ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆందోళన వ్యక్తం చేశారు. జగన్ ప్రభుత్వం విధానాల కారణంగా ఆదాయం తగ్గుతోందని దుయ్యబడుతున్నారు. ప్రభుత్వ వైఖరితో పెట్టుబడులు రావడం లేదన్నారు. ఎక్కువగా అప్పులు తెచ్చుకుంటున్న రాష్ట్రాల్లో ఏపీని మొదటి స్థానానికి తీసుకు వెళ్లారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏపీ ఆర్థిక వ్యవస్థపై ఆయన ఏం చెప్పారంటే...

అప్పులు పెరిగాయి, వసూళ్లు తగ్గాయి..
ఆంధ్రప్రదేశ్‌లో ద్రవ్యోల్భణం బాగా పెరిగింది. పన్ను వసూళ్లు ఏకంగా 7 శాతం మేర తగ్గిపోయాయి. వాహనాల సేల్స్ 31 శాతం పడిపోయాయి. ఇక రాష్ట్రం అప్పులు ఏకంగా 16 శాతం పెరిగాయి. పారిశ్రామికోత్పత్తి నిలిచి విద్యుత్ డిమాండ్ 16 శాతం మేర తగ్గింది.

ఇంతగా వాహన విక్రయం తగ్గిన రాష్ట్రం ఏపీనే
తొమ్మిది నెలల్లో వాహనాల విక్రయం ఆంధ్రప్రదేశ్‌లో 31 శాతం మేర తగ్గిపోయాయి. ఇంతగా తగ్గిన రాష్ట్రం దేశంలో ఇది ఒక్కటే. దాదాపు ఏడాది కాలంగా దేశవ్యాప్తంగా ఆటో సేల్స్ పడిపోయిన విషయం తెలిసిందే. అయితే ఏపీలో అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువగా పడిపోయాయని టీడీపీ అధినేత చెబుతున్నారు.

ప్రజల కొనుగోలు శక్తి 60 శాతం పడిపోయింది
రాష్ట్రాలకు విమానాల రాకపోకలు ఏడు శాతం మేర తగ్గాయి. పన్ను వసూళ్లు కర్ణాటకలో 23 శాతం పెరిగాయి. కానీ ఏపీలో మాత్రం 7 శాతం తగ్గాయి. ప్రజల కొనుగోలు శక్తి ఏకంగా 60 శాతం వరకు పడిపోయింది.

తొమ్మిది నెలల్లోనే రూ.40వేల కోట్ల అప్పు
ఈ తొమ్మిది నెలల్లోనే రూ.40వేల కోట్ల అప్పులు చేశారు. దీంతో రుణభారం పదహారు రెట్లు పెరిగింది. దేశంలోని ఏ రాష్ట్రం కూడా ఇంతగా అప్పులు చేయలేదు.

డేటా సెంటర్ వస్తే ఉద్యోగాలు
విశాఖపట్నంకు డేటా సెంటర్ పరిశ్రమ తేవాలని భావించాను. దీంతో వేలాది ఉద్యోగాలు వస్తాయి. కన్వెన్షన్ సెంటర్ ఏర్పాటు కోసం లూలూ కంపెనీని ఒప్పించేందుకు కొచ్చిన్ వెళ్లి, అక్కడ కట్టిన మెగా కాంప్లెక్స్‌ను కూడా చూశాం. విశాఖలో డేటా సెంటర్, దీంతో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరిగేందుకు తాము ఇంత కష్టపడితే జగన్ దీనిని కాలరాశారు. లూలూ కంపెనీ వస్తే విశాఖలో పర్యాటక రంగం కూడా పెరిగేది.

కియా కంపెనీ
అనంతపురం జిల్లాలో కియా కార్ల కంపెనీని ఏర్పాటు చేశాం. ఈ కంపెనీ రావడం వల్ల 20 వేల ఉద్యోగాలు వచ్చాయి. చుట్టుపక్కల గ్రామాలకు వందల ట్రిప్పుల బస్సులు ఉద్యోగులతో తిరుగుతున్నాయి. అలాగే విశాఖకు కూడా డేటా సెంటర్ వల్ల ఉద్యోగాలు వచ్చేవి.

శివనాడార్ వస్తే..
HCL కంపెనీ శివనాడార్ విజయవాడకు వస్తే ఆయనను కార్లో విమానాశ్రయం వరకు దించి వచ్చాం. కియ కోసం కొరియాకు వెళ్లాం. లూలూ కంపెనీని ఒప్పించడానికి కొచ్చిన్ వెళ్లాం. విద్యుత్ పీపీఏలను తిరగదోడాలన్న ప్రభుత్వ నిర్ణయంపై అంతర్జాతీయంగా విమర్శలు వచ్చాయి.

మూడు రాజధానుల వల్ల భారం
మూడు రాజధానుల వల్ల రాష్ట్రంపై భారం పడుతుందని, ఎక్కువ ఖర్చు అవుతుందని, సమయం కూడా వృథా అవుతుందని చంద్రబాబు చెప్పారు. మూడు రాజధానుల వల్ల ఖర్చు, టైం వేస్ట్ అవుతున్నాయని సౌతాఫ్రికా ప్రధాని చెప్పారని, మన వద్ద మూడు రాజధానులు అంటే మూడు చోట్ల కార్లు, ఇళ్లు, కార్యాలయాలు ఉండాలన్నారు. ప్రజాప్రతినిధులకు జీతాలు మూడు రెట్లు పెంచాలన్నారు. ఏడాదికి 365 రోజులే ఉందని, జగన్ మాయ చేసి దానిని 700కో 750 రోజులకో పెంచాలన్నారు.
More From GoodReturns

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..



Click it and Unblock the Notifications