Stock Market: ఫ్లాట్ ట్రేడింగ్ కొనసాగిస్తున్న మార్కెట్ సూచీలు.. మిశ్రమ గ్లోబల్ మార్కెట్లలో..
Stock Market: వరుస నష్టాలకు నిన్న దేశీయ మార్కెట్లు బ్రేక్ వేస్తూ లాభాల్లో ముగిసిన సంగతి తెలిసిందే. నేడు అంతర్జాతీయ మార్కెట్లు మిశ్రమంగా ఉండటంతో ప్రధాన సూచీలు ఫ్లాట్ గా కొనసాగుతున్నాయి.
ఉదయం 9.45 గంటల సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 76 పాయింట్ల నష్టంలో కొనసాగుతుండగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 30 పాయింట్లను కోల్పోయింది. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 38 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 25 పాయింట్ల నష్టంలో కొనసాగుతున్నాయి. ఇవి అంతర్జాతీయ మర్కెట్లకు అద్ధం పడుతూ ట్రేడింగ్ కొనసాగిస్తున్నాయి.

రంగాల వారీగా పరిశీలిస్తే.. ఆటో, బ్యాంక్, ఇన్‌ఫ్రా, ఎనర్జీ, మెటల్స్, ఫార్మా, పీఎస్‌యూ బ్యాంకులు పుంజుకోగా.. ఐటీ, ఎఫ్‌ఎంసీజీలు ఒత్తిడిలో ట్రేడింగ్ కొనసాగిస్తున్నాయి. ఇదే క్రమంలో మైనింగ్ కింగ్ అనిల్ అగర్వాల్ కు చెందిన వేదాంత కంపెనీ విభజన వార్తల నేపథ్యంలో స్టాక్ 2 శాతం మేర ఇంట్రాడేలో నష్టపోయింది. సంస్థ పునర్నిర్మాణం గురించి దాని రుణదాతలకు వెల్లడించినట్లు బ్లూమ్‌బెర్గ్ వెల్లడించింది.
ఎన్ఎస్ఈలో ఎల్ టి, బజాజ్ ఆటో, యాక్సిస్ బ్యాంక్, జేఎస్డబ్ల్యూ స్టీల్, హిందాల్కొ, టాటా స్టీల్, ఓఎన్జీసీ, అదానీ ఎంటర్ ప్రైజెస్, సన్ ఫార్మా, అపోలో హాస్పిటల్స్, ఎస్బీఐ, టాటా మోటార్స్, అదానీ పోర్ట్స్, మారుతీ, యూపీఎల్, రిలయన్స్, హీరో మోటార్స్, ఎయిర్ టెల్ కంపెనీలు లాభాలతో ఇంట్రాడేలో టాప్ గెయినర్లుగా కొనసాగుతున్నాయి.
ఇదే క్రమంలో టెక్ మహీంద్రా, ఏషియన్ పెయింట్స్, బజాజ్ ఫైనాన్స్, హెచ్డీఎఫ్సీ లైఫ్, ఐటీసీ, ఐషర్ మోటార్స్, నెస్లే, హిందుస్థాన్ యూనీలివర్, బ్రిటానియా, హెచ్సీఎల్ టెక్నాలజీస్, ఇన్ఫోసిస్, కోటక్ బ్యాంక్, గ్రాసిమ్, విప్రో, బజాజ్ ఫిన్ సర్వ్, ఐసీఐసీఐ బ్యాంక్, డాక్టర్ రెడ్డీస్, టైటాన్, టీసీఎస్ కంపెనీల షేర్లు నష్టాల్లో ట్రేడింగ్ కొనసాగిస్తూ టాప్ లూజర్లుగా నిలిచాయి.


Click it and Unblock the Notifications