డబ్బులు సింపుల్ గా సంపాదించలేం. ఎంతో కష్ట పడితేనే పైసలు చేతికి వస్తాయి. అయితే అందులో కొంత మొత్తం ఆదా చేసుకునే వారు ఉంటారు. అలాంటి వారి కోసం కచ్చితమైన ఆదాయం వచ్చే పథకాలు ఉన్నాయి. అందులో ఒకటి పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్(PPF). ఇందులో పెట్టుబడి పెడితే అకచ్చితమైన రాబడి ఉంటుంది. అలాగే పన్ను ప్రయోజనం కూడా ఉంటుంది. మీరు పీపీఎఫ్ ఖాతాను పోస్టాఫీస్ లేదా బ్యాంకుల్లో ఓపెన్ చేయవచ్చు.
పీపీఎఫ్ ఖాతాలో సంవత్సరానికి కనీసం రూ.500 పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. గరిష్ఠంగా సంవత్సరానికి రూ.1.50 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. ఈ పథకానికి 15 సంవత్సరాల మెచ్యూరిటీ ఉంటుంది. 15 సంవత్సరాల తర్వాత డబ్బులు విత్ డ్రా చేసుకోవచ్చు. పీపీఎఫ్ పథకంలో ప్రస్తుతం 7.1 శాతం వడ్డీ చెల్లిస్తున్నారు. పీపీఎఫ్ లో నెలకు రూ.2 వేలు పెట్టుబడి పెడితే సంవత్సరానికి రూ.24 వేలు చెల్లిస్తారు. ఇలా 15 సంవత్సరాల్లో మీరు రూ.3,60,000 పే చేస్తారు.

మీకు వడ్డీ రూ.2,90,913 లభిస్తుంది. మెచ్యూరిటీ తర్వాత మీకు రూ.6,50,913 వస్తాయి. ఒక వేళ మీరు నెలకు రూ.5 వేలు కడితే సంవత్సరానికి రూ.60 వేలు పెట్టుబడి పెడతారు. 15 సంవత్సరాల్లో రూ.9 లక్షలు పే చేస్తారు. మీకు రూ.7 లక్షలకు పైగా వడ్డీతో కలిపి మొత్తం రూ. 16,27,284 వస్తాయి. మీరు నెలకు రూ.12,500 కడితే సంవత్సరానికి రూ.1.50 వేలు చెల్లిస్తారు. 15 సంవత్సరాల్లో రూ.22,50,000 కడితే వడ్డీ రూ.18,18,209 కలిపి మొత్తం రూ.40,68,209 వస్తాయి.
మీరు మెచ్యూరిటీ తర్వాత మరో 5 సంవత్సరాలు పీపీఎఫ్ ఖాతాను పొడగించుకోవచ్చు. పీపీఎఫ్ లో లోన్ తీసుకునే సౌకర్యం కూడా ఉంది. మీరు కొన్ని సంవత్సరాలు పీపీఎఫ్ లో పెట్టుబడి పెట్టిన తర్వాత లోన్ తీసుకోవచ్చు. వడ్డీ కూడా తక్కువగానే ఉంటుంది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications