టెస్లా కారు ప్రత్యేకతలు ఇవే..ఒకసారి పుల్ ఛార్జ్ చేస్తే 622 కిలోమీటర్లు..6 సెకన్లకే 100 స్పీడ్..

భారతదేశంలో ప్రజలంతో ఇప్పుడు ఈవీ కార్ల వైపు మొగ్గు చూపుతున్నారు. ప్రజల్లో పెరుగుతున్న పరిజ్ఞానం, చట్టాలలో వస్తున్న మార్పులు వల్ల, ఇప్పుడు చాలా మంది పర్యావరణ హితమైన గ్రీన్ మొబిలిటీ వైపు మళ్లాలని యత్నిస్తున్నారు.ఈ నేపథ్యంలోనే అమెరికా దిగ్గజం టెస్లా తన లేటెస్ట్ మోడల్ వై ఈవీ కారును భారత మార్కెట్ లోకి పరిచయం చేసింది. అయితే దీని ధర మాత్రం టెస్లా కారు కొనుగోలు చేయాలనుకునే వారిని నిరాశపరిచిందని చెప్పుకోవచ్చు.

ప్రస్తుతం టెస్లా కారు మొదటి వేరియంట్ రియర్-వీల్ డ్రైవ్ (RWD) కాగా దీని ధర రూ. 60 లక్షలుగా ఉంది. రెండవ వేరియంట్ లాంగ్ రేంజ్ RWD ధర రూ. 69 లక్షలు గా ఉంది. ఇవి ఎక్స్ షో రూమ్ ధరలు మాత్రమే. ఇక ఆన్-రోడ్ ధరలు చూసుకుంటే వరుసగా రూ. 61.07 లక్షలు, రూ. 69.15 లక్షలుగా ఉన్నాయి. కారు ప్రియులను ఆశ్చర్యానికి గురిచేస్తున్న విషయం ఏమిటంటే ఈ రకమైన మోడల్ కార్లు అమెరికా, చైనా, జర్మనీల్లో దాదాపుగా సగం రేటుకే అందుబాటులో ఉన్నాయి.

Tesla s first India showroom opens in Mumbai Tesla s first India showroom Mumbai Tesla Tesla Launches Model Y in India Tesla Model Y in India Model Y in India Tesla Model Y Tesla Model Y India launch Tesla Model Y price in India Tesla cars in India electric cars India 2025 Model Y SUV India Tesla EV price Model Y features India Elon Musk Tesla India Tesla India market entry premium electric cars India EV SUV India Tesla bookings India SUV 2025 EV Tesla Model Y Cost in India tesla car features

ఈ కారు అమెరికాలో దాదాపు రూ. 37.5 లక్షలకు (44,990 డాలర్లు) లభిస్తుంది. చైనాలో దాదాపు రూ. 30 లక్షలకు ( 263,500 యువాన్లు) లభిస్తుంది. జర్మనీ వంటి యూరోపియన్ దేశాలలో కూడా దీని ధర దాదాపు రూ. 42 లక్షలు ( 45,970 యూరోలు). భారతదేశంలో మాత్రం ఈ కారు ధర రూ. 60 లక్షలుగా ఉంది. దీనిని బట్టి ఈ ఎలక్ట్రిక్ SUV కోసం భారతీయ కస్టమర్లు భారీగా ప్రీమియం చెల్లించాల్సి ఉంటుందని స్పష్టంగా తెలుస్తుంది. ఈ ధర అంతర్జాతీయ ధరల కంటే 40 శాతం వరకు ఎక్కువ. భారతదేశంలో విధించే దిగుమతి పన్నులు, సుంకాలు వల్ల ఈ ధర ఉందని పలువురు చెబుతున్నారు.

