MB100 2023: ప్రాచీన కాలం నుంచే భారతీయులది వ్యాపార, వాణిజ్యాలలో అందెవేసిన చేయి. నౌకలపై సుదూర ప్రాంతాలకు సరకు రవాణా చేస్తూ, ఎన్నెన్నో సవాళ్లను అధిగమిస్తూ పెద్దమొత్తంలో ఆర్జించిన చరిత్ర మనది. కాగా ఇన్నేళ్ల తర్వాత మరోసారి భారతీయుల్లోని నాయకత్వ, వ్యాపార దక్షతను అంతర్జాతీయ సమాజం గుర్తించింది.
అర్థవంతమైన వ్యాపార దృక్పథం, తీవ్ర ఒత్తిడితో కూడుకున్న క్లిష్ట సమస్యలను పరిష్కరించే నైపుణ్యాలు కలిగిన 15 మంది భారతీయుల జాబితాను మీనింగ్ ఫుల్ బిజినెస్(MB) అనే సంస్థ ప్రకటించింది. కాగా ఈ '2023 మీనింగ్ ఫుల్ బిజినెస్ 100' నివేదికలో అత్యధికంగా ప్రాతినిధ్యం వహిస్తున్నది భారతీయులే కావడం విశేషం.

మొత్తం 140+ దేశాల్లోని పలువురు ప్రముఖులు MB కమ్యూనిటీలో భాగస్వాములుగా ఉన్నారు. 29 మంది నిపుణుల బృందం ఈ అవార్డులను నిర్ణయించింది. MB100 5వ ఎడిషన్‌లో సామాజిక వ్యవస్థాపకులు, కార్పొరేట్ నాయకులు, ఇంపాక్ట్ ఇన్వెస్టర్స్ సహా 93 దేశాల్లోని 800 మంది నామినీల నుంచి విజేతలను ఎన్నుకున్నారు. డ్యూరబిలిటీ, ఇంపాక్ట్, ఇన్నోవేషన్, లీడర్‌షిప్, స్కోప్ అనే 5 కీలక రంగాల్లో స్కోర్ ఆధారంగా సెలక్ట్ చేశారు.
EY, హొగన్ లోవెల్స్ మరియు బాబ్సన్ కాలేజ్ మద్ధతుతో ఏడాది పొడవునా MB100 ఎంపికలు కొనసాగాయి. 2023 MB100 గురించి మీనింగ్‌ఫుల్ బిజినెస్ వ్యవస్థాపకులు టామ్ లిట్టన్-డిక్కీ వ్యాఖ్యానిస్తూ.. ఈ ఏడాది జాబితాలో చోటు దక్కించుకున్న భారతీయులకు అభినందనలు తెలిపారు. వారు ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తున్నట్లు చెప్పారు. పలు ముఖ్యమైన సవాళ్లను పరిష్కరించడంలో వారు తీసుకున్న చొరవ ఎంతో ప్రశంసనీయమన్నారు.
ఫ్రాంటియర్ మార్కెట్స్ CEO అజైత షా, ప్యాడ్‌కేర్ ల్యాబ్స్ CEO అజింక్యా ధరియా, ఫూల్.కో CEo అంకిత్ అగర్వాల్, రేస్ ఎనర్జీ కో ఫౌండర్ అరుణ్ శ్రేయస్, ఎలక్ట్రిక్ పే CEO అవినాష్ శర్మ, బేరు ఎన్విరాన్‌మెంటల్ సర్వీసెస్ వ్యవస్థాపకురాలు దివ్య హెగ్డే, సెరీన్ CEO ఇషానీ రాయ్, మైనుస్కో CEO మహదేవ్ చిక్కన్న, గ్రామ్ హీట్ CEO పంకజ్ మహల్లే, బ్యాటరీ స్మార్ట్ కో ఫౌండర్ పుల్కిత్ ఖురానా సహా ఇతరులు ఈ జాబితాలో ఉన్నారు.


Click it and Unblock the Notifications