Stock Market: మార్కెట్లలో కొనసాగుతున్న బుల్ దూకుడు.. తగ్గిన గ్లోబల్ మార్కెట్ సంకేతాలు
Stock Market: నిన్న దిమ్మతిరిగే లాభాలతో ముగిసి దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు సైతం అదే ధోరణిని అనుకరించే అవకాశం కనిపిస్తోంది. ఈ క్రమంలో ఒక్కరోజే ముదుపరుల సంపద దాదాపు రూ.2 లక్షల కోట్ల కంటే ఎక్కువ పెరిగింది.
ఉదయం 9.22 గంటల సమయంలో దేశీయ స్టాక్ మార్కెట్లలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 160 పాయింట్లు, మరో కీలక సూచీ నిఫ్టీ 49 పాయింట్లు, నిఫ్టీ బ్యాంక్ సూచీ 194 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 192 పాయింట్ల మేర లాభాల్లో కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సంకేతాలు దీనికి దోహదపడుతున్నాయి.

చాలా కంపెనీలు తమ క్యూ-4 ఫలితాలను విడుదల చేయటంతో మార్కెట్లలో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా ఉన్నారు. ఇదే సమయంలో ఐపీవోగా వచ్చిన మ్యాన్ కైండ్ ఫార్మా నేడు దేశీయ స్టాక్ మార్కెట్లలో లిస్ట్ కానుందని తెలుస్తోంది. ఇదే క్రమంలో దివాలా తీసిన గో ఫస్ట్ సంస్థకు చెందిన 36 విమానాల రిజిస్ట్రేషన్ రద్దు చేయాలని కోరుతూ లీజర్లు డీజీసీఏని అభ్యర్థించారు. అయితే డబ్బు లేక నేలకొరిగిన ఈ కంపెనీ తిరిగి గాల్లోకి లేవగలదా లేదా అనే విషయం తెలియాల్సి ఉంది.
NSEలో బజాజ్ ఫిన్ సర్వ్, అదానీ ఎంటర్ ప్రైజెస్, కోల్ ఇండియా, అదానీ పోర్ట్స్, టాటా స్టీల్, టాటా మోటార్స్, ఇండస్ ఇండ్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, ఎల్ టి, టైటాన్, అల్టాటెక్ సిమెంట్, జేఎస్డబ్ల్యూ స్టీల్, పవర్ గ్రిడ్, యాక్సిస్ బ్యాంక్, హెచ్డీఎఫ్సి, మహీంద్రా అండ్ మహీంద్రా, ఐసీఐసీఐ బ్యాంక్, ఏషియన్ పెయింట్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కంపెనీల షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి.

ఇదే సమయంలో సూచీలో యూపీఎల్, సన్ ఫార్మా, హిందాల్కొ, ఎస్బీఐ, హిందుస్థాన్ యూనిలివర్, హెచ్సీఎల్ టెక్, నెస్లే, ఎస్బీఐ లైఫ్, ఐషర్ మోటార్స్, టాటా కన్జూమర్, భారతీ ఎయిర్ టెల్, రిలయన్స్, కోటక్ బ్యాంక్, ఇన్ఫోసిస్, ఐటీసీ, సిప్లా, డాక్టర్ రెడ్డీస్, దివీస్ ల్యాబ్స్, టెక్ మహీంద్రా, మారుతీ కంపెనీల షేర్లు మాత్రం నష్టాలతో టాప్ లూజర్స్ గా నిలిచాయి.


Click it and Unblock the Notifications