ఈ ఒక్క ఫార్ముల తెలిస్తే లక్షాధికారి కావొచ్చు.. ఇక డబ్బుకి కొరతే ఉండదు..

రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత అంటే ప్రతినెల ఖర్చులకు కొంత డబ్బు అనేది ప్రతి ఒక్కరికి చాల అవసరం. దీని కోసం సేవింగ్స్ ప్లాన్స్ ముందు నుంచే చేయడం ముఖ్యం. అయితే మ్యూచువల్ ఫండ్లలో SIP (సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్) అప్షన్ ఒకటి, దీని ద్వారా చిన్న పెట్టుబడుల ద్వారా పెద్ద మొత్తం జమ చేయవచ్చు. ముఖ్యంగా తక్కువ సమయంలోనే ధనవంతులు కావాలనుకునే వారికి SIP 12+12+20 ఫార్ములా చాలా ఉపయోగపడుతుంది అని చెప్పవచ్చు.

by this SIP formula you will become easily a millionaire if you know it you will never face money shortage

12+12+20 ఫార్ములా అంటే ఏమిటి : ఈ ఫార్ములాలో మొదటి "12" అనేది ప్రతి నెలా రూ.12 వేల పెట్టుబడి అని సూచిస్తుంది. అంటే, మీరు 30 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు ప్రతి నెలా రూ.12 వేల SIPని స్టార్ట్ చేస్తే, మీరు 50 సంవత్సరాల వయస్సులోపు లక్షాధికారి కావచ్చు. అలాగే రెండవ "12" అనేది 12% అన్యువల్ రాబడిని సూచిస్తుంది. అయితే మ్యూచువల్ ఫండ్లలో లాంగ్ టర్మ్ పెట్టుబడులపై 12% రాబడి అనేది సాధారణం, అయితే ఇది హామీతో ఉండదు. మూడవది "20" అనేది పెట్టుబడి కాలాన్ని సూచిస్తుంది. అంటే మీరు 20 సంవత్సరాల పాటు ప్రతినెల రూ.12 వేల SIP చేస్తే మీరు మొత్తం రూ.28.80 లక్షలు పెట్టుబడి పెడతారన్నమాట. దీనికి 12% అన్యువల్ రాబడితో కలిపితే ఈ మొత్తం దాదాపు రూ.1.10 కోట్లకు పెరుగుతుంది.

Take a Poll

ఈ SIP ఫార్ములా ఎవరి కోసం : ప్రతినెల నెల పెట్టుబడి పెట్టాలనుకునే వారికి అలాగే రిటర్మెంట్ సమయంలో ఆర్థికంగా ఎవరి పై ఆధారపడకుండా స్వతంత్రంగా ఉండాలనుకునే వారికి ఈ SIP ఫార్ములా చాల ఉపయోగపడుతుంది. దీని అతిపెద్ద ఉపయోగం ఏమిటంటే మీరు పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టవలసిన అవసరం లేదు, అంతేకాక మీరు ప్రతి నెలా ఒక చిన్న మొత్తంలో పెట్టుబడి పెట్టడం ద్వారా పెద్ద మొత్తం జమ చేయవచ్చు. ఇలా SIPలో పెట్టుబడి పెట్టేటప్పుడు ఓపిక ఇంకా ప్రతినెలా మిస్ అవకుండా SIP చేయడం చాలా ముఖ్యమని గమనించాలి. ఈ ఫార్ములా సక్సెస్ అవడానికి కీలకం ఇంకా స్టాక్ మార్కెట్ హెచ్చుతగ్గులు ఉన్నప్పటికీ పెట్టుబడి పెట్టడం కొనసాగించవచ్చు. పెట్టుబడి పెట్టే ముందు SIP కాలిక్యులేటర్ సహాయంతో మీ అవసరాలుకి అనుగుణంగా ఒక ప్లాన్ రూపొందించుకోండి. సరైన సమయంలో సరైన పెట్టుబడి అనేది మిమ్మల్ని లక్షాధికారిని చేయడమే కాకుండా రిటైర్మెంట్ తర్వాత కూడా డబ్బు ఒత్తిళ్ల నుండి రిలీఫ్ ఇస్తుంది.

మ్యూచువల్ ఫండ్ల పై చార్జీలు: మ్యూచువల్ ఫండ్ల నుండి వచ్చే లాభాలపై వివిధ రకాల ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుందని గుర్తుంచుకోవాలి, ఇందులో పన్నులు కూడా ఉంటాయి. ఈ ఛార్జీలను పరిశీలించిన తర్వాతే SIPలో పెట్టుబడి పెట్టండి.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+