ఎంప్లాయ్ ప్రావిడెంట్ ఫండ్ (EPF) అనేది ఉద్యోగులకు తప్పనిసరిగా అందించే సేవింగ్స్ అండ్ రిటైర్మెంట్ ఫండ్. ఈ ఫండ్ ఉద్యోగ సమయంలో ఇంకా ఉద్యోగం మానేసాక డబ్బు అవసరమైన సమయంలో ఆర్థిక భద్రత కల్పిస్తుంది. అలాగే రిటైర్మెంట్ తర్వాత ఉద్యోగులకు ఒకేసారి పెద్ద మొత్తంలో డబ్బు అందిస్తుంది.

EPFO ముఖ్య ఉద్దేశ్యం రిటైర్మెంట్ సేవింగ్స్. దీనికి విత్ డ్రా నిబంధనలు కూడా ఉన్నాయి. పెళ్లి, చదువు లేదా అత్యవసర వైద్య పరిస్థితుల్లో ముందుగానే విత్ డ్రా చేసుకోవచ్చు. అయితే ఉద్యోగులు PF అకౌంట్స్ నుండి ముందుగానే డబ్బులు విత్ డ్రా చేసుకోవడానికి ఫామ్ 31ని ఉపయోగించాలి. ఈ ఫామ్ అఫీషియల్ UAN పోర్టల్‌లో ఉంటుంది.
1. పెళ్లి కోసం : మీ పెళ్లి లేదా వారి పిల్లల పెళ్లిళ్లకు పిఎఫ్ డబ్బు తీసుకోవచ్చు. అలాగే పెళ్ళికి సంబంధించిన ఖర్చుల కోసం పిఎఫ్ నుండి 50 శాతం వరకు విత్ డ్రా చేసుకోవచ్చు. కానీ PF అకౌంట్లో కనీసం 7 సంవత్సరాలు pf డబ్బు జమ తర్వాత మాత్రమే విత్ డ్రా చేయవచ్చు. పెళ్లి కోసం మూడు కంటే ఎక్కువ సార్లు డబ్బు తీసుకోలేరు.
2. చదువు కోసం : 10వ తరగతి తర్వాత పిల్లల ఉన్నత చదువు లేదా విద్యా ఖర్చుల కోసం PF మొత్తం నుండి 50 శాతం వరకు విత్ డ్రా చేసుకోవచ్చు. దీనికి కూడా PF అకౌంట్లో కనీసం 7 సంవత్సరాలు pf జమ చేసిన తర్వాత విత్ డ్రా ఉంటుంది. అలాగే పిల్లల చదువు కోసం మూడుసార్లు కంటే ఎక్కువగా పిఎఫ్ విత్ డ్రా చేయలేరు.
3. రిటైర్మెంట్ ఒక సంవత్సరం ముందు : EPFO రిటైర్మెంట్ ఒక సంవత్సరం ముందు PF మొత్తం నుండి 90 శాతం విత్ డ్రా చేసుకోవచ్చు. దినికి ఉద్యోగి వయస్సు 54 సంవత్సరాల కంటే తక్కువ ఉండకూడదు. ఇంకా PF పథకం, 1952 68NN కింద అనుమతీస్తారు.
4. నిరుద్యోగులకు: మీరు పనిచేస్తున్న కంపెనీ 15 రోజులకు పైగా మూసేస్తే మీరు PF మొత్తం తీసుకోవచ్చు. మీరు మీ ఉద్యోగాన్ని కోల్పోయి, ఒక నెల తర్వాత పిఎఫ్ మొత్తంలో 75 శాతం వరకు తీసుకోవచ్చు. కొత్త ఉద్యోగంలో చేరాక మిగిలిన 25 శాతం కొత్త PF అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేయవచ్చు. కానీ మీరు రెండు నెలలుగా నిరుద్యోగిగా ఉంటే మొత్తం PF విత్ డ్రా చేసుకోవచ్చు.
5. ఇంటి కోసం: ఇల్లు కొనడం లేదా నిర్మించడం, హోమ్ లోన్ కట్టడం, స్థలం లేదా ప్లాట్ కొనడం, ఇంటిని రేనోవేషన్ లేదా ఇంటి మరమ్మత్తు పనులు చేయడం వంటి వాటి కోసం PF డబ్బు తీసుకోవచ్చు. ఒక వ్యక్తి తన ఐదు సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసిన తర్వాత మాత్రమే ఇందుకు అర్హులు.
6. వైద్య ఖర్చుల కోసం : అత్యవసర వైద్య పరిస్థితుల్లో ప్రావిడెంట్ ఫండ్ నుండి కొంత తీసుకోవచ్చు. ఇందుకు మీరు రూ. 1 లక్ష వరకు విత్ డ్రా చేసుకోవచ్చు.
7. వైకల్యం కోసం: PF ప్లాన్ 68-N కింద వైకల్యనికి గురైనవారికి అంటే శారీరక వైకల్యం జరిగితే వారి ఇబ్బందులను తగ్గించడానికి పరికరాలను కొనడానికి తీసుకోవచ్చు.
8. వరిష్ట బీమా యోజన కోసం : వరిష్ట పెన్షన్ బీమా యోజనలో పెట్టుబడి పెట్టడానికి 55 ఏళ్లు నిండిన తర్వాత వారి PF బ్యాలెన్స్‌లో 90 శాతం వరకు తీసుకోవచ్చు.
9. ఫ్యాక్టరీ లాకౌట్ లేదా మూసివేత : ఒక ఫ్యాక్టరీ లేదా సంస్థ ఆరు నెలలకు పైగా వేస్తే అప్పుడు కూడా పిఎఫ్ మొత్తం తీసుకోవచ్చు.
10. సంస్థలో విద్యుత్ కోత: మీరు ఉద్యోగం చేస్తున్న ఫ్యాక్టరీకి విద్యుత్ సప్లయ్ నిలిపివేస్తే PF అకౌంట్ నుండి కొంత డబ్బు తీసుకోవచ్చు.
Disclaimer: This article is strictly for informational purposes only. It is not a solicitation to buy, sell in precious metal products, commodities, securities or other financial instruments. Greynium Information Technologies Pvt Ltd, its subsidiaries, associates and the author of this article do not accept culpability for losses and/or damages arising based on information in this article.
More From GoodReturns

