Budget 2024: మరికొన్ని రోజుల్లో దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరగనుండగా.. కేంద్ర ప్రభుత్వం ఈ దఫా చివరి మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. ఎలక్షన్స్ అనంతరం ఏర్పడబోయే కొత్త గవర్నమెంట్ పూర్తిస్థాయి బడ్జెట్ సమర్పించాల్సి ఉంటుంది. అయితే గత ప్రభుత్వాల మాదిరిగా కాకుండా మోదీ సర్కారు గ్రీన్ బడ్జెట్ కు ప్రాముఖ్యత ఇచ్చింది.
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ మరోసారి పేపర్‌లెస్ ఫార్మాట్‌లో మధ్యంతర బడ్జెట్‌ను సమర్పించారు. వరుసగా నాల్గవ సంవత్సరం ఈ పద్ధతిలో బడ్జెట్ ప్రవేశపెట్టారు. పర్యావరణ అనుకూల ఎంపికలను ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం 2021 నుంచి డిజిటల్‌గా పద్దు సమర్పిస్తూ వస్తోంది. పార్లమెంట్‌లో మంత్రి నిర్మలా సీతారామన్ ప్రసంగం పూర్తైన తర్వాత బడ్జెట్ పత్రాలను ఆన్‌లైన్లో ఉంచుతారు.

డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ (DEA) ఆధ్వర్యంలో ఇవి ప్రజలకు అందుబాటులో ఉంటాయి. ఇందుకోసం 'యూనియన్ బడ్జెట్' పేరిట iOS మరియు అండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఆధారిత యాప్‌ని నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ (NIC) రూపొందించింది. ప్రజలు మరియు పార్లమెంటు సభ్యులు బడ్జెట్ పత్రాలను యాక్సెస్ చేయడానికి ఈ యాప్స్ అనుమతిస్తుంది.
రాజ్యాంగబద్ధంగా నిర్దేశించబడిన వార్షిక ఆర్థిక నివేదికలు (AFS), డిమాండ్స్ ఫర్ గ్రాంట్స్ (DG), ఫైనాన్షియల్ బిల్లులు, ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ బడ్జెట్ మేనేజ్‌మెంట్ యాక్ట్ (FRBM) చట్టం కింద తప్పనిసరి చేసిన స్టేట్‌మెంట్‌లతో సహా 14 యూనియన్ బడ్జెట్ పత్రాలను ఈ యాప్ ద్వారా వీక్షించవచ్చు. 2021లో కేంద్ర బడ్జెట్ ముందు హల్వా వేడుకలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ మొబైల్ యాప్‌ను ప్రవేశపెట్టారు.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications