కారు కొనాలని ప్లాన్ చేస్తున్నారా? లేదా మీ ప్రాపర్టీ మీద లోన్ తీసుకోవాలనుకుంటున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్ ఉంది. Bank of Baroda వడ్డీ రేట్లు తగ్గిస్తూ కస్టమర్లకు కొత్త ఆఫర్లతో ముందుకొచ్చింది. RBI రిపో రేటు తగ్గించిన వెంటనే పబ్లిక్ బ్యాంకులు వరుసగా రేట్లు కట్ చేస్తుంటే, ఇప్పుడు BoB కూడా ఈ రేసులో చేరి కస్టమర్లకు రిలీఫ్ ఇస్తోంది.

కొత్త రేట్లు ఎలా ఉన్నాయి?
కార్ లోన్: ఫ్లోటింగ్ రేట్ 8.40% నుంచి "8.15%" కి తగ్గింది.
మార్టిగేజ్ లోన్: 9.85% నుంచి "9.15%" కి తగ్గింది.
అదనంగా, ఫిక్స్‌డ్ రేట్ ఆప్షన్ కూడా ఉంది. ఇది ఆరు నెలల MCLRకి లింక్ అయి ఉంటుంది. దీని స్టార్టింగ్ రేట్ 8.65%.
Bank of Baroda ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సంజయ్ ముదలియర్ మాటల్లో "ఈ తగ్గింపుతో కార్ కొనడం మరింత ఈజీ అవుతుంది. అలాగే ప్రాపర్టీ మీద లోన్ తీసుకోవాలనుకునే వారికి కూడా ఇది ఒక మంచి ఛాన్స్. ముఖ్యంగా, కస్టమర్ల CIBIL స్కోర్ బట్టి 55 బేసిస్ పాయింట్స్ నుంచి 300 బేసిస్ పాయింట్స్ వరకు వడ్డీ తగ్గింపు లభిస్తుంది. అంటే మంచి క్రెడిట్ హిస్టరీ ఉన్నవారికి ఇంకా ఎక్కువ బెనిఫిట్" కలుగుతుంది.
ఉదాహరణకి, ఒకరు రూ.10 లక్షల కార్ లోన్ 7 సంవత్సరాల (84 నెలలు)కి తీసుకున్నారని అనుకుందాం. పాత వడ్డీ రేటు 8.40% ఉండగా, ఇప్పుడు అది 8.15%కి తగ్గింది. ఈ మార్పుతో EMIలో వచ్చే తేడా ఏమిటంటే పాత రేటులో నెలకు సుమారు రూ. 15,810 చెల్లించాల్సి వస్తుంది, కొత్త రేటులో అది దాదాపు రూ.15,650 కి పడిపోతుంది. అంటే ప్రతి నెలా సుమారు రూ.160 సేవ్ అవుతుంది. ఇది చిన్న మొత్తంలా అనిపించినా, 7 సంవత్సరాల చివరికి మొత్తం సేవింగ్ రూ.13,500 దాకా అవుతుంది.
ఇక మార్టిగేజ్ లోన్ ఉదాహరణ తీసుకుంటే, ఒకరు రూ. 30 లక్షల లోన్ 15 సంవత్సరాల టెన్యూర్‌కి తీసుకుంటే పాత వడ్డీ రేటు 9.85% ఉండేది. ఇప్పుడు అది 9.15%కి తగ్గింది. పాత రేటులో నెలకు EMI దాదాపు రూ. 32,170 వస్తుండగా, కొత్త రేటులో అది రూ. 30,650కి పడిపోతుంది. అంటే ప్రతి నెలా దాదాపు రూ. 1,520 సేవ్ అవుతుంది. దీన్ని 15 ఏళ్ల కాలానికి లెక్కేస్తే మొత్తం సేవింగ్ రూ. 2.70 లక్షల వరకు చేరుతుంది.
పబ్లిక్ vs ప్రైవేట్ బ్యాంకులు
RBI రిపో రేట్ తగ్గించిన తర్వాత, SBI, Union Bank, Central Bank లాంటి పబ్లిక్ సెక్టర్ బ్యాంకులు ఇప్పటికే వడ్డీ రేట్లు తగ్గించాయి. కానీ ప్రైవేట్ బ్యాంకులు మాత్రం కాస్త జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాయి. ఇక ICRA వైస్ ప్రెసిడెంట్ సచిన్ సచ్దేవ్ చెబుతున్నది ఏమిటంటే "పబ్లిక్ బ్యాంకులకు తక్కువ ఫండింగ్ ఖర్చులు ఉండటంతో, అవి ప్రైవేట్ బ్యాంకుల కంటే వడ్డీ రేట్లలో తగ్గించి కస్టమర్లకు మంచి ఆఫర్ ఇవ్వగలుగుతున్నాయి. అయితే హౌసింగ్ లోన్లు ఇప్పటికే చాలా కాంపిటేటివ్ రేట్లలో ఉన్నందున మరింత తగ్గింపులకు అవకాశాలు తక్కువ.
ఎందుకు కార్ లోన్లు టార్గెట్ చేస్తున్నారు?
గత రెండేళ్లలో క్రెడిట్ వృద్ధి బాగా పెరిగింది కానీ ఇప్పుడు కొంచెం స్లో అయింది. ముఖ్యంగా కార్పొరేట్ లోన్లలో వృద్ధి బలహీనంగానే ఉంది. అన్‌సెక్యూర్డ్ పర్సనల్ లోన్లలో కూడా డిఫాల్ట్ రిస్క్ పెరుగుతుందనే ఆందోళనతో బ్యాంకులు వెనక్కి తగ్గుతున్నాయి. అందుకే బ్యాంకులు ఇప్పుడు వాహన లోన్లు, మోర్టగేజ్ లోన్లు వంటి సేఫ్ ఆప్షన్లపై ఎక్కువ ఫోకస్ పెడుతున్నాయి. వీటిలో రిస్క్ తక్కువ, అలాగే లాభాలు కూడా కచ్చితంగా వస్తాయి.
Bank of Baroda కొత్త రేట్లతో, కార్ కొనాలని చూస్తున్నవారికి లేదా ప్రాపర్టీ మీద లోన్ కావాలనుకునేవారికి ఇది మంచి టైమ్. పబ్లిక్ బ్యాంకులు ఇలాగే పోటీ పెంచితే, కస్టమర్లకు రాబోయే రోజుల్లో ఇంకా మంచి ఆఫర్లు రావచ్చు.
More From GoodReturns

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..



Click it and Unblock the Notifications