Byjus Crisis: బైజూస్‌లో మహా సంక్షోభం.. సీఈవో తొలగింపుకు ప్రయత్నాలు..
Byjus Raveendran: దేశీయ స్టార్టప్ కంపెనీలకు ప్రస్తుతం అత్యంత గడ్డుకాలం కొనసాగుతోంది. వాస్తవానికి రిజర్వు బ్యాంక్ ఆంక్షల తర్వాత పేటీఎం కంపెనీ భారీగా నష్టపోయిన సంగతి మరచిపోకముందే.. బైజూస్ సంక్షోభం మెుదలైంది.
కరోనా కాలంలో అత్యంత ఆదరణ పొందిన ఎడ్‌టెక్ స్టార్టప్ కంపెనీ బైజూ సంక్షోభంలోకి జారుకుంది. ఈ క్రమంలో కంపెనీ సీఈవో బైజూ రవీంద్రన్ గడ్డు కాలం నుంచి గట్టెంకేందుకు అతని కుటుంబం తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. అయితే వీరిని కంపెనీ నుంచి తొలగించటానికి దాదాపు 60 శాతం మంది వాటాదారులు ఓటు వేసినట్లు వెల్లడైంది. బైజూ రవీంద్రన్ కుటుంబం తప్పు నిర్వహణ, వైఫల్యాలకు కారణంగా చాలా మంది ఆరోపించారు. కంపెనీ నిర్వహణలో వారి ఆధిపత్యాన్ని తగ్గించాలని ఓటింగ్ ద్వారా వెల్లడైంది.

బైజు ఇన్వెస్టర్ ప్రోసస్ ప్రకారం వాటాదారులు ఓటు వేయడానికి పెట్టిన అన్ని తీర్మానాలను ఏకగ్రీవంగా ఆమోదించారు. అయితే బైజు రవీంద్రన్, అతని కుటుంబం EGMకి దూరంగా ఉన్నారు. ఈ అసాధారణ సాధారణ సమావేశం చెల్లదని ఆయన పేర్కొన్నారు. EGM శుక్రవారం ఉదయం 9.30 గంటలకు ప్రారంభం కావాల్సి ఉండగా.. దాదాపు 200 మంది ఆన్‌లైన్‌లో హాజరు కావాలనుకుంటున్నందున సుమారు గంట ఆలస్యంగా జరిగింది. దీనిపై నలుగురు పెట్టుబడిదారులు గురువారం సాయంత్రం NCLT బెంగళూరు బెంచ్ ను ఆశ్రయించారు. కంపెనీ నిర్వహణపై ఆందోళన వ్యక్తం చేశారు.
వ్యాజ్యం కంపెనీని నడపకుండా సీఈవో బైజు రవీంద్రన్‌తో సహా వ్యవస్థాపకులను అనర్హులుగా ప్రకటించాలని, కొత్త డైరెక్టర్ల బోర్డును నియమించాలని పెట్టుబడిదారులు NCLTలో దాఖలు చేసిన వ్యాజ్యంలో కోరారు. పిటిషన్ ఫోరెన్సిక్ ఆడిట్, పెట్టుబడిదారులతో సమాచారాన్ని పంచుకునేలా మేనేజ్‌మెంట్‌ను ఆదేశించాలని కూడా కోరారు. ఈ పిటిషన్‌పై టైగర్ అండ్ ఔల్ వెంచర్స్‌తో సహా ఇతర వాటాదారుల మద్దతుతో పాటు నలుగురు పెట్టుబడిదారులు ప్రోసస్, GA, సోఫినా మరియు పీక్15 సంతకం చేశారు. ఈ క్రమంలో రవీంద్రన్‌కు మార్చి 13 వరకు ఉపశమనం అందించబడింది.


Click it and Unblock the Notifications