TGSRTC:ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పిన ఆర్టీసీ.. ఆ బస్సులో 40 శాతం ఛార్జీలు తగ్గింపు..!

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(TGSRTC) ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది. పలు బస్సుల్లో ఛార్జీలు తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. శంషాబాద్‌‌ ఎయిర్ పోర్డుకి రాకపోకలు సాగించే టీజీఎస్‌‌ఆర్టీసీ పుష్పక్‌‌ ఏసీ బస్సుల ఛార్జీలను ఆర్డీసీ 40 శాతం వరకు తగ్గించినట్లు వెల్లడించింది. ఈ ఛార్జీలు బుధవారం నుంచే అమల్లోకి రానున్నాయని ప్రకటించింది. మియాపూర్‌‌ ఎక్స్‌‌రోడ్‌‌ నుంచి ఎయిర్​పోర్ట్​కు గతంలో రూ.350గా ఉండగా, ఇప్పుడు రూ.250 చేసింది. అలాగే, జేఎన్‌‌టీయూ నుంచి రూ.350 ఉంటే రూ.200, శిల్పారామం నుంచి రూ.300 ఉంటే రూ.200, గచ్చిబౌలి నుంచి రూ.300 ఉంటే రూ.150కి తగ్గించారు. లింగంపల్లి నుంచి ఎయిర్​పోర్ట్​కు ఇదివరకు రూ.300 ఉండగా రూ.200కు, ఆల్విన్‌‌ ఎక్స్‌‌రోడ్‌‌ నుంచి రూ.350 ఉంటే రూ.200కు, కొండాపూర్‌‌ నుంచి రూ.300 ఉంటే రూ.200కు, కొత్తగూడ నుంచి రూ.300 ఉంటే రూ.150కి తగ్గించారు. గచ్చిబౌలి నుంచి రూ.300 ఉండగా, రూ.150 చేశారు.

మందమల్లమ్మ నుంచి జేబీఎస్‌‌, జేబీఎస్‌‌ నుంచి మెహిదీపట్నం, జేబీఎస్‌‌ నుంచి ఆరాంఘర్​వరకు చార్జీని .100గా నిర్ణయించారు. అంతేకాకుండా మరో కీలక ప్రకటన చేసింది. పండుగ రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రయాణికులు బస్ డిపోలకు వెళ్లే శ్రమ లేకుండా నేరుగా కాలనీలు, టౌన్‌షిప్‌లు, గేటెడ్ కమ్యూనిటీల నుంచే ప్రత్యేక బస్సులను నడపాలని నిర్ణయం తీసుకుంది. కనీసం 30 మంది ప్రయాణికులు ఉంటే చాలు, వారి ప్రాంతం నుంచే ప్రత్యేక బస్సును ఏర్పాటు చేయనున్నట్లు టీజీఎస్‌ఆర్టీసీ వెల్లడించింది. ఈ ప్రత్యేక వెసులుబాటును హాస్టళ్లు, కళాశాలల్లో ఉంటున్న విద్యార్థులకు కూడా వర్తింపజేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు.

RTC

సొంతూళ్లకు వెళ్లే విద్యార్థులు, కాలనీల వాసులు తమ ప్రాంతానికి సంబంధించిన టీజీఎస్‌ఆర్టీసీ అధికారులను సంప్రదించి ఈ ప్రత్యేక సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. దీనికోసం గ్రేటర్ హైదరాబాద్ జోన్ పరిధిలోని వివిధ డివిజిన్ల అధికారుల ఫోన్ నంబర్లను ఆర్టీసి అందుబాటులో ఉంచింది. బతుకమ్మ, దసరాకు సంబంధించి ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు ఆర్టీసి ప్రకటించింది. అయితే ప్రత్యేక బస్సుల్లో ఛార్జీలు ఎక్కువగా వసూలు చేసే ఆవకాశం ఉంది. దాదాపు 50 శాతం అధికంగా ఛార్జీలు ఉండే అవకాశం ఉంది. ప్రయాణికులు ఎక్కువగా ఉన్నప్పుడు ప్రత్యే బస్సులు నడిపితే.. వన్ వేలో మాత్రమే ట్రాఫిక్ ఉంటుందని అధికారులు చెబుతున్నారు. అందుకే డీజిల్ డబ్బులు కోసం ఛార్జీలు పెంచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఉదాహరణకు జేబీఎస్ నుంచి కరీంనగర్ వైపు వెళ్లేవారు ఎక్కువగా ఉంటారు. ఇక్కడ నుంచి ప్రత్యేక బస్సులు నడిపితే.. ఇక్కడ నుంచి వెళ్లేవారు అధికంగా ఉంటారు. అయితే బస్సు తిరుగు ప్రయాణంలో సరిగా ప్రయాణికులు రారు. దీంతో ఆర్టీసీకి నష్టం వచ్చే అవకాశం ఉంది. అందుకే 50 శాతం అధికంగా ఛార్జీలు వసూలు చేసే అవకాశం ఉంది. అయితే ప్రత్యేక బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కొనసాగుతుందని అధికారులు చెబుతున్నారు. పల్లె వెలుగు, ఎక్స్ ప్రెస్ ల్లో మాత్రమే ఉచితంగా ప్రయాణించవచ్చు.

డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+