వారెన్ బఫెట్ వారసుడు ఇతనే, అతనికి వయస్సు అడ్డంకి..!

ప్రముఖ ఇన్వెస్టర్ వారెన్ బఫెట్ బెర్క్‌షైర్ హాత్‌వే వారసుడిని ప్రకటించారు. ఈ సంస్థ వైస్ చైర్మన్ గ్రెగ్ అబెల్ తన వారసుడిగా కొనసాగుతారని బఫెట్ అన్నారు. వారెన్ బఫెట్ వయస్సు ప్రస్తుతం 90 దాటింది. ఆయన తర్వాత కంపెనీకి వారసులు ఎవరనేది చాలామందిని వేధించిన ప్రశ్న. ఇప్పుడు దానికి సమాధానం లభించింది.

తన స్థానాన్ని 58 ఏళ్ల గ్రెగ్ అబెల్‌తో భర్తీ చేసేందుకు బోర్డు అంగీకారం తెలిపిందని వారెన్ బఫెట్ చెప్పారు. చాలాకాలం నుండి వారసుడి పేర్లలో గ్రెగ్ పేరు వినిపిస్తోంది. కానీ వారసత్వ నిర్ణయాలను ఈ కంపెనీ రహస్యంగా ఉంచుతోంది. తమ వద్ద ఇందుకు సంబంధించి పూర్తి ప్రణాళిక ఉందని గతంలోనే తెలిపింది.

Buffett says Greg Abel is his likely successor at Berkshire

మరో వైస్ చైర్మన్ అజిత్ జైన్‌ను కూడా ఇందుకు పరిశీలించినప్పటికీ, వయస్సు కీలకంగా మారిందని చెబుతున్నారు. గ్రెగ్, అజిత్ ఇద్దరూ అద్భుత వ్యక్తులని బఫెట్ అన్నారు. బెర్క్ షైర్ వైస్ చైర్మన్ చార్లీ ముంగర్ కూడా యాన్యువల్ మీటింగ్ సందర్భంగ అబెల్ పేరును ప్రస్తావించారు.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+