ఇల్లు కొనడం అంటే మన జీవితంలో పెద్ద నిర్ణయంగా భావిస్తాం. అయితే దీన్ని ఆలస్యం చేయడం వల్ల భవిష్యత్తులో ఆర్థికంగా సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా 40 ఏళ్లు దాటినప్పుడు ఇల్లు కొనే పనిని చేయడం చాలా భారంతో కూడుకున్నది. ఎందుకంటే అప్పటి నుండి గృహ రుణాన్ని తీసుకోవడం మరింత కష్టంగా మారుతుంది. గృహ రుణానికి వచ్చే షరతులు కఠినతరం అవుతాయి. బ్యాంకులు ఎక్కువ కాలం పాటు రుణాన్ని ఇవ్వడానికి ఇష్టపడవు.
HDFC వెబ్‌సైట్‌లో అందించిన సమాచారం ప్రకారం చూసినట్లయితే.. మీరు, మీ జీవిత భాగస్వామి ఇద్దరూ సంపాదిస్తున్న సమయంలో గృహ రుణం కోసం ఉమ్మడి దరఖాస్తు చేసుకోవడం చాలా మంచి ఆలోచన. ఇది మీరు రుణాన్ని పొందడానికి అర్హతను మరింతగా పెంచుతుంది. అలాగే, EMI (ఇంపోర్ట్ మంత్లీ ఇన్‌స్టాల్‌మెంట్) కూడా తక్కువగా ఉంటుంది. మీ భార్యను లేదా మీ భాగస్వామిని సహ-దరఖాస్తుదారుగా పెట్టడం వల్ల వడ్డీ రేట్లు కొంత తగ్గి, పన్ను ఆదా కూడా చేయవచ్చు. ఇది మీకు చాలా పొదుపుగా ఉంటుంది.

సాధారణంగా బ్యాంకులు Home రుణాలను 30 సంవత్సరాల పాటు మాత్రమే ఇస్తారు. కానీ మీరు 40 సంవత్సరాలు వయస్సు దాటినా, మీ పదవీ విరమణ సమయాన్ని దృష్టిలో ఉంచుకుని, ఎక్కువ కాలం రుణ వ్యవధి కోరవచ్చు. ఉదాహరణకు మీ ఉద్యోగం సురక్షితంగా ఉండి మంచి క్రెడిట్ స్కోరు ఉంటే బ్యాంకులను ఒప్పించవచ్చు. దీని వల్ల EMI తక్కువగా వస్తుంది, రుణ చెల్లింపు సౌలభ్యంగా ఉంటుంది.
ఇక మరో విషయం ఏంటంటే.. EMI భారాన్ని తగ్గించుకోవడానికి పెద్ద మొత్తంలో డౌన్ పేమెంట్ చేయడం మంచిది. అయితే..ఈ డౌన్ పేమెంట్ మీ అత్యవసర ఖర్చుల కోసం ఉండే నిధులను నుండి ఉపయోగించకూడదు. మీ పదవీ విరమణ సమయంలో గృహ రుణాన్ని పూర్తి చేయడం ఉత్తమమైన నిర్ణయం. అందుకోసం మీరు బోనస్, గ్రాట్యుటీ లేదా ఇతర మూలధనాన్ని ఉపయోగించి రుణాన్ని ముందుగానే చెల్లించవచ్చు.
ఈ రోజుల్లో చాలా రుణదాతలు అందుబాటులో ఉన్నారు. మంచి రుణదాతను ఎంచుకోవడం చాలా ముఖ్యం. కేవలం వడ్డీ రేటు తక్కువగానే కాకుండా, వారి ఖ్యాతి, విశ్వసనీయత, పత్రాల ఫార్మాలిటీలు, సౌలభ్యంగా తిరిగి చెల్లించుకునే విధానం కూడా పరిశీలించాలి. ఇల్లు కొనే సమయంలో అవసరమైన సలహాలను అందించే రుణదాతను ఎంచుకోవడం చాలా మంచిది. ఈ సలహాలను పాటించడం ద్వారా, మీరు భవిష్యత్తులో మీ ఇల్లు సొంతం చేసుకోవడాన్ని సులభతరం చేసుకోవచ్చు. EMIలు భారంగా కాకుండా, సులభంగా చెల్లించుకోవడం మిమ్మల్ని ఆర్థికంగా సురక్షితులుగా నిలబెడుతుంది.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి


Click it and Unblock the Notifications