business ideas: హోలీ పండుగ ముగిసింది, ఇప్పుడు ప్రజలు ఉదోగాలు, పని కోసం ఊర్ల నుండి నగరాల వైపు తిరిగి వచ్చేస్తున్నారు. కానీ మీరు మీ స్వంత ఊర్లో లేదా నగరంలో ఉంటూనే మంచి వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటే జ్యూస్ వ్యాపారం మీకు గొప్ప ఛాయిస్ కావచ్చు. ఎందుకంటే సమ్మర్లో ప్రజలకు చల్లని, రిఫ్రెషింగ్ జ్యుస్ అవసరం, ఇది ఎండా నుండి ఇంకా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది కూడా.. ఇంకా ఈ వ్యాపారానికి సమ్మర్లో డిమాండ్ చాలా ఎక్కువగా ఉంటుంది. మీరు ఈ వ్యాపారాన్ని సరైన ప్లాన్ తో సరైన స్థలంలో ప్రారంభిస్తే మీరు ప్రతి నెలా రూ. 40,000 నుండి రూ. 50,000 వరకు సంపాదించవచ్చు. ఈ వ్యాపారం గురించి అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే దీనిని తక్కువ ఖర్చుతో స్టార్ట్ చేయవచ్చు ఇంకా ఇందులో లాభం కూడా ఎక్కువే ఉంటుంది.