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

క్రెడిట్ కార్డ్ లాంజ్ యాక్సెస్ నిబంధనలు మారాయి: ప్రయాణికులకు షాక్

JD Vance: ముగిసిన చర్చలు! ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న ఇరాన్.. యుద్ధం మళ్లీ మొదలైనట్టేనా?

Personal loan: బ్యాంకులు మీ లోన్ అప్లికేషన్‌ను ఎందుకు తిరస్కరిస్తున్నాయి? అసలు గుట్టు విప్పిన ఆర్థిక నిపుణులు!

బంగారం ధరల ఈ స్థాయికి వస్తేనే కుప్పకూలుతాయి..లేదంటే 7 వేల డాలర్ల పైమాటే, స్విస్ బ్యాంక్ నుంచి సంచలన నివేదిక..

Trading: యుద్ధం మీద బెట్టింగ్.. గంటల్లోనే లక్షాధికారులు! అసలేం జరిగిందంటే..

బెంగళూరు రియల్ ఎస్టేట్.. మెట్రో బ్లూ లైన్ రాకతో ఈ ఏరియాలో ఇళ్ల కోసం ఎగబడుతున్న ఇన్వెస్టర్లు..

Bengaluru: రియల్ ఎస్టేట్‌లో మారిన లెక్కలు! బెంగళూరు, హైదరాబాద్‌లో ట్రెండ్ ఎలా ఉందంటే..



Click it and Unblock the Notifications