కేంద్ర బడ్జెట్ 2025 కోసం సాంప్రదాయ హల్వా వేడుకను ఈ రోజు జనవరి 24న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలో నిర్వహించనున్నారు. అయితే ఈ బడ్జెట్ నిర్మలమ్మకి ఏడో కేంద్ర బడ్జెట్. సెంట్రల్ సెక్రటేరియట్‌లోని నార్త్ బ్లాక్‌లో ఈ హల్వా కార్యక్రమం జరగనుంది. ఫిబ్రవరి 1న దేశ కేంద్ర బడ్జెట్‌ను పార్లమెంట్‌లో ప్రవేశ పెట్టనున్న సంగతి మీకు తెలిసిందే.
ఎవరెవరు ఉంటారంటే
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ వేడుకను పర్యవేక్షిస్తారు, అయితే రాష్ట్ర మంత్రి పంకజ్ చౌదరితో పాటు వివిధ కార్యదర్శులు కూడా ఈ హాల్వా వేడుకకి హాజరుకానున్నారు. బడ్జెట్ తయారీలో పాలుపంచుకున్న అధికారులు, ఉద్యోగులు కూడా ఇందులో పాల్గొంటారు. ఈ ఆచారం బడ్జెట్ ఫైనాన్షియల్ పేపర్స్ సిద్ధం చేయడంలో వారి అంకితభావాన్ని గుర్తిస్తుంది.

హల్వా వేడుక ప్రాముఖ్యత
హల్వా వేడుక అనేది యూనియన్ బడ్జెట్ సన్నాహాల "లాక్-ఇన్" దశకు ముందు జరిగే వార్షిక సంప్రదాయం. ఇందులో 'హల్వా' అనే తీపి వంటకాన్ని నార్త్ బ్లాక్‌లోని పెద్ద కడాయిలో వండుతారు. కేంద్ర ఆర్థిక మంత్రి బడ్జెట్ తయారీలో పాల్గొన్న ప్రజలకు అందిస్తారు. వాస్తవానికి ఇది వారి ప్రయత్నాలకు ప్రశంసల చిహ్నం. ఈ హాల్వా వేడుక బడ్జెట్ పత్రాలను పార్లమెంట్‌లో సమర్పించే ముందు వాటి ప్రింటింగ్ ప్రారంభాన్ని సూచిస్తుంది. 1980 నుండి, ఈ బడ్జెట్ పేపర్ల ప్రింటింగ్ నార్త్ బ్లాక్ బేస్ మెంట్లో ప్రతిఏడాది జరుగుతోంది. ఈ వేడుక ఆర్థిక మంత్రిత్వ శాఖలో లాక్‌డౌన్‌కు ప్రారంభం, అంటే బడ్జెట్‌ను ప్రవేశపెట్టె వరకు అధికారులు బయటకు వెళ్లకుండా లాక్ చేస్తారు.
బడ్జెట్ ప్రెజెంటేషన్ టైమ్‌లైన్
బడ్జెట్ 2025 సెషన్ జనవరి 31న ప్రారంభమై ఏప్రిల్ 4న ముగుస్తుంది. ఫిబ్రవరి 1న బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జనవరి 31న పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు, ఇది బడ్జెట్ సమావేశాల ప్రారంభానికి ఒక గుర్తు. ఫిబ్రవరి 14 నుంచి పార్లమెంటు విరామం తీసుకుంటుంది, మళ్ళీ మార్చి 10న తిరిగి ప్రారంభమవుతుంది. గత ఏడాది బడ్జెట్‌లాగానే బడ్జెట్ 2025 కూడా పేపర్-లెస్ ఫార్మాట్‌లో సమర్పించనున్నారు.
నిర్మలా సీతారామన్ రికార్డు
ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్‌కి ఇది వరుసగా ఏడో బడ్జెట్. 1959 నుండి 1964 మధ్య ఆర్థిక మంత్రిగా ఐదు వార్షిక బడ్జెట్‌లు అలాగే ఒక మధ్యంతర బడ్జెట్‌ను సమర్పించిన మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్ రికార్డును నిర్మల సీతారామన్ అధిగమించారు.
More From GoodReturns

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

వెండి ధరలు మళ్లీ పెరుగుతున్నాయి..సిల్వర్ కొనుగోలుపై నిపుణులు కీలక సూచన..

Bengaluru: టెక్కీ సంచలనం..! రూ. 3 లక్షల నుంచి ఏకంగా రూ. 80 లక్షల ప్యాకేజీ.. అది కూడా 3 ఏళ్లలోనే!

New rules: మీ దగ్గర పాన్ కార్డ్ ఉందా? ఏప్రిల్ 1 లోపు ఈ మార్పులు తెలుసుకోకపోతే ఇబ్బందే!



Click it and Unblock the Notifications