌డ్యాన్స్ భారీ లాభాలు నమోదు చేస్తోంది. 2019లో మొత్తం కంపెనీ రెవెన్యూలో 17 బిలియన్ డాలర్లలో 3 బిలియన్ డాలర్ల నికర ఆదాయం వచ్చినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. 2018 ఆదాయంతో పోలిస్తే రెండింతలు పెరిగిందని చెబుతున్నారు. బైట్ డ్యాన్స్ కేవలం నెల రోజుల్లో 15 లక్షల మంది వ్యూయర్స్‌ను సంపాదించుకుంటోంది.

బైట్ డ్యాన్స్‌కు టిక్‌టాక్‌తో పాటు వివిధ యాప్స్ ఉన్నాయి. అమెరికన్ టీనేజర్లను డ్యాన్స్ వీడియోలతో బైట్ డ్యాన్స్ అలరిస్తోంది. యూజర్లకు కొత్త కొత్త గేమ్స్, మ్యూజిక్‌ను అందిస్తూ వాటి ద్వారా పెద్ద ఎత్తున యూజర్లను సంపాదించుకుంటోంది. బైట్ డ్యాన్స్ రోజులో కొత్తగా 800 మిలియన్ యూజర్లను ఆకర్షిస్తోంది. ఫేస్‌బుక్‌కు రోజుకు 1.73 బిలియన్ల మంది యాక్టివ్ యూజర్లు ఉంటారు.

ByteDance Reported To Have Revenues Of dollar 17 Billion

2018లో బైట్ డ్యాన్స్ ఆదాయం 7.4 బిలియన్ డాలర్లుగా ఉంది. ఇప్పుడు భారీగా పెరిగింది. బైట్ డ్యాన్స్ ఆర్థిక డేటాను అధికారింగా విడుదల చేయలేదు. బైట్ డ్యాన్స్ వ్యాల్యుయేషన్ 100 బిలియన్ డాలర్లకు పైన ఉంటుందని అంచనా. దీనికి 126 నగరాల్లో 60,000 మంది ఉద్యోగులు ఉన్నారు.

English summary

ఏడాదిలో బైట్‌డ్యాన్స్ లాభాలు రెండింతలు, 2019లో $3 బిలియన్లు | ByteDance Reported To Have Revenues Of dollar 17 Billion

vIt has been widely reported that ByteDance, the Beijing-based digital entertainment and information company, had impressive 2019 revenue and earnings.
Story first published: Thursday, May 28, 2020, 18:51 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X