చైనీస్ ఆటోమోటివ్ దిగ్గజం బిల్డ్ యువర్ డ్రీమ్స్ (BYD) ఎలక్ట్రిక్ కార్లు, బ్యాటరీల తయారీ కోసం హైదరాబాద్‌కు చెందిన మేఘా ఇంజనీరింగ్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ (MEIL)తో కలిసి పని చేసేందుకు సిద్ధమైంది. తెలంగాణలో ఎలక్ట్రిక్ కార్లు, బ్యాటరీ తయారు చేయాలని వీరు భావిస్తున్నారు. ఈ రెండు కంపెనీలు కలిసి 1 బిలియన్ డాలర్లు(రూ.8.200 కోట్లు) పెట్టుబుడి పెట్టేందుకు ప్లాన్ చేస్తున్నాయి. ఇందుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాయి.
వీళ్ల ప్రణాళికలో భాగంగా విద్యుత్ కార్ల పరిశోధన కేంద్రం, ఛార్జింగ్ స్టేషన్లు, విద్యుత్ కార్లు తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే వీరి ప్రతిపాదను కేంద్రం అంగీకరించకపోవచ్చని వార్తలు వస్తున్నాయి. ఇతర దేశాల కంపెనీలను మార్కెట్ కు దూరంగా ఉంచాలని కేంద్రం ఆలోచనలో ఉంది. ముఖ్యంగా చైనా కంపెనీలకు అవకాశం ఇవ్వడానికి హోం, విదేశీ వ్యవహారాల ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది.

చైనా కంపెనీలతో భద్రతా పరమైన సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. చైనీస్ కంపెనీ భారత్‌పై దూకుడుగా వెళ్లాలని భావిస్తున్నందున BYD జాయింట్ వెంచర్ ప్లాన్ గురించి కేంద్రం ఆలోచిస్తోంది. MEIL యూనిట్ అయిన Olectra Greentech, BYD నుంచి సాంకేతిక మద్దతుతో ఇప్పటికే రెండు ఎలక్ట్రిక్ బస్సులను అభివృద్ధి చేసింది. ఏప్రిల్ 2020 నుంచి భూ-సరిహద్దు-భాగస్వామ్య పొరుగు దేశాల కంపెనీలకు భారతీయ సంస్థల్లో పెట్టుబడి పెట్టడానికి అనుమతి అవసరం.
హోం సెక్రటరీ నేతృత్వంలోని ప్యానెల్ అటువంటి ప్రతిపాదనలను ముందుగా క్లియర్ చేయాలి. భారతదేశంతో భూ సరిహద్దును పంచుకునే దేశాలకు చెందిన కంపెనీలు ఆటోమేటిక్ మార్గంలో వెళ్లడాన్ని నిరోధించడానికి ప్రభుత్వం కఠినమైన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డిఐ) నిబంధనలను అమలులోకి తెచ్చింది. 2022లో, చైనీస్ వాహన తయారీ సంస్థ గ్రేట్ వాల్ మోటార్స్ మహారాష్ట్రలో తన $1 బిలియన్ల భారతీయ తయారీ ప్రాజెక్ట్‌ను వదులుకుంది. దేశంలోని తన కార్యాలయాన్ని మూసివేసింది.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు



Click it and Unblock the Notifications