Tata Group: భారతీయ క్రికెట్ అభిమానులకు వరల్డ్ కప్ కొంత నిరాశకు గురిచేసినప్పటికీ.. ఐపీఎల్ త్వరలో ప్రారంభం కావటం కొత్త జోష్, ఉత్సాహం నెలకొంది.
టాటా గ్రూప్ ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్‌షిప్‌ను మరో ఐదేళ్లపాటు అంటే 2024 నుంచి 2028 వరకు దక్కించుకున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. ఇందుకోసం టాటా గ్రూప్ ఎకంగా రూ.2,500 కోట్లను వెచ్చిస్తున్నట్లు వెల్లడైంది. "లీగ్ చరిత్రలో అత్యధిక స్పాన్సర్‌షిప్ మొత్తం"గా నిలిచింది. ఈ బృందం 2022-2023లో IPL టైటిల్ స్పాన్సర్‌లు, మహిళల ప్రీమియర్ లీగ్ టైటిల్ స్పాన్సర్‌లు కూడా కావటం గమనార్హం.

ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్‌లుగా టాటా గ్రూప్‌తో భాగస్వామ్యాన్ని ప్రకటించినందుకు సంతోషంగా ఉన్నట్లు బీసీసీఐ కార్యదర్శి జై షా అన్నారు. లీగ్ సరిహద్దులు దాటి, నైపుణ్యం, ఉత్సాహం, వినోదం అసమానమైన సమ్మేళనంతో ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకర్షించిందని షా అభిప్రాయపడ్డారు. ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్‌షిప్ కోసం టాటా గ్రూప్‌తో కలిసి పనిచేయడం ఐపీఎల్ ప్రయాణంలో ఒక ముఖ్యమైన మైలురాయని ఐపీఎల్ ఛైర్మన్ అరుణ్ సింగ్ ధుమాల్ పేర్కొన్నారు.
టాటా గ్రూప్ రూ.2,500 కోట్లకు రైట్స్ దక్కించుకోవటం భారత క్రీడా ప్రపంచంలో ఐపీఎల్ కలిగి ఉన్న అపారమైన విలువ, ఆకర్షణకు నిదర్శనమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మొత్తం లీగ్ చరిత్రలో ఒక కొత్త బెంచ్‌మార్క్‌ను నెలకొల్పడమే కాకుండా ప్రపంచ స్థాయిలో ఐపీఎల్ స్థానాన్ని ఒక ప్రధాన క్రీడా ఈవెంట్‌గా పునరుద్ఘాటిస్తుందని సింగ్ అభిప్రాయపడ్డారు. అలాగే క్రికెట్, క్రీడల పట్ల టాటా గ్రూప్ యొక్క నిబద్ధత నిజంగా ప్రశంసనీయని అన్నారు.


Click it and Unblock the Notifications