భారత ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ ఇప్పుడిప్పుడే వేడెక్కుతోంది. తాజాగా అమెరికా దిగ్గజ కార్ల తయారీ సంస్థ టెస్లా త్వరలో ఇండియాలో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తుంది. ఈ తరుణంలో టెస్లాకు ప్రపంచ పోటీదారిగా ఉన్న చైనా కంపెనీ BYD భారతదేశంలో కొత్తగా పెట్టుబడులు పెట్టబోతోంది. దింతో భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్లో పోటీగా టెస్లాకు గట్టి పోటీ ఇవ్వనుంది.

కొన్ని సంవత్సరాల క్రితం వరకు టెస్లా ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ కార్ల అమ్మకాల సంస్థ. అయితే, BYD ఇప్పుడు టెస్లాను అధిగమించి ప్రపంచంలోనే అతి తక్కువ ధరకు ఎలక్ట్రిక్ కార్లను విక్రయించే అతిపెద్ద కంపెనీగా అవతరించింది. అంతర్జాతీయ మార్కెట్ల తర్వాత ఈ రెండు ఎలక్ట్రిక్ దిగ్గజాలు ఇప్పుడు భారతదేశంలోనూ ఢీకొనబోతున్నాయి. BYD ప్రస్తుతం భారతదేశంలో మూడు ఎలక్ట్రిక్ కార్లను విక్రయిస్తోంది - ఆటో 3, సీల్ అండ్ eMax 7 . అలాగే అనేక కొత్త కార్లను విడుదల చేయాలని యోచిస్తోంది. ఈ కంపెనీ తాజాగా మొదటి ఎలక్ట్రిక్ కారు సీలాయన్ 7 మోడల్‌ను లాంచ్ చేసింది. దీనితో పాటు చాల ఇతర BYD కార్లు కూడా ఇండియాకి వస్తున్నాయి.
ప్రపంచ మార్కెట్తో సహా ఇండియాలో కూడా తక్కువ ధరలకు ఎలక్ట్రిక్ కార్లను విక్రయించాలని కంపెనీ యోచిస్తోంది. దీనికి సంబంధించి ఇప్పుడు ఒక కొత్త సమాచారం విడుదల అయ్యింది. BYD హైదరాబాద్‌లో దాదాపు రూ.85,000 కోట్ల పెట్టుబడితో కొత్త ఫ్యాక్టరీని నిర్మించాలని యోచిస్తోంది. సంవత్సరానికి 6 లక్షల ఎలక్ట్రిక్ కార్లను ఉత్పత్తి చేయగల సామర్థ్యంతో దాదాపు 500 ఎకరాల విస్తీర్ణంలో ఈ కొత్త ఫ్యాక్టరీని నిర్మించాలని BYD యోచిస్తున్నట్లు నివేదించింది.
BYD ఎలక్ట్రిక్ కార్లను మాత్రమే కాకుండా, వాటికి బ్యాటరీలను కూడా తయారు చేయడానికి ఒక ప్రత్యేక యూనిట్‌ను ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. ఈ తయారీ ప్లాంట్ టెస్లాకే కాకుండా టాటా, మహీంద్రా వంటి భారతీయ ఎలక్ట్రిక్ వాహన తయారీదారులకు ఇంకా భారతదేశంలోని ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతికి కూడా భారీ సవాలును విసురుతుంది. అన్నీ ప్లాన్ ప్రకారం జరిగితే, ఈ ఫ్యాక్టరీ నిర్మాణం 2032 నాటికి పూర్తిగా పూర్తవుతుందని చెబుతున్నారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే BYD ఇటీవల కేవలం ఐదు నిమిషాల ఛార్జింగ్‌తో 250 మైళ్ల పరిధిని అందించే బ్యాటరీని విడుదల చేసింది. గత నెలలో అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ 'ADAS'ని తీసుకొచ్చింది, ఇది టెస్లా ఫుల్ సెల్ఫ్ డ్రైవింగ్ ఫీచర్‌తో పోలిస్తే చాలా చౌకగా ఉంటుంది. దీని బట్టి చూస్తే కంపెనీ టెస్లాకు మంచి పోటీని ఇస్తోంది. BYD కంపెనీ కార్లలో 90% ప్రపంచంలోనే అతిపెద్ద ఆటో మార్కెట్ అయిన చైనాలో విక్రయిస్తుంది.


Click it and Unblock the Notifications