Stock Market: సెన్సెక్స్, నిఫ్టీ తుపాను లాభాలు.. దలాల్‌స్ట్రీట్‌లో ఆగని బుల్ ర్యాలీ..
Market Opening: దేశీయ స్టాక్ మార్కెట్లలో బుల్ రంకెలు డిసెంబర్ ప్రారంభం నుంచి పెరిగాయి. కీలక సూచీలు సరికొత్త రికార్డు స్థాయిలను అందుకుంటూ ముందుకెళ్తున్నాయి. ఈ క్రమంలో కన్సాలిడేషన్ గురించి నిపుణులు ఆలోచిస్తున్నారు.
ఉదయం 9.20 గంటల సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 241 పాయింట్ల లాభంలో ఉండగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 76 పాయింట్ల మేర లాభాల్లో కొనసాగుతోంది. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 165 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 236 పాయింట్ల లాభాల్లో ముందుకు సాగుతున్నాయి.

నిన్న బ్యాంక్ నిఫ్టీ సూచీ రికార్డు గరిష్ఠాలకు చేరుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నేడు ఆరంభ ట్రేడింగ్ సమయంలోనే సెన్సెక్స్, నిఫ్టీలు తమ రికార్డుల మోతను మోగించటం ప్రారంభించాయి. ఈ క్రమంలో సెన్సెక్స్ 69,614.04 పాయింట్ల స్థాయికి అందుకోగా.. మరో సూచీ నిఫ్టీ సరికొత్త 52 వారాల గరిష్ఠమైన 20,956.55 పాయింట్ల స్థాయిని అందుకుంది.
ఎన్ఎస్ఈలో అదానీ పోర్ట్స్, అదానీ ఎంటర్ ప్రైజెస్, యూపీఎల్, ఏషియన్ పెయింట్స్, బీపీసీఎల్, పవర్ గ్రిడ్, సన్ ఫార్మా, హెచ్డీఎఫ్సీ లైఫ్, ఎల్ టిఐఎమ్, కోల్ ఇండియా, మహీంద్రా అండ్ మహీంద్రా, బ్రిటానియా, హెచ్సీఎల్ టెక్నాలజీస్, ఎల్ టి, ఐటీసీ, నెస్లే, రిలయన్స్, విప్రో, ఇండస్ఇండ్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఫిన్ సర్వ్, దివీస్ ల్యాబ్, డాక్టర్ రెడ్డీస్, బజాజ్ ఫైనాన్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఓఎన్జీసీ, ఎస్బీఐ, టైటాన్ సహా మరిన్ని కంపెనీల షేర్లు లాభాలతో ట్రేడింగ్ కొనసాగిస్తూ టాప్ గెయినర్లుగా నిలిచాయి.
ఇదే క్రమంలో బజాజ్ ఆటో, హిందాల్కొ, ఐసీఐసీఐ బ్యాంక్, ఐషర్ మోటార్స్, ఎస్బీఐ లైఫ్, సిప్లా, అల్ట్రాటెక్ సిమెంట్స్, జేఎస్డబ్య్లూ స్టీల్, టాటా స్టీల్, గ్రాసిమ్, ఇన్ఫోసిస్, మారుతీ, ఎయిర్ టెల్ కంపెనీల షేర్లు నష్టాలతో టాప్ లూజర్లుగా తమ ప్రయాణాన్ని ముందుకు సాగిస్తున్నాయి.


Click it and Unblock the Notifications