సమ్మర్ కూల్ బిజినెస్.. ఈ ఐడియా మిమ్మల్ని లక్షాధికారిని చేయోచ్చు, ఎలాగో తెలుసా..

సమ్మర్ సీజన్లో వేడిని తట్టుకునేందుకు ఎక్కువగా నీరు తాగాల్సి ఉంటుంది. అందులో జర్నీస్ చేసేటపుడు వాటర్ బాటిల్స్ వెంట తీసుకెళ్లడం తప్పనిసరి. సాధారణ రోజుల్లో కంటే సమ్మర్లో వాటర్ బాటిల్స్ కొనేందుకు కొంచెం ఖర్చు చేయాల్సి ఉంటుంది. అయితే ప్రస్తుత కాలంలో డ్రింకింగ్ వాటర్ బాటిల్స్'కి డిమాండ్ వేగంగా పెరుగుతుంది. ఈ బిజినెస్ ఒక సీజన్లోనే ఏడాది మొత్తం నడిచే బిజినెస్ కూడా, కానీ సమ్మర్లో సేల్స్ ఎక్కువ రెట్లు ఉంటాయి. మీరు కూడా మంచి లాభాలు ఇచ్చే బిజినెస్ ఐడియా కోసం చూస్తున్నట్లయితే వాటర్ బాటిల్ బిజినెస్ బెస్ట్ అప్షన్ కావచ్చు.

పెరుగుతున్న డిమాండ్:

నీరు జీవనాధారం, స్వచ్ఛమైన తాగునీటి డిమాండ్ ప్రతి సంవత్సరంకి పెరుగుతోంది. ముఖ్యంగా సమ్మర్ సీజన్లో పట్టణ, గ్రామీణ ప్రాంతాలలో ప్యాకేజ్డ్ తాగునీటి అవసరం పెరుగుతోంది.

https telugu goodreturns in news if-you-are-planning-to-buy-new-house-on-your-wife-name-can-save-15-lakhs-of-money-039751 html

ఈ బిజినెస్ పెట్టడానికి కొన్ని కారణాలు:

పెరుగుతున్న జనాభా అలాగే స్వచ్ఛమైన నీటి అవసరం, హోటళ్ళు, రెస్టారెంట్లు, మాల్స్, ఆఫీసుల్లో బాటిల్డ్ వాటర్'కు పెరుగుతున్న డిమాండ్, ప్రయాణలు, పర్యాటక రంగంలో ఎక్కువగా వినియోగం ఉండటం, ఆరోగ్య సంరక్షణ అవగాహన పెరగటం.

వ్యాపారాన్ని ప్రారంభించడానికి కావాల్సినవి:

స్థలం అండ్ ప్రదేశం, మీకు కనీసం 1000 నుండి 2000 చదరపు అడుగుల స్థలం అవసరం, నీటి వనరులు అంటే బోర్‌వెల్ లేదా మునిసిపల్ వాటర్ సప్లయ్ ఉండటం అవసరం, వ్యాపారాన్ని సజావుగా నడపడానికి విద్యుత్, డ్రైనేజీకి మంచి ఏర్పాట్లు ఉండాలి.

మెషీన్స్ అండ్ ఎక్విప్మెంట్స్ :

వాటర్ బాటిల్ ప్లాంట్ కోసం నీటిని శుద్ధి చేయడానికి ప్యూరిఫై మెషిన్, బాటిళ్లలో నీటిని నింపడానికి బాటిల్ ఫిల్లింగ్ మెషిన్, వాటర్ బాటిల్ సీలింగ్ చేయడానికి అలాగే బ్రాండింగ్ చేయడానికి క్యాపింగ్ & లేబులింగ్ మెషిన్, నీటి నాణ్యతను కాపాడుకోవడానికి రివర్స్ ఆస్మాసిస్ (RO) సిస్టం.

ఈ వ్యాపారాన్ని ప్రారంభించడానికి అవసరమైన లైసెన్స్‌:

BIS (బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్) లైసెన్స్, FSSAI (భారత ఆహార భద్రత అండ్ ప్రమాణాల సంస్థ) లైసెన్స్, కాలుష్య నియంత్రణ మండలి అనుమతి, జీఎస్టీ రిజిస్ట్రేషన్. ఈ లైసెన్సులు పొందిన తర్వాత మాత్రమే మీరు మీ ప్లాంట్ నుండి వాటర్ బాటిల్స్ అమ్మవచ్చు.

వ్యాపారాన్ని ప్రారంభించడానికి అవసరమైన పెట్టుబడి అంచనా:

సొంత భూమి లేకుంటే స్థలం అద్దెకి 2-5 లక్షలు, మెషీన్స్ ఇంకా పరికరాలకి 8-15 లక్షలు, లైసెన్స్‌లు & అనుమతులకి 1-2 లక్షలు, మార్కెటింగ్ & బ్రాండింగ్ కోసం 1-3 లక్షలు అన్ని కలిపి మొత్తం పెట్టుబడి 15-25 లక్షలు కావొచ్చు.

సంపాదన :

మీరు రోజుకు 2000 బాటిల్స్ (1 లీటరు) అమ్మి ఒక్కో బాటిల్ పై రూ. 10 లాభం పొందితే:
రోజు సంపాదన = 2000 × 10 = రూ.20,000
ప్రతినెల ఆదాయం = రూ.6,00,000
ఏడాది ఆదాయం = రూ.72,00,000
సరైన మార్కెటింగ్, నాణ్యతను నిర్వహించడం ద్వారా మీరు ఏడాది మొత్తం మంచి లాభాలను ఆర్జించవచ్చు.

Disclaimer: The recommendations made above are by market analysts and are not advised by either the author, nor Greynium Information Technologies or GoodReturns. The author, nor the brokerage firm nor GoodReturns would be liable for any losses caused as a result of decisions based on this write-up. Goodreturns.in advises users to consult with certified experts before making any investment decision.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+