దీనికి కారణం సుంకాలేనని చెప్పుకోవచ్చు. భారత ప్రభుత్వం 40వేల డాలర్ల కంటే విలువైన ఈవీ కార్ల దిగుమతులపై 70 శాతం నుంచి 100 శాతం వరకు దిగుమతి సుంకాలను విధిస్తోంది. ఆ పరిమితి కంటే తక్కువ ధర గల కార్లకు 70 శాతం విధిస్తోంది. అయితే 100 శాతం సుంకాల ధరను తగ్గించాలనే డిమాండ్ దేశంలో చాలా కాలం నుంచి కొనసాగుతోంది. అధిక దిగుమతి పన్నుల కారణంగా టెస్లా ఈవీల ధరలు ఇతర దేశాల్లో కంటే చాలా ఎక్కువగా ఉండటం భారతీయ కొనుగోలుదారులను కొంత నిరాశకు గురిచేస్తోంది. ప్రస్తుతం ఈ పన్నుల కారణంగా టెస్లా కార్లు టాటా, మహీంద్రా వంటి సంస్థలతో కాకుండా బీఎండబ్ల్యూ, ఆడి, బెండ్ వంటి సంస్థల కార్లతో పోటీ పడాల్సి వస్తోంది.

దేశంలోకి ఎంట్రీ ఇచ్చిన టెస్లా కారు ఓ సారి పుల్ ఛార్జ్ చేస్తే 500 కిలోమీటర్ల వరకు ప్రయాణం చేయవచ్చు. లాంగ్ రేంజ్ ఆర్డబ్యూడీ మోడల్ అయితే 622 కిలోమీటర్ల వరకు ప్రయాణం చేయవచ్చు.ఈ కార్లను కేవలం 15 నిమిషాలు చార్జ్ చేస్తే చాలు మెుదటి బేసిక్ మోడల్ 238 కిలోమీటర్లు అవలీలగా ప్రయాణం చేస్తుంది. ఇక లాంగ్ రేంజ్ మోడల్ 15 నిమిషాలు ఛార్జ్ చేస్తే 267 కిలోమీటర్లు వరకు ప్రయాణం చేయవచ్చు. స్టార్ట్ చేసిన 6 సెకన్లలోపే ఈ కార్లు 100 కిలోమీటర్ల స్పీడును అందుకోగలవని తెలుస్తోంది. టెస్లా మోడల్ వై ప్రస్తుతం 6 రంగుల్లో లభ్యమవుతోంది. గ్రే కలర్, పెర్ల్ వైట్ కలర్, డైమండ్ బ్లాక్ కలర్, గ్లాసియర్ బ్లూ కలర్, క్విక్ సిల్వర్ కలర్, అల్ట్రా రెడ్ రంగుల్లో ఈ కార్లు అందుబాటులో ఉన్నాయి.

ప్రస్తుతం ఇండియా ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద కార్ల మార్కెట్ గా ఉంది.అయితే ఈవీ కార్ల విషయంలో మాత్రం చాలా వెనుకబడి ఉంది. ఎందుకంటే ఛార్జింగ్ మౌలిక సదుపాయాలపై కస్టమర్లలో చాలా నిరాశ వ్యక్తం అవుతోంది. ఈ కార్లకు ఛార్జింగ్ స్టేషన్లు చాలా తక్కువగా ఉండటంతో సంపన్న కొనుగోలుదారులు కూడా ఈ కార్ల వైపు మొగ్గు చూపడం లేదు. ప్రపంచవ్యాప్తంగా గ్రీన్ మొబిలిటీపై ఆసక్తి పెరుగుతుండగా, టెస్లా కార్లు తమ వినూత్న టెక్నాలజీతో ఆ దిశగా ముందడుగు వేస్తున్నాయి. భారత మార్కెట్లోకి ప్రవేశించడంతో, టెస్లా వాహనాలపై ఆసక్తి మరింత పెరుగుతోంది.

టెస్లా కార్లు ప్రత్యేకతలు ఏమిటి?

