Eicher Motors: నాలుగో త్రైమాసికంలో కంపెనీలు తమ కార్పొరేట్ ఫలితాలతో పాటు పెట్టుబడిదారులకు డివిడెండ్, బోనస్ షేర్ల రూపంలో బహుమతులు అందిస్తున్నాయి. తాజాగా ఆటో రంగానికి చెందిన కంపెనీ సైతం భారీ డివిడెండ్ ప్రకటించింది.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది ఐషర్ మోటార్స్ లిమిటెడ్ కంపెనీ గురించే. డివిడెండ్ ఆదాయం కోసం వెతుకున్న పెట్టుబడిదారులకు తాజాగా ఐషర్ మోటార్స్ అతిపెద్ద అవకాశాన్ని అందిస్తోంది. బుల్లెట్ తయారీ కంపెనీ ఐషర్ మోటార్స్ లిమిటెడ్ 5100 శాతం డివిడెండ్ ఇవ్వాలని నిర్ణయించింది. దీంతో అర్హత కలిగిన పెట్టుబడిదారులు తాము కలిగి ఉన్న ఒక్కో షేరుపై రూ.51 చొప్పున డివిడెండ్ ఆదాయాన్ని అందిస్తోంది. 42వ AGM తర్వాత కంపెనీ పెట్టుబడిదారులకు డివిడెండ్ చెల్లించనుంది.

ఐషర్ మోటార్స్ ఇటీవల తన మార్చి త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. వాణిజ్య వాహనాల తయారీ కంపెనీ 2024 జనవరి-మార్చి మధ్య కాలానికి మెుత్తంగా రూ.1,070.45 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. దీంతో నికర లాభం వార్షిక ప్రాతిపదికన 18.2 శాతం పెరిగింది.
గత ఏడాది ఇదే సమయంలో కంపెనీ నికర లాభం కేవలం రూ.905.58 కోట్లుగా ఉంది. శుక్రవారం మార్కెట్ల ముగింపు సమయానికి ఐషర్ మోటార్స్ లిమిటెడ్ షేరు ధర 1.98 శాతం పెరిగి రూ.4,657.65గా ఉంది. గడచిన ఏడాది కాలంలో ఈ కంపెనీ షేర్ల ధరలు 36 శాతం పెరిగాయి. కనీసం నెల రోజుల కిందట కంపెనీ షేర్లను కొని ఇప్పటి వరకు హోల్డ్ చేసిన ఇన్వెస్టర్లు స్టాక్ ర్యాలీతో 8 శాతం రాబడిని అందుకున్నారు.
కంపెనీ 52 వారాల గరిష్ఠ స్థాయి రూ.4,708.70 వద్ద ఉండగా.. 52 వారాల కనిష్ట స్థాయి రూ.3,159.20గా ఉంది. ప్రస్తుతం కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.1,27,529.08 కోట్లుగా ఉంది. ఐషర్ లిమిటెడ్ గత ఏడాది ఆగస్టు నెలలో ఎక్స్-డివిడెండ్ స్టాక్‌గా స్టాక్ మార్కెట్‌లో చివరిసారిగా ట్రేడ్ చేయబడింది. అప్పట్లో కంపెనీ ఒక్కో షేరుపై రూ.37 చొప్పున డివిడెండ్ అందించింది.


Click it and Unblock the Notifications