China: తక్కువ ధరకే ఉత్పత్తుల తయారీ, కరోనా మహమ్మారిని ప్రపంచానికి అందించటంతో చైనా ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైన దేశంగా నిలిచింది. అయితే ఇప్పుడు ఆ దేశం మరో కారణంతో హెడ్‌లైన్స్‌లో నిలిచింది.

మాయమైపోతున్న సంపన్నులు..
ఇటీవలి కాలంలో చైనా బిలియనీర్లు అకస్మాత్తుగా కనుమరుగవుతున్నారు. జీ జిన్ పింగ్ చైనా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత రాత్రికి రాత్రే వ్యాపారవేత్తలు కనిపించకుండా పోవటం సర్వ సాధారణంగా మారిపోయింది. చైనా ప్రభుత్వం చేస్తున్న పనులను ప్రశ్నించే వారు పత్తా లేకుండా పోతున్నారు. వీరిలో చాలా మంది జైలుకు వెళ్లటం లేదా దేశం నుంచి బహిష్కరణకు గురవుతున్నట్లు తెలుస్తోంది. అలా చైనాలో వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలు, జర్నలిస్టులు లక్షల సంఖ్యలో కనుమరుగయ్యారు.

అలీబాబా జాక్ మా..
ఈ-కామర్స్ వ్యాపారంతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు అలీబాబా వ్యవస్థాపకుడు జాక్ మా. 2018లో చైనా పాలకుల ఆగ్రహానికి గురైనప్పటి నుంచి జాక్ మా పెద్దగా కనిపించటం లేదు. దీనికి ముందు సైతం హఠాత్తుగా కనిపించకుండా పోయినవారి లిస్ట్ చాలా పెద్దదే. అయితే ఇప్పుడు తాజాగా బడా ఇన్వెస్ట్ మెంట్ బ్యాంకర్ అదృశ్యం కలవరాన్ని కలిగిస్తోంది. 52 ఏళ్ల బావో ఫ్యాన్ చైనాలోని అతిపెద్ద పెట్టుబడి బ్యాంకర్లలో ఒకరు.

కుప్పకూలిన షేర్స్..
52 ఏళ్ల బావో రైన్సా హాంకాంగ్ కంపెనీకి యజమాని. ఆయన గత కొన్ని రోజులుగా కనిపించకపోటంతో ఆ విషయాన్ని సంస్థ స్టాక్ ఎక్స్ఛేంజ్‌కు తెలియజేసింది. అనేక ప్రయత్నాల తర్వాత కూడా ఆయనను చేరుకోలేక పోయామంటూ వెల్లడించింది. అయితే ఈ వార్తలు మార్కెట్లోకి రావటంతో కంపెనీ షేర్లు దాదాపు 50 శాతం వరకు కుప్పకూలాయి. అవినీతి నిరోధక విచారణ జరుగుతున్న నేపథ్యంలో బావో కనిపించకుండా పోవటం చర్చనీయాంశంగా మారింది.

మాయమైన వ్యాపారవేత్తలు..
చైనా ప్రభుత్వాన్ని విమర్శించే వారెవరైనా అదృశ్యమవుతారు. గత సంఘటనలను పరిశీలిస్తే.. రెన్ జికియాంగ్ చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌ను విమర్శించారు. కొన్ని రోజుల తర్వాత రెన్ అదృశ్యమయ్యాడు. ఆ తర్వాత అతనికి 18 ఏళ్ల జైలు శిక్ష పడింది. 2015లో గ్రూప్ ఫోసన్ ఇంటర్నేషనల్ చైర్మన్ గువో గ్వాంగ్‌చాంగ్ కూడా అదృశ్యమయ్యారు. అతన్ని చైనా వారెన్ బఫెట్ అని పిలిచేవారు. అలాగే జాక్ మా చైనా ప్రభుత్వాన్ని బహిరంగంగా విమర్శించడంతో అతను కూడా అదృశ్యమయ్యాడు. ప్రస్తుతం బావో కనపడకుండా పోవటంతో అవినీతిపై చైనా ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాన్ని చూసి వ్యాపారులు భయపడుతున్నారు.

జిన్‌పింగ్ ప్రచారం..
2012లో అధికారంలోకి వచ్చిన తర్వాత చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ అవినీతి వ్యతిరేక ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ క్యాంపెయిన్‌లో ఇప్పటి వరకు లక్షల మందిని పరీక్షించారు. ఆర్మీ సిబ్బంది, అధికారులు,ప్రభుత్వ శాఖల ఉద్యోగులు, వ్యాపారులు ఇలా చాలా మంది శిక్షకు గురయ్యారు. 2017 నాటికి అవినీతికి పాల్పడినందుకుగాను చైనా వ్యాప్తంగా దాదాపు 2,10,000 మంది అధికారులను అక్కడి ప్రభుత్వం శిక్షించింది.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..



Click it and Unblock the Notifications