Layoffs: టర్మ్ లోన్ ఇష్యూతో పాటు రుణదాతల ఒత్తిడి ఎక్కువ కావడంతో ఖర్చులను తగ్గించుకునేందుకు బైజూస్ సిద్ధమైంది. ఇందుకోసం పలు విభాగాల్లో ఉద్యోగులకు ఉద్వాసన పలకడానికి నిశ్చయించుకుంది. ఈమేరకు ఓ ప్రముఖ మీడియా సంస్థ నివేదిక విడుదల చేసింది.
మెంటరింగ్, లాజిస్టిక్స్, ట్రైనింగ్, సేల్స్, పోస్ట్-సేల్స్ మరియు ఫైనాన్స్ వంటి వివిధ విభాగాల్లో లేఆఫ్స్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. తొలగింపుల విషయం తెలియజేయడానికి జూన్ 16న తమ కార్యాలయాల్లో ఫోన్ కాల్స్‌తో పాటు వ్యక్తిగత సమావేశాలను HR బృందం నిర్వహించింది. నివేదిక ప్రకారం వెయ్యి మంది సిబ్బందిపై వేటు పడనుంది. రెండేళ్లు పైబడిన సీనియర్స్ వీరిలో ఎక్కువగా ఉన్నారు.

ఈ చర్చల అనంతరం కంపెనీ HR పోర్టల్‌లో ఉద్యోగులు స్వచ్ఛందంగా రాజీనామా చేయాలని కోరినట్లు నివేదిక పేర్కొంది. ఇప్పటికే మెయిల్ IDలు డీ యాక్టివేట్ చేయగా, ID కార్డులు సమర్పించమని సూచించారు. "జూన్ 16 చివరి వర్కింగ్ డే అని చెప్పారు. ముందస్తు సమాచారం ఏమీ ఇవ్వలేదు"అని బాధితుల్లో ఒకరు తెలిపారు.
"ఇటీవల బైజూస్ రవీంద్రన్ నుంచి ఉద్యోగులకు ఒక మెయిల్ వచ్చింది. ఇకపై కంపెనీలో లేఆఫ్‌లు ఉండవని, సంస్థ గొప్పగా పనిచేస్తోందని అందులో చెప్పారు. కానీ ఇప్పుడు పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా ఉంది" అని ఉద్యోగం నుంచి తొలగించబడిన మరో వ్యక్తి ఆవేదన వ్యక్తం చేశారు. బైజూస్ ఫిబ్రవరిలో వెయ్యి మంది ఉద్యోగులను తొలగించింది. కాగా తాజా రౌండ్‌లో ఫ్రెషర్స్ అందరిపై వేటువేసింది.


Click it and Unblock the Notifications