జ్యూస్ వ్యాపారం ఎలా లాభంగా ఉంటుందంటే : తక్కువ పెట్టుబడి ఖర్చుతో ఎక్కువ లాభం పొందొచ్చు. ఈ వ్యాపారాన్ని కేవలం రూ. 15,000 నుండి 20 వేలతో ప్రారంభించవచ్చు. దీనికి మీ శారీరక శక్తి అవసరం.
ప్రతిచోటా డిమాండ్ : వేసవిలో అందరూ చల్లని ఇంకా ఆరోగ్యకరమైన జ్యూస్‌లు తాగడానికి ఇష్టపడతారు కాబట్టి డిమాండ్ ఉంటుంది.
లాభం సంపాదించడానికి మార్గాలు : మెల్లిమెల్లిగా కొత్త రకాల పండ్లను అండ్ హోమ్ డెలివరీ వంటి సౌకర్యాలను అందించడం ద్వారా లాభాలను పెంచుకోవచ్చు.
ప్రారంభించడం సులభం : ఈ బిజినెస్ ప్రారంభించడానికి పెద్దగా అనుభవం లేదా శిక్షణ అవసరం లేదు. మీరు మీ సొంతంగా ప్రారంభించవచ్చు.
అత్యధికంగా అమ్ముడవుతున్న జ్యూస్‌లు ఏంటంటే
నారింజ జ్యుస్ - విటమిన్ సి సమృద్ధిగా ఉంటుంది, ఉత్తేజపరుస్తుంది.
మామిడి జ్యుస్ (మామిడి షేక్) - అత్యంత ఇష్టమైన జ్యుస్. పిల్లలకు ఎక్కువగా నచ్చుతుంది.
చెరకు రసం - చాల తక్కువ ధర, ఆరోగ్యకరమైనది ఇంకా చాలా మంది ఇష్టపడేది కూడా.
దానిమ్మ జ్యుస్ - ఆరోగ్యానికి మేలు చేస్తుంది, కానీ కొంచెం రేటు ఎక్కువ.
పుచ్చకాయ జ్యుస్ - శరీరాన్ని చల్లబరచడానికి ఒక అద్భుతమైన జ్యుస్.
ఎంత ఖర్చవుతుందంటే:
మీరు ఒక బండి పై జ్యూస్ వ్యాపారాన్ని ప్రారంభిస్తే దాని ఖర్చు చాలా తక్కువ. ఇంకా రెంట్ అలంటి ఇతర ఖర్చులు ఉండవు. అయితే జ్యుస్ వ్యాపారానికి సామానుకి అయ్యే ఖర్చు అంచనా జ్యూస్ మెషిన్ అంటే జ్యుస్ మిక్సర్లకి 5 వేల నుండి 7 వేలు, స్టాల్ పెట్టడానికి 5 వేల నుండి 6 వేలు, డిస్పోజబుల్ గ్లాసులు ఇంకా స్ట్రాలకి 2 వేలు, పండ్లు అలాగే ఇతర పదార్థాలకి 3 వేల నుండి 5 వేలు ఇక మొత్తం ఖర్చు చూస్తే సుమారు 15వేల నుండి 20 వేల వరకు అవుతుంది. అయితే తక్కువ పెట్టుబడితో ప్రారంభించే ఇతర వ్యాపార కూడా ఉన్నాయి. వాటిలో టీ అండ్ కాఫీ షాప్ ఒకటి. దీనికి కూడా తక్కువ ఖర్చుతో మంచి లాభాలు, ముఖ్యంగా ఆఫీసు అండ్ కాలేజెస్ దగ్గర పెడితే మంచి లాభాలు వస్తాయి.
*ఫాస్ట్ ఫుడ్ స్టాల్ ద్వారా కూడా సమోసా, ఫ్రాయిడ్ రైస్, నూడుల్స్ వంటి ఆహార పదార్థాలకు ఎల్లప్పుడూ డిమాండ్ ఉంటుంది లాభాలు కూడా ఆశించినంతగా ఉంటాయి.
*ఇంటర్నెట్ కేఫ్ అండ్ సైబర్ కేఫ్ : నేటి డిజిటల్ యుగంలో ఇంటర్నెట్ కేఫ్ ఒక గొప్ప వ్యాపారంగా మారింది. దీనికి ఏడాది మొత్తం గిరాకీ ఉంటుంది.
*మొబైల్ రిపేరింగ్ అండ్ ఆక్సెసోరిస్ వ్యాపారం : మొబైల్ ఫోన్ వాడే వారి సంఖ్య రోజురోజుకి పెరుగుతుండటంతో ఈ వ్యాపారానికి చాలా డిమాండ్ ఉంది. మీరు ఎక్కడ ఈ బిజినెస్ పెట్టిన కస్టమర్లు వస్తారు.
*పూల షాప్: పెళ్లిళ్లు, వేడుకలు అలాగే ఇతర కార్యక్రమాలలో పువ్వులు అవసరం ఎప్పుడు ఉంటుంది. ఈ వ్యాపారం కూడా 24x7 నడుస్తుంది.
*పాల ఉత్పత్తుల వ్యాపారం - పాలు, జున్ను, పెరుగు అలాగే ఇతర పాల ఉత్పత్తులకు ప్రతిచోటా డిమాండ్ ఉంది. ఇవి అన్ని సీజన్లలో లాభాలను ఇస్తుంది.
*సేంద్రీయ వ్యవసాయం ఇంకా కూరగాయల అమ్మకం - ఆరోగ్యకరమైన లైఫ్ స్టయిల్ పట్ల పెరుగుతున్న అవగాహన కారణంగా సేంద్రీయ ఆహార మార్కెట్ వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఈ వ్యాపారం కూడా చాలా బాగుంటుంది.
*ఇంటికే టిఫిన్ సర్వీస్ - ఈ వ్యాపారం ఆఫీసులకు వెళ్లేవారికి అండ్ విద్యార్థులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
*ఫుట్ వేర్ అండ్ రెడీమేడ్ బట్టల వ్యాపారం - సరైన స్థలంలో బట్టల వ్యాపారం ఎప్పుడూ మంచి లాభాలను ఇస్తుంది. దీనితో పాటు ఫుట్ వేర్ బిజినెస్ కూడా కలిపి పెడితే ఇంకా డిమాండ్ పెరుగుతుంది.
*బ్యూటీ పార్లర్లు అలాగే సెలూన్లు - పురుషులు ఇంకా మహిళలు ఇద్దరికీ అందం ఇంకా జుట్టు సంరక్షణ సేవలకు ఎల్లప్పుడూ డిమాండ్ ఉంటుంది. ఇది కూడా లాభాలు ఇస్తుంది.
మీ వ్యాపారాన్ని మరింతగా సక్సెస్ చేయడం ఎలా:
*మంచి క్వాలిటీ పాటించండి - ఎల్లప్పుడూ ఫ్రెష్ పండ్ల నుండి జ్యుస్ తయారు చేయండి.
*కస్టమర్ సర్వీస్ మంచిగా ఉండేలా చూసుకోండి - కస్టమర్లను బాగా చూసుకోవాలి ఇంకా వారి ప్రాధాన్యతలను దృష్టిలో ఉంచుకోని అడిగింది సర్వ్ చేయండి.
*కొత్త రకాల జ్యుసులు అందించాలి - వివిధ రకాల పండ్ల జ్యుస్లు అలాగే ఫ్రూట్ షేక్స్ అందించండి.
*సోషల్ మీడియాలో ప్రచారం చేయండి - Facebook, Instagram ఇంకా WhatsApp ద్వారా ఎక్కువ కస్టమర్లను చేరుకోండి అలాగే మీ వ్యాపారాన్ని ఫెమస్ చేయాలి.
*డిస్కౌంట్లు అండ్ ఆఫర్లను పెట్టండి- మొదటిసారి వచ్చే కస్టమర్ల కోసం డిస్కౌంట్ లేదా లాయల్టీ ప్రోగ్రామ్‌ను పెట్టండి.
ఏ వ్యాపారానికైనా మీరు ముందుగా వ్యాపారానికి సమందించిన అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. ఇంకా సేఫ్టీ పద్ధతులు పాటించాల్సి ఉంటుంది కూడా. ఈ అనుమతులు పొందిన తరువాత మాత్రమే వ్యాపారాన్ని స్టార్ట్ చేయండి
More From GoodReturns

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు పసిడి రేటు ఎంత వరకు తగ్గిందంటే.. ఏప్రిల్ 13, సోమవారం ధరలు ఇవే..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

విజయవాడ నుంచి హైదరాబాద్కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..

కుప్పకూలిన బంగారం ధరలు.. భారీ తగ్గుదలతో ఈ రోజు పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 9, గురువారం ధరలు ఇవే..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?



Click it and Unblock the Notifications