Tourism News: మాల్దీవులకు చెందిన ప్రజాప్రతినిధులు సోషల్ మీడియాలో చేసిన ఒక్క ట్వీట్.. ఏకంగా దేశం మొత్తాన్ని ఇబ్బందుల్లోకి నెట్టింది. ప్రముఖ ఆదాయ వనరుగా ఉన్న టూరిజంపై కోలుకోలేని దెబ్బ కొట్టింది. అకారణంగా భారత్‌ను నిందిస్తే ఏం జరుగుతుందో ప్రపంచానికి అర్థమయ్యేలా చేసింది.
ఇప్పటికే భారత్-మాల్దీవుల మధ్య హైటెన్షన్ నెలకొంది. భారత ప్రధాని మోదీ సహా భారతీయులపై ఆ దేశ మంత్రులు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను ఇండియాలోని పలువురు ప్రముఖులు ఖండించారు. తాజాగా బిజినెస్ టైకూన్స్ ఆనంద్ మహీంద్రా, హర్ష్ గోయెంకా కూడా తమదైన శైలిలో స్పందించారు.

'లక్షద్వీప్‌ను ప్రధాని సందర్శించడం, సోషల్ మీడియాలో వివాదం చెలరేగడం, ఇండియా పర్యాటకులు మాల్దీవులకు ట్రిప్స్ క్యాన్సిల్ చేసుకోవడం, అక్కడి మంత్రుల సస్పెన్షన్, లక్షద్వీప్‌లో 5-స్టార్ హోటళ్లు, విమానాశ్రయం వంటివన్నీ మెరుపువేగంతో జరిగిపోయాయి. నయా భారత్ స్పీడ్, పనిచేసే విధానం పూర్తిగా మారిపోయింది. అణగదొక్కాలని చూసేవారికి గట్టిగా తిరిగి సమాధానం చెప్తుంది' అని గోయెంకా తన X ఖాతాలో పోస్ట్ చేశారు.
ఇదే వ్యవహారంపై ఆనంద్ మహీంద్రా స్పందిస్తూ, రాజకీయ చదరంగంలో అత్యద్భుతమైన మూవ్‌గా అభివర్ణించారు. 'మాల్దీవులను బాయ్‌కాట్ చేయాలని భారతీయులు ఎందుకు పిలుపునిస్తున్నారు' అంటూ బ్లూమ్‌బెర్గ్ ప్రచురించిన కథనాన్ని న్యూయార్క్‌లోని తన వ్యాపార భాగస్వామి షేర్ చేసినట్లు చెప్పారు.
లక్షద్వీప్‌లో టూరిజం వృద్ధికి మద్ధతు తెలుపుతూ, డెవలప్‌మెంట్ విషయంలో ప్రభుత్వం జాగ్రత్త వహించాలని కోరారు. అక్కడి సున్నితమైన పర్యావరణ వ్యవస్థను ఏమాత్రం నష్టం కలగకుండా ప్రపంచ స్థాయి కనెక్టివిటీ మరియు హై-ఎండ్ రిసార్ట్‌లను వేగంగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.


Click it and Unblock the Notifications