Atal Pension Yojana: రోజుకు రూ.7 తో నెలకు రూ.5 వేల పెన్షన్..!
చాలా మంది తమ పిల్లల కోసం సంపాదించిన డబ్బును ఖర్చు పెడతారు. కానీ వృద్ధాప్యంలో తమ పరిస్థితి గురించి మాత్రం ఆలోచించరు. 60 ఏళ్ల తర్వాత పిల్లలపై ఆధారపడాల్సి వస్తుంది. వృద్ధాప్యంలో ఇబ్బంది పడకూడదని ప్రభుత్వం ఓ పథకం తీసుకొచ్చింది. అదే ప్రధాన మంత్రి అటల్ పెన్షన్ యోజన. ఈ పథకంలో 18 నుంచి 40 సంవత్సరాల మధ్య ఉన్నవారు మాత్రమే చేరేందుకు అవకాశం ఉంది.
రోజుకు కేవలం రూ. 7 ఆదా చేయడం ద్వారా మీరు నెలకు రూ.5 వేల పెన్షన్ పొందవచ్చు. మీరు 18 సంవత్సరాల వయస్సులో ఈ పథకానికి దరఖాస్తు చేసుకుంటే.. రోజుకు రూ.7 మాత్రమే చెల్లించాలి. అంటే నెలకు రూ.210 చెల్లించాలి. 60 ఏళ్లు వచ్చే వరకు ప్రీమియం చెల్లింపు కొనసాగించాలి. అయితే వయస్సు పెరిగే కొద్ది ప్రీమియం పెరుగుతుంది. మీరు సమీపంలోని బ్యాంకుకో వెళ్లి ప్రధాన మంత్రి అటల పెన్షన్ యోజన పథకంలో చేరొచ్చు.

19 ఏళ్ల వయస్సులో ఈ పథకంలో చేరితే నెలకు రూ.228 చెల్లించాలి. 20 ఏళ్ల వయస్సులో చేరితే నెలకు రూ.248, 21 ఏళ్లుంటే రూ.269, 22 ఏళ్ల వయస్సుంటే నెలకు రూ.292, 23 ఏళ్ల అయితే నెలకు రూ.318, 24 ఏళ్లు అయితే నెలకు రూ.346,
25 ఏళ్కు నెలకు రూ.376, 26 ఏళ్కు నెలకు రూ.409, 27 ఏళ్లకు నెలకు రూ.446, 28 ఏళ్లకు నెలకు రూ.485, 29 ఏళ్లకు నెలకు రూ.529 చెల్లించాలి.
30 సంవత్సరాల వయస్సులో చేరితే నెలకు రూ.577 చెల్లించాలి. 31 సంవత్సరాలకు నెలకు రూ.630, 32 సంవత్సరాలకు నెలకు రూ.689 చెల్లించాలి. 40 ఏళ్లు ఉంటే నెలకు రూ.1454 ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది.


Click it and Unblock the Notifications