రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎండాకాలం తీవ్రత ఏ స్థాయిలో ఉంటుందో చెప్పనక్కర్లేదు. ప్రచండ భానుడు నిప్పులు కురిపిస్తుంటాడు. పగటి ఉష్ణోగ్రత 40 డిగ్రీలకు పైమాటే. మంటెక్కించే వాతావరణం సీజన్ ముగిసేంత వరకూ ఉంటుంది. ఇంట్లో నుంచి అడుగు బయట పెట్టలేని పరిస్థితి సర్వసాధారణం. ఉక్కపోత వల్ల ఇంట్లోనూ ఊపిరాడని దుస్థితిని ఎదుర్కొనడం సహజం. విజయవాడ.. బ్లేజ్‌వాడలా మారుతుంటుంది. ఉక్కపోత అధికంగా ఉండే ప్రాంతం ఇది. ఉద్యోగ, ఉపాధి, విద్యావసరాల కోసం రోడ్డెక్కక తప్పనిసరి.

చిన్నచిన్న వ్యాపారాలు..
నెత్తిపై సూర్యుడు తాండవం ఆడుతుంటే.. చల్లగా ఏదైనా తాగాలనిపిస్తుంటుంది. కొబ్బరిబొండాలు, తర్బూజా పండ్లు, చెరకు రసాలు, మజ్జిగ, లస్సీ.. ఇవి ఎక్కడ కనిపిస్తే అక్కడ బండిని ఆపేసి- వాటితో కొంతమేరకైనా ఎండ తీవ్రతను తగ్గించుకోవాలనిపిస్తుంటుంది. ఇప్పుడు ఈ వ్యాపారమే మూడు పువ్వులు, ఆరుకాయలుగా సాగుతోంది. వేసవిలో చెరకు రసాలు, మజ్జిగ, లస్సీకి ఉన్న డిమాండే వేరు. మరే కాలంలోనూ వీటికి ఇంతగా ఆదరణ ఉండదు.

చెరకు రసాలతో లాభాల పంట..
చెరకు రసాలను విక్రయించుకోవడం ఎండాకాలంలో ఓ మంచి వ్యాపార సూత్రం. దీనికి ఎక్కువ పెట్టుబడి కూడా అవసరం ఉండదు. చెరకు, దాని నుంచి రసాన్ని తీయడానికి అవసరమైన మిషన్ చాలు. ఈ కొద్దిపాటి పెట్టుబడితో అధిక లాభాలను ఆర్జించవచ్చు. ప్రస్తుతం ఒక్కో గ్లాస్ చల్లని చెరకు రసం 20 రూపాయల వరకు పలుకుతోంది. కొన్ని ప్రాంతాల్లో 25 రూపాయల వరకు ఉంటోంది. రుచిని బట్టి ఒక్కొక్కరు రెండు గ్లాసుల చెరకు జ్యూస్‌ను తాగే వీలుంది. షుగర్ కేన్ జ్యూస్, అందులో కొద్దిగా బెల్లం, నిమ్మరసాన్ని కలపడం వల్ల అటు ఆరోగ్యపరంగానూ మేలు కలుగుతుంది.

హోమ్ మేడ్ మసాలా మజ్జిగతో
మజ్జిగను తయారు చేసుకోవడం ఇంకా సులభం. ఇంట్లో కూర్చుని దీన్ని మనం సొంతంగా తయారు చేసుకుని, బయట విక్రయించవచ్చు. దీనికి కావాల్సింది చిక్కని పాలు. లీటర్ పాలతో కనీసం 20 గ్లాసులకు పైగా మజ్జిగను తయారు చేసుకోవచ్చు. అందులో జీలకర్ర పొడి, కొత్తిమీర, పుదీన.. వంటి మసాలాను యాడ్ చేసి అమ్మితే.. దానిపై వచ్చే లాభం ఎంతో ఊహించలేం. టేస్టీ హోమ్ మేడ్ మసాలా బటర్ మిల్క్‌తో వచ్చే లాభాలు ఈ సీజన్ మొత్తం ఉంటుంది.

లస్సీ, ఫాలుదా సైతం..
లస్సీ, ఫాలుదా, పుదీన హర, తర్బూజా అమ్మకాలు.. వంటివి కూడా దిమ్మతిరిగేలా ఆదాయాన్ని తెచ్చి పెడుతుంటాయి. కుండ లస్సీలో లభించే మజానే వేరు. వీటన్నింటినీ మనం తక్కువ పెట్టుబడితో ఇంట్లో నుంచే తయారు చేసుకోవచ్చు. వీటిపై వేల రూపాయల మేర పెట్టుబడులను పెట్టాల్సిన అవసరం లేనే లేదు. తక్కువ మొత్తాన్ని పెట్టుబడిగా పెట్టి.. ఈ వేసవి కాలంలో అధిక లాభాలను విక్రయించుకోవచ్చు. ఎండాకాలం ముగిసే సమయానికి వేల రూపాయల్లో ఆదాయాన్ని ఆర్జించడానికి అవకాశం ఉన్న చిన్న, చిన్న వ్యాపారాలే ఇవన్నీ.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications