Byjus Tution Points: ఒకప్పుడు విద్యారంగంలో వినూత్న అడుగులు వేస్తూ ఎడ్‌టెక్ యూనికార్న్ బైజూస్ ధ్రువతారగా ఎదిగింది. తదనంతర కాలంలో సంక్షోభంలో చిక్కుకుపోయింది. ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటూ దివాళా స్థాయికి దిగజారిపోయింది. తాజాగా ఖర్చులు తగ్గించుకునేందుకు ఇప్పుడు కీలక నిర్ణయం తీసుకుంది.
బైజూస్‌కు దేశవ్యాప్తంగా దాదాపు 300 ఆఫ్‌లైన్ ట్యూషన్ సెంటర్స్ ఉన్నాయి. వాటిలో సుమారు 200 సెంటర్లను మూసివేయాలని యోచిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఫిబ్రవరిలో 50 ట్యూషన్ పాయింట్స్‌ను మూసివేయగా.. వచ్చే నెలలో తాజా నిర్ణయాన్ని అమలు చేయాలని భావిస్తోంది. కాగా ఎడ్‌టెక్ సంస్థ ఈ విషయాన్ని ధ్రువీకరించాల్సి ఉంది.

ఇప్పటికే 300 సెంటర్లలో పనిచేసే ఉద్యోగుల సంఖ్యలో బైజూస్ కోత విధించింది. మిగిలిన సిబ్బందిని ఇంటి నుండి పని చేయమని గత వారం ఆదేశించింది. ఆర్థిక కష్టాల వల్ల దేశవ్యాప్తంగా ఉన్న సంస్థ కార్యాలయాలను సైతం వదులుకోవాల్సి వచ్చింది. కేవలం బెంగళూరులోని ప్రధాన కార్యాలయాన్ని మాత్రమే ఉంచుకున్నట్లు మీడియా నివేదికలు చెబుతున్నాయి.
రైట్స్ ఇష్యూ ద్వారా నిధులు సమీకరించాలని భావించినా.. పెట్టుబడిదారులతో వివాదాల నేపథ్యంలో అదికాస్తా నిలిచిపోయింది. దీంతో ఖర్చులు తగ్గించుకునేందుకు బైజుస్ ఇండియా CEO అర్జున్ మోహన్ పునర్నిర్మాణ ప్రక్రియ చేపట్టారు. ఇందులో భాగంగా 20 వేల మంది ఉద్యోగులకు పెండింగ్‌లో ఉన్న ఫిబ్రవరి వేతనాల్లో కొంత భాగాన్ని చెల్లించారు. త్వరలోనే మిగిలిన మొత్తాన్ని చెల్లిస్తామని లేఖ రాశారు.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications