For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బుల్లెట్ రైలు ప్రాజెక్ట్ .. హై-స్పీడ్ రైలు వంతెనల నిర్మాణానికి సాంకేతిక బిడ్లకు ఆహ్వానం

|

భారతదేశంలోని మొట్టమొదటి బుల్లెట్ రైలు ప్రాజెక్టును అభివృద్ధి చెయ్యనున్న నేషనల్ హై-స్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్‌హెచ్‌ఎస్‌ఆర్‌సిఎల్) మార్చిలో మహారాష్ట్ర - గుజరాత్ బోర్డర్, వడోదరలోని జరోలి విలేజ్ మధ్య డబుల్ లైన్ హైస్పీడ్ రైల్వే కోసం వంతెనల నిర్మాణానికి సాంకేతిక బిడ్లను ఆహ్వానించింది. ఈ ప్రక్రియలో మొత్తం నలుగురు బిడ్డర్లు పాల్గొన్నారు . సమర్పించిన బిడ్లు పరిశీలన చెయ్యనున్నారు.

చైనా కుబేరుల జాబితాలో జాక్‌మా వెనక్కు.. మొదటి స్థానం నుండి నాలుగో స్థానానికి .. రీజన్ ఇదే !!చైనా కుబేరుల జాబితాలో జాక్‌మా వెనక్కు.. మొదటి స్థానం నుండి నాలుగో స్థానానికి .. రీజన్ ఇదే !!

బులెట్ రైల్ ప్రాజెక్ట్ కోసం బిడ్లను ఆహ్వానించిన ఎన్‌హెచ్‌ఎస్‌ఆర్‌సిఎల్

బులెట్ రైల్ ప్రాజెక్ట్ కోసం బిడ్లను ఆహ్వానించిన ఎన్‌హెచ్‌ఎస్‌ఆర్‌సిఎల్

ఎన్‌హెచ్‌ఎస్‌ఆర్‌సిఎల్ విడుదల చేసిన ఒక ప్రకటన ప్రకారం, ప్రస్తుతం ప్యాకేజీ కోసం పాల్గొనే బిడ్డర్లు రంజిత్ బిల్డ్‌కాన్ లిమిటెడ్, ఎం జి కాంట్రాక్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్, కెఈసి - సామ్ ఇండియా జెవి, మరియు గ్రిల్ - జిపిటి (జెవి) సంస్థలు ఈ బులెట్ రైల్ ప్రాజెక్ట్ కోసం బిడ్లను సమర్పించాయి .

దీనితో పాటు, నేషనల్ హై-స్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ ప్రత్యేక టెండర్‌లో వంతెనలు, స్టీల్ టస్ వంతెనల నిర్మాణానికి సాంకేతిక బిడ్లను కూడా ఆహ్వానించింది.

గుజరాత్ రాష్ట్రంలోని వడోదర, అహ్మదాబాద్ మధ్య డబుల్ లైన్ హైస్పీడ్ రైల్వే కోసం వంతెనల నిర్మాణం

గుజరాత్ రాష్ట్రంలోని వడోదర, అహ్మదాబాద్ మధ్య డబుల్ లైన్ హైస్పీడ్ రైల్వే కోసం వంతెనల నిర్మాణం

బుల్లెట్ రైలు ప్రాజెక్టు కోసం గుజరాత్ రాష్ట్రంలోని వడోదర, అహ్మదాబాద్ మధ్య డబుల్ లైన్ హైస్పీడ్ రైల్వే కోసం ఈ వంతెనలను నిర్మించనున్నారు. ప్రస్తుతానికి, ఈ ప్యాకేజీ కోసం పాల్గొనే బిడ్డర్లు యుఆర్సి కన్స్ట్రక్షన్ (పి) లిమిటెడ్, రంజిత్ బిల్డ్కాన్ లిమిటెడ్, కెఇసి - సామ్ ఇండియా జెవి, ఎం జి కాంట్రాక్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్, మరియు గ్రిల్ - జిపిటి (జెవి)లు గా పేర్కొంది .

దేశంలోని మొట్టమొదటి బుల్లెట్ రైలు కారిడార్ - 508 కిలోమీటర్ల పొడవైన హైస్పీడ్ రైలు గంటకు 320 కిలోమీటర్ల వేగంతో నడుస్తుంది. ఈ మార్గంలో, హైస్పీడ్ బుల్లెట్ రైలు 12 స్టేషన్లను కవర్ చేస్తుంది.

 1,390 కోట్ల డాలర్ల మౌలిక సదుపాయాల కల్పనకు ఎల్ అండ్ టీ తో ఒప్పందం

1,390 కోట్ల డాలర్ల మౌలిక సదుపాయాల కల్పనకు ఎల్ అండ్ టీ తో ఒప్పందం

గుజరాత్, మహారాష్ట్ర, అలాగే దాద్రా మరియు నగర్ హవేలీలలోని వివిధ ప్రాంతాల గుండా వెళుతుంది. ఎన్‌హెచ్‌ఎస్‌ఆర్‌సిఎల్‌ ప్రకారం, మొత్తం దూరం రెండు-మూడు గంటల్లో అన్ని స్టాప్‌లతో ఉంటుంది. ఇటీవల, సంస్థ 1,390 కోట్ల డాలర్ల మౌలిక సదుపాయాల కల్పనకు ప్రధాన లార్సెన్ & టూబ్రో (ఎల్ అండ్ టి) తో ఒప్పందం కుదుర్చుకుంది . ఐహెచ్ఐ కన్సార్టియం ముంబై అహ్మదాబాద్ బుల్లెట్ రైలు ప్రాజెక్టు కోసం 28 ఉక్కు వంతెనల ప్రొక్యూర్ మెంట్, రైల్వే లైన్లు, నదులు, రహదారులు, రోడ్లు మరియు ఇతర నిర్మాణాలను దాటడానికి సదుపాయాల కల్పన చెయ్యనుంది .

Read more about: maharashtra
English summary

బుల్లెట్ రైలు ప్రాజెక్ట్ .. హై-స్పీడ్ రైలు వంతెనల నిర్మాణానికి సాంకేతిక బిడ్లకు ఆహ్వానం | Bullet train project : Invitation to technical bids for construction of high-speed rail bridges

The National High-Speed Rail Corporation Limited (NHSRCL), responsible for developing the country's first bullet train project, invited technical bids for the construction of bridges for the double line high-speed railway between Zaroli Village at Maharashtra – Gujarat Border and Vadodara on March 4. A total of four bidders participated in the process and the submitted bids will go through an evaluation process in the next stage.
Story first published: Saturday, March 6, 2021, 19:20 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X