Gold News: బంగారానికి బ్లాక్ డే.. 10 లక్షల కోట్లు ఫసక్.. చరిత్రలో ఆరో అతిపెద్ద సంపద సంక్షోభం
Black Day for Gold: మానవ జీవితంలో జరిగిన అనుకోని సంఘటనల వల్ల భారీ నష్టం వాటిల్లితే వాటిని 'బ్లాక్ డేస్'గా చెబుతారు. ఈ తరహా ఘటనల ప్రభావం ప్రజలపై పెద్ద మొత్తంలో ఉంటుంది. అయితే ఇటీవల పార్లమెంటులో ప్రవేశపెట్టిన బడ్జెట్ కూడా ఇలాంటి ఓ 'బ్లాక్ డే'కు కారణమైంది. జూలై 23, 2024 బంగారానికి చీకటి రోజుగా పరిణమించింది.
ఈ ఏడాది ప్రారంభం నుంచి బంగారం ధరల్లో భారీ ర్యాలీ కనిపించింది. ఏకంగా 14.7 శాతం పెరిగి ఏకంగా బెంచ్ మార్క్ సెన్సెక్స్‌ను సైతం అధిగమించాయి. అయితే పార్లమెంట్‌లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన ఓ ప్రకటన.. పసిడి మెరుపులకు కళ్లెం వేసింది. ఒక్కసారిగా ధరల పతనంతో లక్షల కోట్ల సంపద తుడిచిపెట్టుకుపోయింది.

బడ్జెట్ 2024 లో బంగారంపై కస్టమ్స్ డ్యూటీని తగ్గిస్తూ నిర్మలమ్మ ప్రకటన చేశారు. ఆ వెంటనే పసిడి ధరలు 5 శాతానికి పైగా పడిపోయాయి. ఆ ఒక్క రోజే 10.7 లక్షల కోట్లకు పైగా సంపద ఆవిరైంది. ఈక్విటీ మార్కెట్‌లతో పోల్చినా కూడా ఇప్పటివరకు నమోదైన అతిపెద్ద సంపద సంక్షోభాల్లో ఇది ఆరవదిగా నిలిచింది. మరీ ముఖ్యంగా ఈక్విటీలలో పతనం వల్ల కలిగే నష్టం కంటే పసిడి సంక్షోభం వల్ల ఎక్కువ కుటుంబాలు ప్రభావితమయ్యాయి.
ప్రపంచంలోని మొత్తం బంగారంలో భారతీయ కుటుంబాలు దాదాపు 11 శాతం కలిగి ఉన్నాయి. బడ్జెట్‌లో సడన్ ప్రకటన ద్వారా పసిడి విలువ తగ్గించేందుకు ప్రభుత్వం చేసిన ప్రయత్నాన్ని బంగారం వ్యాపారులు నెగిటివ్‌గా తీసుకున్నారు. వారి హోల్డింగ్‌లను విక్రయించడం, లాభాలను బుక్ చేసుకోవడం ప్రారంభించారు.
దీంతో జూలైలో ఇప్పటివరకు MCX బంగారం దాదాపు 5.2 శాతం పడిపోయింది.


Click it and Unblock the Notifications