Stock Market: సెన్సెక్స్-నిఫ్టీ దూకుడు.. ఫెడ్ ప్రకటనతో స్థిమితపడ్డ మార్కెట్లు..
Market opening: దేశీయ స్టాక్ మార్కెట్లు నిన్నటి లాభాల ముగింపు తర్వాత నేడు ప్రీఓపెన్ సెషన్లో భారీ ర్యాలీని నమోదు చేశాయి. వాస్తవానికి అమెరికా సెంట్రల్ బ్యాంక్ ఫెడరల్ రిజర్వు వడ్డీ రేట్లను యథతథంగా కొనసాగించనున్నట్లు ప్రకటించటంతో మార్కెట్లలో బుల్స్ జోరు కనిపిస్తోంది.
ఉదయం 9.16 గంటల సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 592 పాయింట్ల లాభంలో కొనసాగుతుండగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 173 పాయింట్ల మేర లాభపడింది. ఇదే క్రమంలో నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 572 పాయింట్లు, నిఫ్టీ బ్యాంక్ సూచీ 448 పాయింట్లు పెరుగుదలను నమోదు చేశాయి. ఈ క్రమంలో క్రామ్టన్ గ్రీవర్స్, ఆర్వీఎన్ఎల్, జీఈ పవర్ కంపెనీల షేర్లు ప్రధానంగా ఫోకస్‌లో కొనసాగుతున్నాయి.

ఎన్ఎస్ఈలో టాటా స్టీల్, బీపీసీఎల్, హిందాల్కొ, జేఎస్డబ్ల్యూ స్టీల్, హెచ్సీఎల్ టెక్నాలజీస్, విప్రో, ఇండస్ఇండ్ బ్యాంక్, ఎల్ టిఐఎమ్, కోల్ ఇండియా, టాటా మోటార్స్, అదానీ పోర్ట్స్, ఎన్టీపీసీ, యూపీఎల్, బజాజ్ ఫైనాన్స్, ఇన్ఫోసిస్, పవర్ గ్రిడ్, ఎస్బీఐ, అదానీ ఎంటర్ ప్రైజెస్, గ్రాసిమ్, ఐషర్ మోటార్స్ కంపెనీల షేర్లు లాభాలతో టాప్ గెయినర్లుగా ఇంట్రాడేలో ట్రేడింగ్ కొనసాగిస్తున్నాయి.
ఇదే క్రమంలో నెస్లే, బ్రిటానియా, డాక్టర్ రెడ్డీస్, హీరో మోటార్స్, హిందుస్థాన్ యూనీలివర్ కంపెనీల షేర్లు నష్టాలతో తమ ప్రయాణాన్ని ప్రస్తుతం కొనసాగిస్తున్నాయి.


Click it and Unblock the Notifications