Flight Ticket: అనేక మందికి జీవితకాలంలో ఒక్కసారైనా విమాన ప్రయాణం చేయాలనే కోరిక ఉంటుంటుంది. అయితే ఖరీదైన ఈ రవాణా వ్యవస్థను ప్రస్తుతం బడ్జెట్ విమానసంస్థలు తక్కువ ధరలకే అందుబాటులోకి తీసుకొస్తున్నాయి.
వివరాల్లోకి వెళితే ప్రముఖ విమానయాన కంపెనీ స్పైస్ జెట్ స్వాతంత్య దినోత్సవం సందర్భంగా కళ్లు చెదిరే ధరలకే టిక్కెట్లను విక్రయిస్తోంది. కంపెనీ అందిస్తున్న ఇండిపెండెన్స్ డే స్పెషల్ ఆఫర్ కింద.. కేవలం రూ.1,515కే విమాన ప్రయాణాన్ని ఆస్వాధించొచ్చు. ఈ ఆఫర్ డొమెస్టిక్ ప్రయాణాలకు మాత్రమే వర్తిస్తుందని వెల్లడించింది. ఆ స్పెషల్ ఆఫర్ టిక్కెట్ల విక్రయం ఆగస్టు 14 నుంచి ప్రారంభమై ఆగస్టు 20 వరకు అందుబాటులో ఉంటుందని కంపెనీ వెల్లడించింది.

టికెట్లు బుక్ చేసుకున్న వారు ఆగస్టు 15, 2023 నుంచి మార్చి 30, 2024 మధ్య కాలంలో ఎప్పుడైనా తమ ప్రయాణాన్ని బుక్ చేసుకునేందుకు కంపెనీ వెసులుబాటు కల్పించింది. అయితే ఈ ఆఫర్ కింద లిమిటెడ్ సంఖ్యలో సీట్లను అందుబాటులో ఉంచుతున్నట్లు ప్రకటించింది. త్వరపడి టిక్కెట్లు బుక్ చేసుకోకపోతే సాధారణంగా లభించే రెగ్యులర్ ధరలకే ప్రయాణికులు టిక్కెట్లను కొనుక్కోవాల్సి ఉంటుంది.
కంపెనీ ప్రకటించిన స్పెషల్ ఆఫర్ ఏఏ మార్గాల్లో ప్రయాణించే విమావ సర్వీసులకు అందుబాటులో ఉంటుందనే వివరాలు తెలుసుకోవాలంటే అధికారిక వెబ్ సైట్ కి వెళ్లాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన అదనపు సమాచారం కోసం కస్టమర్ కేర్ సేవలను సైతం ప్రయాణికులు వినియోగించుకోవచ్చు. ఆఫర్‌లో భాగంగా టికెట్ బుక్ చేసుకున్న వారికి సేల్ అయిపోయిన తర్వాత వారం రోజుల్లో రూ.2,000 వేల వరకు విలువైన ఫ్రీ ఫ్లైట్ వోచర్ లభిస్తుంది. జస్ట్ రూ.15 చెల్లించి విమానంలో నచ్చిన సీటు ఎంపిక చేసుకునేందుకు అవకాశం కూడా ఉంది.


Click it and Unblock the Notifications