Mutual Funds: మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్లకు బడ్జెట్‌లో బ్యాడ్ న్యూస్.. ఇవీ వివరాలు
Tax on Mutual Funds: ప్రజల్లో పెరుగుతున్న ఆర్థిక అక్షరాస్యతతో మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు పెట్టేవారి సంఖ్య పెరుగిపోతోంది. RBI గవర్నర్ కూడా ఇటీవల కుటుంబ పొదుపు కాస్తా బ్యాంక్ సేవింగ్స్ ఖాతాలు మరియు ఫిక్స్డ్ డిపాజిట్ల నుంచి మ్యూచువల్ ఫండ్స్‌లోకి వెళ్లిపోతున్నట్లు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో నిన్న నిర్మలమ్మ పార్లమెంటుకు సమర్పించిన బడ్జెట్‌లో కీలక ప్రతిపాదనలు చేశారు.
ఈక్విటీ ఆధారిత మ్యూచువల్ ఫండ్స్‌పై స్వల్పకాలిక మూలధన లాభాలు (STCG) మరియు దీర్ఘకాలిక మూలధన లాభాల (LTCG)పై పన్ను పెంచుతున్నట్లు ఆర్థిక మంత్రి నిన్న బడ్జెట్‌లో ప్రకటించారు. దీంతో ఈక్విటీ ఫండ్లలో 50 వేల సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (SIP) పద్ధతిలో 5 ఏళ్లు ఇన్వెస్ట్ చేస్తే ఇప్పటివరకు 77 వేల 456 పన్ను చెల్లించాల్సి వచ్చేది. తాజా బడ్జెట్ ప్రతిపాదనతో అదికాస్తా 94 వేల 95కి పెరిగింది.

ఎందుకంటే మ్యూచువల్ ఫండ్స్‌పై STCG పన్నును ప్రస్తుతం ఉన్న 15 శాతం నుంచి 20 శాతానికి కేంద్రం పెంచింది. అదే విధంగా LTCG కూడా గతంలో 10 శాతం ఉండగా అది ఇప్పుడు 12.5 శాతానికి చేరింది. అయితే కొంత ఉపశమనం ఇస్తూ, LTCG పన్ను మినహాయింపు పరిమితిని ఓ ఆర్థిక సంవత్సరంలో 1 లక్ష నుంచి 1.25 లక్షలు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
SIP ద్వారా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్‌లో నెలకు 10 వేలు పెట్టుబడి పెడితే, హోల్డింగ్ వ్యవధి మరియు పన్ను రేటును నిర్ణయించడానికి ప్రతి ఇన్‌స్టాల్‌మెంట్ విడిగా పరిగణించబడుతుందని గమనించాల్సి ఉంటుంది. మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్‌మెంట్‌లు రిడీమ్ చేయబడే సందర్భాల్లో పన్ను విధానాన్ని నిర్ణయించడానికి ఫస్ట్-ఇన్-ఫస్ట్-అవుట్ (FIFO) విధానాన్ని అనుసరిస్తారు.


Click it and Unblock the Notifications