ఆటోపైలట్ & ఫుల్ సెల్ఫ్ డ్రైవింగ్ (పర్యవేక్షణతో): టెస్లా కార్లు డ్రైవింగ్‌ను సులభతరం చేయడానికి ఆటోపైలట్ అనే అధునాతన ఫీచర్‌ను అందిస్తున్నాయి. ఇది ఒకే లేన్‌లో స్టీరింగ్, యాక్సిలరేషన్, బ్రేకింగ్‌ను స్వయంచాలకంగా నిర్వహిస్తుంది. ఇక ఫుల్ సెల్ఫ్ డ్రైవింగ్ సాంకేతికత ద్వారా, రోడ్డులో మార్గాలు, మలుపులు, ఫోర్క్‌లను గమనించి, డ్రైవర్ పర్యవేక్షణతో వాహనం సులభంగా నావిగేట్ చేయగలదు.

టచ్‌స్క్రీన్ ఇంటర్‌ఫేస్ & వినోద ఫీచర్లు: టెస్లాలోని పెద్ద సెంట్రల్ టచ్‌స్క్రీన్ ద్వారా నావిగేషన్, క్లైమేట్ కంట్రోల్, మీడియా మరెన్నో ఫీచర్లను నిర్వహించవచ్చు. ఇందులో Netflix, YouTube వంటి స్ట్రీమింగ్ సేవలు, Tesla Arcade ద్వారా గేమింగ్ ఆప్షన్లు కూడా లభ్యమవుతాయి.

ఓవర్-ది-ఎయిర్ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్: టెస్లా రెగ్యులర్‌గా ఇంటర్నెట్ ద్వారా సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్ పంపుతుంది. దీనివల్ల కొత్త ఫీచర్లు వస్తాయి, ప్రదర్శన మెరుగవుతుంది, భద్రతా ప్రమాణాలు పెరుగుతాయి.

పనితీరు & బ్యాటరీ రేంజ్: టెస్లా మోడల్స్ తక్కువ సమయంలో అత్యధిక వేగం చేరడంలో ప్రసిద్ధి. ఉదాహరణకు, మోడల్ S ఎక్కువ శ్రేణిని కలిగి ఉండగా, సైబర్‌ట్రక్ శక్తి, యుటిలిటీకి ప్రసిద్ధి. వేర్వేరు మోడల్స్‌కు తగిన బ్యాటరీ ఎంపికలు అందుబాటులో ఉన్నాయి.

భద్రతా లక్షణాలు, ఇతర స్మార్ట్ ఫీచర్లు : లేన్ అసిస్ట్, కొలిజన్ అవాయిడెన్స్ వంటి క్రియాశీల భద్రతా వ్యవస్థలు. సెంట్రీ మోడ్ ద్వారా పార్క్ చేసినప్పుడు వాహనం పరిసరాలను రికార్డ్ చేస్తుంది.ఈ ఫీచర్ ప్రపంచంలో ఎక్కడి నుండైనా మీరు పార్క్ చేసిన వాహనాన్ని నిశితంగా పరిశీలించడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. HEPA ఫిల్టర్‌తో క్యాబిన్‌లో శుభ్రతను నిర్ధారిస్తుంది.టెస్లా యాప్ ద్వారా కారును స్వయంగా మీ వద్దకు రావడానికి అనుమతిస్తుంది. పెంపుడు జంతువులకు కారులో సురక్షిత ఉష్ణోగ్రతను నిర్ధారించగల ఫీచర్. లైవ్ ట్రాఫిక్, స్ట్రీమింగ్ వంటి సదుపాయాలు.ఎవరైనా మీ కారును షాపింగ్ కార్ట్‌తో ఢీకొడితే టెస్లా కారు బయటి కెమెరాల నుండి రికార్డ్ చేస్తుంది. టెస్లా యాప్ ద్వారా మీ వాహనం ఢీకొట్టారని మీకు తెలియజేస్తుంది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+