కొత్తగా బిజినెస్ పెడదామని ప్లాన్ చేస్తున్నారా? అయతే మీకో గుడ్ న్యూస్! మీ దగ్గర కేవలం రూ.5000 ఉంటే చాలు. ప్రభుత్వ సాయంతో మీరు చిన్న మెడికల్ షాపు పెట్టుకోవచ్చు. దీని గురించి మరింత వివరంగా ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రజలకు చౌక ధరలకే నాణ్యమైన మందులు అందించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి జన్ ఔషధి కేంద్ర యోజన (PM Jan Aushadhi Kendra Yojana) ను అమలు చేస్తోంది. ఇది తక్కువ పెట్టుబడితో ఎక్కువ రాబడిని అందించే ఒక అద్భుతమైన బిజినెస్ ఐడియా (Business Idea). ఈ పథకం కింద ఇప్పటికే దేశవ్యాప్తంగా 13,200 మెడికల్ షాపులు ఏర్పాటు అయ్యాయి. అయితే మార్చి 2027 నాటికి వీటి సంఖ్యను 25 వేలకు పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

స్కీమ్ డీటెయిల్స్
ఈ పథకం యొక్క ప్రత్యేకత ఏంటంటే.. మెడికల్ షాపు తెరవడానికి ప్రభుత్వం రూ. 2 లక్షల వరకు వన్ టైమ్ ప్రోత్సాహకాన్ని అందిస్తుంది. అంతేకాకుండా షాపు యజమానికి మార్కెట్ ధర కంటే తక్కువకే మందులు లభిస్తాయి. ఇక వీటితో పాటు మందుల అమ్మకాలపై 20% వరకు కమీషన్ లభిస్తుంది. ఒక నెలలో రూ. 5 లక్షల వరకు మందులు కొనుగోలు చేస్తే.. దానిపై 15% వరకు అదనపు ప్రోత్సాహకం లభిస్తుంది. ఇక షాపు పెట్టుకోడానికి అంటే.. ఫర్నిచర్, కంప్యూటర్లు, రిఫ్రిజిరేటర్లు మొదలైన వాటి కొనుగోలు కోసం ప్రభుత్వం ఒకేసారి రూ. 2 లక్షల వరకు ఆర్థిక సహాయం అందిస్తుంది.
ఎలిజిబిలిటీ వివరాలు
సాధారణ వ్యక్తులు, ఆసుపత్రులు, ఎన్జీఓలు, ఫార్మసిస్ట్‌లు.. ఇలా ఎవరైనా జన్ ఔషధి కేంద్రాన్ని తెరవవచ్చు. అయితే జన్ ఔషధి కేంద్రాన్ని తెరవడానికి కనీసం 120 చదరపు అడుగుల స్థలం అద్దెకు గానీ లేదా సొంతంగా గానీ ఉండాలి. అద్దెకు తీసుకుంటే లీజు ఒప్పందం పత్రం తప్పనిసరి. కేంద్రాన్ని నిర్వహించడానికి రిజిస్టర్డ్ ఫార్మసిస్ట్ ఉండాలి. దరఖాస్తు సమయంలో వారి పేరు, రిజిస్ట్రేషన్ వివరాలు అందించాలి. మహిళా పారిశ్రామికవేత్తలు, మాజీ సైనికులు, దివ్యాంగులు, ఎస్సీ/ఎస్టీ వర్గాలు ఈశాన్య రాష్ట్రాల వారు దరఖాస్తు చేస్తే వారు ప్రత్యేక సర్టిఫికెట్లు సమర్పించాల్సి ఉంటుంది.
దరఖాస్తు ఫీజు
జన్ ఔషధి కేంద్రం కోసం దరఖాస్తు చేసేవారు రూ. 5,000 నాన్-రీఫండబుల్ అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. అయితే, మహిళా పారిశ్రామికవేత్తలు, దివ్యాంగులు, ఎస్సీ/ఎస్టీ, మాజీ సైనికులు వంటి వారికి ఈ ఫీజు నుండి మినహాయింపు ఉంటుంది. అంటే వారు ఉచితంగా దరఖాస్తు చేసుకోవచ్చు.
అప్లికేషన్ ప్రాసెస్..
ఈ అద్భుతమైన Business Idea ను మొదలు పెట్టడానికి దరఖాస్తు విధానం చాలా సులభం..
- ముందుగా janaushadhi.gov.in అనే అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.
- హోమ్ పేజీలోని మెనూలో ఉన్న 'Apply For Kendra' పై క్లిక్ చేయండి.
- పేజీ ఓపెన్ అయ్యాక 'Click Here To Apply' బటన్‌పై క్లిక్ చేయండి.
- అక్కడ సైన్ ఇన్ ఫారం ఓపెన్ అవుతుంది. దాని కింద ఉన్న 'Register Now' ఆప్షన్‌ను ఎంచుకోండి.
- స్క్రీన్‌పై ఓపెన్ అయిన రిజిస్ట్రేషన్ ఫారంలో అడిగిన వివరాలు (రాష్ట్రం, ఐడీ-పాస్‌వర్డ్, వ్యక్తిగత వివరాలు) పూరించండి.
- "Terms and Conditions" బాక్స్‌ను టిక్ చేసి, 'SUBMIT' బటన్‌పై క్లిక్ చేయండి.
- మీ దరఖాస్తు ఆమోదం పొందిన తర్వాత ఈ జన్ ఔషధి కేంద్రం ద్వారా మీరు ప్రజలకు సేవ చేయడంతో పాటు స్థిరమైన ఆదాయాన్ని పొందవచ్చు.


Click it and Unblock the Notifications