దేశీయ స్టార్టప్ రంగంలో యూనికార్న్‌గా గతంలో వెలుగొందిన బైజూస్ ను ఇప్పుడు పలు రకాల ఇబ్బందులు చుట్టుముట్టాయి. ఉద్యోగులకు జీతాలు కూడా చెల్లించలేక నానా అవస్థలు పడుతోంది. తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుపోయిన పరిస్థితుల్లో ఇప్పుడు ఓ కీలక నిర్ణయం తీసుకుంది.
సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న దేశీయ ఎడ్యు టెక్ కంపెనీ బైజూస్.. అర్జెంటీనాకు చెందిన అంతర్జాతీయ ఫుట్‌బాల్ స్టార్ లియోనెల్ మెస్సీతో ప్రకటనల ఒప్పందాన్ని తాత్కాలికంగా నిలిపివేసింది. గతంలో ఈ ఆటగాడిని గ్లోబల్ అంబాసిడర్‌గా నియమించుకుంది. మూడేళ్ల కాలానికి 58 కోట్లు చెల్లించేందుకు అగ్రిమెంట్ సైతం కుదుర్చుకుంది. అయితే పరిస్థితి సహకరించకపోవడంతో దాన్ని ఇప్పుడు అర్థాంతరంగా ముగించాల్సి వచ్చింది.

ఈ కాంట్రాక్టుకు సంబంధించి మొదటి ఏడాది పారితోషకాన్ని కంపెనీ ఇప్పటికే చెల్లించింది. అందుకుగాను మెస్సీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో బైజూస్ తరపున కొంతకాలం ప్రచారం కూడా చేశారు. సంస్థ సంక్షోభంలో ఉన్నప్పటికీ ఖతార్‌లో జరిగిన ఫిఫా ఫుట్‌బాల్ వరల్డ్ కప్‌కు స్పాన్సర్‌గా వ్యవహరించడం గమనార్హం.
దీనిపై సోషల్ మీడియా యూజర్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ఉద్యోగులకు జీతాలు చెల్లించడానికి నిధులు లేనప్పుడు ప్రకటనలు, ప్రచారాల కోసం ఖర్చు చేయవలసిన అవసరం లేదంటూ ఘూటుగా పోస్టులు పెడుతున్నారు. 2022 నాటికి కంపెనీ విలువ 22 బిలియన్ డాలర్లకు చేరుతుందని అంచనా వేయగా.. ఇప్పుడు దారుణంగా 225 మిలియన్ డాలర్లకు క్షీణించడం పట్ల విచారం వ్యక్తం చేస్తున్నారు.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications