Stock Investment: గ్లెన్‌మార్క్ స్టాక్ 25 శాతం రిటర్న్స్ ఇవ్వవచ్చు

ఫార్మా స్టాక్ గ్లెన్‌మార్క్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్(GNP) 25 శాతం పెరిగే అవకాశాలు ఉన్నాయని ప్రముఖ లీడింగ్ బ్రోకరేజీ సంస్థ జియోజిత్ అంచనా వేస్తోంది. ప్రస్తుతం గ్లెన్‌మార్క్ స్టాక్ ధర రూ.389 వద్ద ఉంది. క్రితం సెషన్‌లో 6.60 శాతం క్షీణించి రూ.389 వద్ద ముగిసింది. అయితే ఈ స్టాక్‌ను రూ.485 టార్గెట్ ధరతో కొనుగోలు చేయవచ్చునని జియోజిత్ చెబుతోంది.

ఏడాది ప్రాతిపదికన ఈ సంస్థ కన్సాలిడేటెడ్ రెవెన్యూ FY22 నాలుగో త్రైమాసికంలో 5.6 శాతం పెరిగి రూ.3019కి చేరుకుంది. ప్రస్తుతం మార్కెట్‌లో ఈ స్టాక్ ధర రూ.389 వద్ద ఉంది. ఈ స్టాక్ రూ.485కు చేరుకోవచ్చునని, ఇది 25 శాతం పెరుగుదల అని జియోజిత్ పేర్కొంది. ఈ స్టాక్ 52 వారాల గరిష్టం రూ.690.95, కనిష్టం రూ.375.

Buy Glenmark Stock To Receive 25% Potential Return

గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో గ్లెన్‌మార్క్ ఏడాది ప్రాతిపదికన 5.6 శాతం వృద్ధిని నమోదు చేసింది. భారత్‌తో పాటు యూరోప్, ఇతర వ్యాపారాలు మంచి ప్రదర్శన కనబరిచాయి. భారత్‌లో వ్యాపారం ఏడాది ప్రాతిపదికన 7.4 శాతం పెరిగి రూ.885 కోట్లకు చేరుకుంది. జీసీసీ బిజినెస్ 23.4 శాతం పెరిగి రూ.62 కోట్లకు చేరుకుంది. యూరోప్ బిజినెస్ ఏడాది ప్రాతిపదికన 17.6 శాతం వృద్ధి చెంది రూ.497 కోట్లకు చేరుకుంది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+